హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Battery Life: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచే ఫీచర్లు వస్తున్నాయి

Smartphone Battery Life: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచే ఫీచర్లు వస్తున్నాయి

Smartphone Battery Life: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచే ఫీచర్లు వస్తున్నాయి
(ప్రతీకాత్మక చిత్రం)

Smartphone Battery Life: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచే ఫీచర్లు వస్తున్నాయి (ప్రతీకాత్మక చిత్రం)

Smartphone Battery Life | మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోందా? ఫుల్ ఛార్జింగ్ చేసినా ఒక్క రోజు కూడా ఫోన్ వాడలేకపోతున్నారా? స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచే ఫీచర్స్‌ని రూపొందిస్తోంది గూగుల్.

బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపరిచేందుకు గూగుల్ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. తమ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ను ఇంతకు ముందు ఆండ్రాయిడ్ 11 బీటా 2 వర్షన్‌తో పాటు XDA డెవలపర్లలో గుర్తించారు. కానీ ఆ సమయంలో అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. ఆండ్రాయిడ్ 11 సోర్స్ కోడ్ విశ్లేషణ ప్రకారం బ్యాటరీ లైఫ్‌ను పొడిగించేందుకు గూగుల్ క్యాచీలో(మినిమైజ్ చేసిన యాప్‌ లిస్ట్‌) ఉన్న యాప్‌లను స్తంభింపజేస్తుంది. దీంతో వినియోగదారులు ఇంతకుముందులా క్యాచీలో ఉండే యాప్‌ లేదా వెబ్ పేజీలను తిరిగి యాక్సెస్ చేసుకోలేరు. క్యాచీలో ఉండే యాప్‌లను తిరిగి ఓపెన్ చేస్తే వాటి హోమ్‌ పేజీలు మాత్రమే ప్రత్యక్షమవుతాయి. ఈ ఫీచర్‌ను డిఫాల్ట్‌గా ఎనేబుల్ చేసుకోవచ్చు.

Online Shopping Tricks: ఫెస్టివల్ సేల్‌లో ఆర్డర్స్ చేస్తున్నారా? ఈ ట్రిక్స్ మీకోసమే

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఎలా పనిచేస్తుంది?


ఆండ్రాయిడ్ 11 సోర్స్ కోడ్‌ ప్రకారం ఈ ఫీచర్ ‘సస్పెండ్ ఎగ్జిక్యూషన్‌ ఫర్‌ క్యాచ్‌డ్ యాప్స్’ ఆప్షన్‌తో అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా క్యాచీలో ఉన్న యాప్‌లను ఫ్రీజ్‌ చేయవచ్చు. క్యాచీ నుంచి రీ ఓపెన్ చేసిన తరువాత వాటిని అన్ ఫ్రీజ్‌ చేయవచ్చు. ఈ ఫీచర్లో స్తంభింపజేసిన(ఫ్రీజ్‌డ్) యాప్‌లు CPUను ఉపయోగించవు. దీంతో వీటికి పవర్(బ్యాటరీ) అవసరం ఉండదు. గతంలో క్యాచీలో ఉన్న యాప్‌లు బ్యాటరీని వాడేవి. ఇప్పుడు ఈ ఫీచర్‌ ద్వారా వాటిని స్తంభింపజేసి, బ్యాటరీ నుంచి పవర్ తీసుకోకుండా చేయడం వల్ల బ్యాటరీ లైప్ పెరుగుతుంది. ఈ ఫీచర్‌ ఇతర వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలపై స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు బ్యాటరీ లైఫ్‌ను పొడింగించేందుకు వివిధ యాప్‌లను సైతం వాడుతున్నారు.

పిక్సెల్ ఫోన్లలో ఉంది


సస్పెండ్ ఎగ్జిక్యూషన్‌ ఫర్‌ క్యాచ్‌డ్ యాప్స్ ఫీచర్‌ను గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్4 ఫోన్లలోని ఆండ్రాయిడ్ 11 సోర్స్ కోడ్‌లో ఇన్‌బిల్ట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ అవసరం లేదనుకునే వినియోగదారులు డెవలపర్స్‌ సెట్టింగ్స్‌లో దీన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. దీంతో ప్రతిసారీ రీబూట్ చేయకుండా క్యాచీలో ఉండే యాప్‌లను ఇష్ట ప్రకారం వాడుకోవచ్చు. ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేయడానికి సెట్టింగ్స్‌లోని సిస్టమ్> అడ్వాన్స్> డెవలపర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ కనిపించే సస్పెండ్ ఎగ్జిక్యూషన్ ఫర్‌ క్యాచ్‌డ్ యాప్స్‌ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవచ్చు.

Flipkart Sale: రూ.54,990 విలువైన స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్‌లో రూ.19,990 ధరకే... అదిరిపోయే ఆఫర్

Samsung Smartphone offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

బ్యాటరీ లైఫ్‌ను పెంచుతాయి


పిక్సెల్ 5 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న 'ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్' ఫీచర్‌ను ఇతర పిక్సెల్ డివైజ్లకూ తీసుకొచ్చేందుకు గూగుల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఫీచర్ను ఎనేబుల్ చేసుకుంటే ఫోన్‌లో ఉండే చాలా యాప్‌లను, నోటిఫికేషన్‌లను కూడా Android స్తంభింపజేస్తుంది. బ్లూటూత్, వై-ఫై యాక్సెస్ చేసుకునే లొకేషన్ స్కానింగ్‌ను ఆటేమేటిగ్గా ఆపేస్తుంది. స్క్రీన్ టైమ్‌అవుట్ను 30 సెకన్లకు తగ్గిస్తుంది. హాట్‌స్పాట్‌ వంటి అదనపు ఫీచర్లను ఆపేస్తుంది. ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ ద్వారా బ్యాటరీ లైఫ్‌ను 48 గంటల వరకు పొడిగించుకోవచ్చని గూగుల్ తెలిపింది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Android 11, Smartphone

ఉత్తమ కథలు