GOOGLE SHUTDOWNS INBOX APP AND GOOGLE OFFICIALLY ON APRIL 2 SS
Google Apps: రెండు యాప్స్ ఆపేసిన గూగుల్... మీ ఫోన్లో ఉంటే డిలిట్ చేయండి
Google Apps: రెండు యాప్స్ ఆపేసిన గూగుల్... మీ ఫోన్లో ఉంటే డిలిట్ చేయండి
Google Apps | యూజర్ల ఆదరణ పొందలేని గూగుల్ ప్లస్‌ను షట్‌డౌన్ చేస్తామని చాలాకాలం క్రితమే ప్రకటించింది గూగుల్. ఆ తర్వాత ఆ జాబితాలో ఇన్‌బాక్స్ యాప్ కూడా చేరిపోయింది.
మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌కు చెందిన ఇన్‌బాక్స్, గూగుల్ ప్లస్ యాప్స్ ఉన్నాయా? వాటిని వెంటనే డిలిట్ చేయండి. ఏప్రిల్ 2న ఈ రెండు యాప్స్‌ని అధికారికంగా షట్‌డౌన్ చేసింది గూగుల్. యూజర్ల ప్రొఫైల్స్ డిలిట్ చేసే ప్రక్రియ మొదలైంది. ఇకపై ఈ యాప్స్‌ని మీరు ఉపయోగించుకోలేరు. అంతగా యూజర్ల ఆదరణ పొందలేని గూగుల్ ప్లస్‌ను షట్‌డౌన్ చేస్తామని చాలాకాలం క్రితమే ప్రకటించింది గూగుల్. ఆ తర్వాత ఆ జాబితాలో ఇన్‌బాక్స్ యాప్ కూడా చేరిపోయింది. ముందే చెప్పినట్టుగా ఏప్రిల్ 2 నుంచి ఈ యాప్స్ సేవలు నిలిచిపోయాయి.
గూగుల్ ప్లస్ గూగుల్ నుంచి వచ్చిన సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్. ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ ప్లస్‌ను ప్రారంభించింది. మొదట్లో యూజర్లను ఆకట్టుకున్నా ఆ తర్వాత ఫేస్‌బుక్‌కు గట్టిగా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో యూజర్లు ఫేస్బుక్కే అలవాటుపడ్డారు. గూగుల్ ప్లస్ యూజర్ల సంఖ్య తగ్గింది. దానికి తోడు 2015 నుంచి గూగుల్ ప్లస్ యూజర్ల డేటా పలుమార్లు చోరీకి గురైంది. థర్డ్ పార్టీ యాప్స్ డేటాను కొట్టేస్తున్నట్టు గూగుల్ విచారణలో తేలింది. దీంతో గూగుల్ ప్లస్ సర్వీస్‌ను షట్‌డౌన్ చేయాలని నిర్ణయించింది గూగుల్.
గూగుల్ నుంచి వచ్చిన మరో ఇమెయిల్ సర్వీస్ ఇన్‌బాక్స్. ఏప్రిల్ 2న ఇది కూడా అధికారికంగా మూతపడింది. Inbox మెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ను 2014లో ప్రారంభించింది గూగుల్. జీమెయిల్ కన్నా ఇందులో మంచి ఫీచర్లే ఉన్నా యూజర్లను ఆకట్టుకోలేదు. ఇప్పుడు జీమెయిల్లో కనిపిస్తున్న ఇమెయిల్ స్నూజ్, ఏఐ, స్మార్ట్ రిప్లై, హై ప్రియారిటీ నోటిఫికేషన్స్, స్మార్ట్ కంపోజ్ లాంటి ఫీచర్లు మొదట ఇన్‌బాక్స్‌లోనే కనిపించాయి. అయినా ఇన్‌బాక్స్ మెయిలింగ్ సర్వీస్‌కు ఆదరణ రాకపోవడంతో అవే ఫీచర్లను జీమెయిల్లోకి తీసుకొచ్చింది గూగుల్. ఏప్రిల్ 2న గూగుల్ ప్లస్‌తో పాటు ఇన్‌బాక్స్ సర్వీస్‌ను షట్‌డౌన్ చేసింది.
Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.