మైక్రోసాఫ్ట్ (Microsoft) సహకారంతో OpenAI కంపెనీ చాట్‌జిపిటి (ChatGpt)ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి పోటీగా కొన్ని నెలల క్రితమే గూగుల్ కంపెనీ బార్డ్(Bard) చాట్‌బాట్‌ను అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు బార్డ్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. బార్డ్‌కి లిమిటెడ్ యాక్సెస్‌ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే కొంతమంది పిక్సెల్ వినియోగదారులకు బార్డ్‌ను టెస్ట్ చేయడానికి గూగుల్ ఆహ్వానం పంపింది. బార్డ్ చాట్‌బాట్ అప్‌డేట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* యూఎస్, యూకేలో అందుబాటులోకి
ప్రస్తుతం యూఎస్, యూకేలోని పరిమిత సంఖ్యలో వినియోగదారులకు మాత్రమే బార్డ్ అందుబాటులో ఉంటుంది. పిక్సెల్ సూపర్‌ఫ్యాన్‌ల సహా కొందరు ఇప్పటికే యాక్సెస్ పొందారు. ఇతరులు వెయిట్‌లిస్ట్‌లో జాయిన్ అయి బార్డ్‌ని టెస్ట్ చేసే అవకాశం పొందవచ్చు. ఈ అవకాశం కూడా కేవలం US, UK లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర ప్రాంతాల వారికి ఎప్పుడు అవకాశం లభిస్తుందనే అంశంలో గూగుల్ స్పష్టత ఇవ్వలేదు.
బార్డ్ ప్రాజెక్ట్ లీడ్స్ అయిన సిస్సీ హ్సియావో, ఎలి కాలిన్స్ మాట్లాడుతూ.. ‘బార్డ్‌ని టెస్ట్ చేయడం ద్వారా ఇప్పటివరకు మేము చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు వినియోగదారుల నుంచి విలువైన ఫీడ్‌బ్యాక్ అందుకుని, మరింత మెరుగు పరచాల్సిన కీలక దశలో ఉన్నాం.’ అని పేర్కొన్నారు. అయితే వినియోగదారులు ఇప్పుడు ప్రకటించింది బార్డ్ పబ్లిక్ రిలీజ్ కాదని గుర్తుంచుకోవాలి. బార్డ్ అందరికీ ఎప్పుడు ఓపెన్ అవుతుందనే అంశంపై సిస్సీ హ్సియావో, ఎలి కాలిన్స్ మాట్లాడలేదు.
* బింగ్ ఏఐతో పోలిక?
గూగుల్ అనౌన్స్‌మెంట్‌లోని స్క్రీన్‌షాట్‌లలో బార్డ్ ఇంటర్‌ఫేస్ గమనిస్తే.. బింగ్ ఏఐ(Bing AI)కి పోలికలు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని ముఖ్యమైన వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ప్రతి రెస్పాన్స్ కింద- థంబ్స్ అప్, థంబ్స్ డౌన్, రిఫ్రెష్ యారో, గూగుల్ ఇట్ వంటి నాలుగు బటన్‌లు ఉన్నాయి. వ్యూ అదర్ డ్రాఫ్ట్స్ బటన్ ద్వారా వినియోగదారులు ఇతర రెస్పాన్స్‌లను చూడవచ్చు.
ఇది కూడా చదవండి : మరో కొత్త రూట్ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఏప్రిల్ 8న ప్రారంభించనున్న ప్రధాని మోదీ ..
ఎర్రర్స్‌ను నివారించడానికి Google "గార్డ్‌రైల్స్"ని అమలు చేసినప్పటికీ, బార్డ్ ఎల్లప్పుడూ ఖచ్చితమైన ప్రతిస్పందనలను అందించకపోవచ్చని కంపెనీ హెచ్చరించింది. బార్డ్‌ను మెరుగుపరచడంలో సహాయపడటానికి గూగుల్ తన వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సేకరించే పనిలో ఉంది.
గూగుల్ బ్లాగ్‌లో చేసిన పోస్ట్ మేరకు.. ‘మేము బార్డ్‌ని మరింత మెరుగుపరిచే ప్రయత్నాలను కొనసాగిస్తాం. కోడింగ్, మల్టిపుల్ లాంగ్వేజ్‌లు, మల్టీమోడల్ ఎక్స్‌పీరియన్సెస్ వంటి సామర్థ్యాలను యాడ్ చేస్తాం. ఓ విషయం స్పష్టంగా చెబుతున్నాం.. మేము మీతో పాటు నేర్చుకుంటాం. మీ ఫీడ్‌బ్యాక్‌తో బార్డ్‌ను మరింతగా అభివృద్ధి చేస్తూనే ఉంటాం.’ అని పేర్కొంది. గూగుల్ కంపెనీ ప్రకారం, బార్డ్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి ప్రత్యామ్నాయం కాదు. గూగుల్ సెర్చ్ ఫంక్షన్‌కి సహకరిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatgpt, Google, Google bard, Latest Technology, Tech news