Google: షాక్... మీ డేటాను గూగుల్ ఎవరికి ఇస్తుందో తెలుసా?

Google | యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని అడ్వర్టైజర్లతో గూగుల్ పంచుకుంటుందన్న ఆరోపణలు ఇప్పటివి కావు. చాలాకాలంగా వస్తున్నవే.

news18-telugu
Updated: September 5, 2019, 12:01 PM IST
Google: షాక్... మీ డేటాను గూగుల్ ఎవరికి ఇస్తుందో తెలుసా?
Google: షాక్... మీ డేటాను గూగుల్ ఎవరికి ఇస్తుందో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం, image: AP)
news18-telugu
Updated: September 5, 2019, 12:01 PM IST
గూగుల్... స్మార్ట్‌ఫోన్ యూజర్లు అందరూ ఆధారపడుతున్న సెర్చ్ ఇంజిన్. ఒక్క సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు... ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే స్మార్ట్‌ఫోన్స్ పనిచేస్తుంటాయి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసే ప్రతీ అంశం రికార్డ్ అవుతుంది. మీరు వాడే యాప్స్ అన్నీ గూగుల్‌కు తెలిసిపోతుంటాయి. మీ పేరు, ఊరు, వయస్సు, జెండర్, అడ్రస్... ఇలా మీకు సంబంధించిన అనేక వివరాలు గూగుల్ చేతిలో ఉంటాయి. యురోపియన్ యూనియన్ ప్రైవసీ రెగ్యులేషన్స్‌ని తప్పించుకునేందుకు హిడెన్ వెబ్ పేజెస్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని అడ్వర్టైజర్లతో గూగుల్ పంచుకుంటోందని ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ బయటపెట్టింది. బ్రౌజర్ మేకర్ బ్రేవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దర్యాప్తును మేలోనే ప్రారంభించింది డేటా ప్రొటెక్షన్ కమిషన్.

యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని అడ్వర్టైజర్లతో గూగుల్ పంచుకుంటుందన్న ఆరోపణలు ఇప్పటివి కావు. చాలాకాలంగా వస్తున్నవే. దీంతో గతంలో గూగుల్ ఈ డేటా స్కామ్ ఉచ్చులో చిక్కుకుంది. ఇప్పుడు మరో సాక్ష్యం బయటపడింది. యూజర్ల వెబ్ బ్రౌజింగ్ సమాచారం, లొకేషన్, ఇతర వివరాలను ఎలాంటి కంటెంట్ లేని వెబ్ పేజెస్ అంటే హిడెన్ పేజెస్‌లో పంపిస్తోంది గూగుల్. యురోపియన్ యూనియన్ ప్రైవసీ రెగ్యులేషన్స్‌ కళ్లుగప్పి హిడెన్ వెబ్ పేజెస్ ద్వారా రహస్యంగా యూజర్ల ప్రైవసీ సమాచారాన్ని అడ్వర్టైజర్లకు గూగుల్ చేరవేస్తోందని తేలింది. "యూజర్ల సమ్మతి లేకుండా పర్సనలైజ్డ్ యాడ్స్" అందివ్వట్లేదని గూగుల్ స్పందించింది.

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Infinix Hot 8: ట్రిపుల్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ... ధర రూ.6,999 మాత్రమే

Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
Loading...
Android 10: ఆండ్రాయిడ్ 10 వచ్చేసింది... ఆకట్టుకునే ఫీచర్స్ ఇవే
First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...