• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • GOOGLE SHARED LIST OF DOS AND DONTS UNTIL EVERYONE GETS VACCINATED FOR CORONA NS GH

Google: కరోనాకు దూరంగా ఉండండి.. ఆనందాలకు కాదు.. గూగుల్ వినూత్న ప్రచారం..

Google: కరోనాకు దూరంగా ఉండండి.. ఆనందాలకు కాదు.. గూగుల్ వినూత్న ప్రచారం..

Google India / Instagram

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఎంతటి విలయతాండవం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసిన ఈ వైరస్​ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య మౌలిక సదుపాయాలపై, ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపింది.

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఎంతటి విలయతాండవం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసిన ఈ వైరస్​ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య మౌలిక సదుపాయాలపై, ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో, ప్రజలంతా తమ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కరోనాకు విరుగుడుగా చెప్పుకుంటున్న వ్యాక్సిన్​​ ఈరోజు నుంచి సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి రావడంతో వారిలో అవగాహన పెంచేందుకు సెర్చింజన్​ దిగ్గజం గూగుల్ నడుం బిగించింది. దేశవ్యాప్తంగా ప్రజలంతా వాక్సిన్​ వేసుకునే వరకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వాక్సినేషన్ తీసుకున్న వారు సైతం ఈ జాగ్రత్తలను పాటించాలని కోరింది. ప్రజలకు సులభంగా అర్థమయ్యేందుకు, వారిలో అవగాహన కల్పించేందుకు గూగుల్​ కలర్​ఫుల్​ గ్రాఫిక్‌లను రూపొందించి యూజర్స్​తో పంచుకుంది. గూగుల్ ఇండియా సృజనాత్మకంగా తయారు చేసిన కొన్ని ఫోటోలను తన ఇన్​స్టాగ్రామ్​ వేదికగా యూజర్స్​తో పంచుకుంది. ప్రజలు చేయాల్సినవి, చేయకూడనివి అంటూ రెండు విభాగాలుగా విభజించించి వాటిని తన ఇన్​స్టాగ్రామ్ యూజర్స్​లో షే​ర్​ చేసింది.

అన్ని ఫోటోల్లోని చేయాల్సిన పనుల విభాగంలో, కరోనావైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను తెలిపింది. వాటిలో ముఖ్యంగా ఫేస్ మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం వంటి పద్ధతులను పేర్కొంది. ఇక మరోవైపు చేయకూడని పనులను కూడా తెలిపింది. దీనిలో ఇంట్లో ఉన్నప్పుడు ప్రజలు అనుసరించాల్సిన జాగ్రత్తలను స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించాలని కోరిన మొదటి ఫోటోలో, మీ భావాలకు మాత్రం మాస్క్​ వేయకండి అని కోరింది.

ఇక సోషల్​ డిస్టన్స్​ గురించి ప్రస్తావించిన తరువాతి ఫోటోలో వీడియో కాలింగ్ ద్వారా మీ స్నేహితులు, బంధువులతో ఎల్లవేలలా కనెక్ట్ అవ్వండి, వారితో సోషల్​ మీడియా ద్వారా టచ్​లో ఉండండని పేర్కొంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేతులు కడుక్కోవడాన్ని ప్రోత్సహించాలని కూడా గూగుల్​ పేర్కొంది. అయితే చక్కటి హాబీలతో మీ చేతులు మురికయ్యేలా చేసుకోమని కూడా చెప్పింది.

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
ఇక దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. మొదట్లో కేసులు కొంత మేర తగ్గినప్పటికీ, మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం, ఫిబ్రవరి 27 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,10,79,979లకు చేరింది. వీరిలో 1,07,63,451 మంది రికవరీ అయ్యారు. కాగా, వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు, 2,84,297 మంది హెల్త్​ వర్కర్స్​, ఫ్రంట్‌లైన్ వారియర్స్​కు వ్యాక్సిన్​ అందజేశారు.

భారత్​లో ఇప్పటివరకు మొత్తం 1.37 కోట్ల మంది వ్యాక్సిన్​ తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా జనవరి 16 న ప్రారంభమైంది. వ్యాక్సిన్​ ప్రారంభమైన మొదట్లో కేసుల సంఖ్య తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ పెరుగుదల నమోదవుతున్నందున, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, ఆరోగ్య సంరక్షణ అధికారులు సూచిస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు