సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకోవడంలో ముందుంటుంది. తాజాగా గూగుల్ (Google) తన గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్, జీమెయిల్ యాప్‌లకు కొత్త ఫీచర్లను జోడించింది. సులభంగా వీటిని ఉపయోగించేలా అనేక ఆప్షన్లను పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ల ద్వారా యూజర్లు వారి కంటెంట్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వర్క్‌స్పేస్ కోసం గూగుల్ కొత్త అప్డేట్లను సైతం ప్రకటించింది. ఇందులో గూగుల్ షీట్లలో రీసైజ్ పివోట్ టేబుల్స్, జీమెయిల్లో (gmail) మెరుగైన సెర్చింగ్ రిజల్ట్స్ వంటివి జోడించింది. గూగుల్ షీట్లలో, పివోట్ టేబుల్ ఎడిటర్ సైడ్ ప్యానెల్ సైజ్‌ను మార్చగలిగే ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది.
బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. నిలువు వరుసలు లేదా ఫీల్డ్‌ల పేర్లు చాలా పొడవుగా ఉన్నప్పటికీ మొత్తం టెక్స్ట్‌ను చూడాలనుకునే సందర్భంలో ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, వెబ్ ద్వారా ఈ–మెయిల్ యాక్సెస్ చేయడాన్ని సులభతం చేస్తుంది. దీనికి గాను ఇటీవల జీమెయిల్ సెర్చింగ్ యాక్టివిటీని ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్లన్నీ జీమెయిల్ సెర్చింగ్‌ను సులభతరం చేస్తాయని బ్లాగ్ పోస్ట్ తెలిపింది.
రూ.20 వేలకే ఐఫోన్ .. ఫ్లిప్‌కార్ట్ కిర్రాక్ ఆఫర్!
గూగుల్ స్లైడ్స్ నుంచి ఇతర ఆండ్రాయిడ్ యాప్‌లలోకి టెక్ట్స్, ఇమేజ్‌లను సులువుగా డ్రాగ్, డ్రాప్ సౌకర్యాన్ని కల్పించింది. టాబ్లెట్స్, ఫోల్డబుల్ ఫోన్లలో ఇరవై కంటే ఎక్కువ అప్లికేషన్లను అప్డేట్ చేయనున్నట్లు కూడా గూగుల్ ప్రకటించింది. ఒకేసారి పలు విండోస్ ఓపెనింగ్ సౌలభ్యాన్ని గూగుల్ డ్రైవ్‌తో ఇంటిగ్రేట్ చేసింది. ఈ కొత్త వెసులుబాటుతో రెండు వేర్వేరు విండోలోని రెండు ఫోల్డర్లను పక్కపక్కన పెట్టి డ్రాగ్, డ్రాప్ చేయవచ్చు. మరోవైపు, ఈ కొత్త ఫీచర్‌తో మల్టీమీడియా కంటెంట్‌ను చాలా వేగంగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
మతిపోగొట్టే ఆఫర్.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.37,000 భారీ తగ్గింపు!
ఈ ఏడాది ప్రారంభంలో టెక్ దిగ్గజం గూగుల్.. డాక్స్, షీట్లు లేదా స్లైడ్స్ నుంచి గూగుల్ మీట్ కాల్లో చేరగలిగే లేదా యాక్సెస్ చేయగలిగే ఫీచర్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కొత్త అప్డేట్ ప్రకారం.. యూజర్లు ఫైల్ నుంచి మీటింగ్‌ను ప్రెజెంట్ చేస్తుంటే.. ఆ ఫైల్‌ను మీటింగ్‌లోని చాట్ బాక్స్ ద్వారా హాజరైన వారికి సులభంగా షేర్ చేయవచ్చు. దీంతో మీటింగ్‌లో పాల్గొన్న వారందరూ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌కు యాక్సెస్ పొందగలరు. అంతేకాదు మీటింగ్‌కు హాజరైన వారిని ఎంపిక చేసుకోగలరు. మీటింగ్‌లోని ప్రతి ఒక్కరూ సంభాషణలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. రాబోయే 15 పనిదినాల్లోగా వర్క్‌స్పేస్, జీ సూట్ యూజర్లందరికీ ఈ కొత్త అప్డేట్లు, ఫీచర్లు అందుబాటులో ఉంటాయని గూగుల్ బ్లాగ్ పోస్ట్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GMAIL, Google, Google documents, Google news