సోమవారం సాయంత్రం ప్రపంచ దేశాల్లో గూగుల్ సేవలు కొంతసేపు నిలిచిపోయిన విషయం మనకు తెలుసు. యూట్యూబ్‌తో పాటు జీమెయిల్, గూగుల్ వర్క్ స్పేస్, సెర్చ్ ఇంజిన్ అన్నీ ఆగిపోయాయి. వేల మంది యూజర్లు కంప్లైంట్ చేశారు. గూగుల్ ప్లే, గూగుల్ మీట్, గూగుల్ క్లాస్రూమ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ హ్యాంగౌట్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ డాక్స్‌లో కూడా ఈ సమస్యలు వచ్చాయి. ఓ గంట తర్వాత గూగుల్ సమస్యను పరిష్కరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంతరాయం సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే అంటూ ట్విట్టర్లో ఓ యూజర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. "గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడినప్పుడు నా ఇంట్లో చీకటి ఏర్పడింది. నేను చీకట్లో ఉండాల్సి వచ్చింది" అని కాప్షన్ పెట్టాడు ఆ యూజర్. ఎందుకలా... గూగుల్ సేవలకూ, ఆ ఇంట్లో చీకటికీ సంబంధం ఏంటనే డౌట్ మనకు రావచ్చు.
గూగుల్ కంపెనీ మన వ్యక్తిగత జీవితాల్లోకి ఎప్పుడో వచ్చేసింది. మన ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ గూగుల్ అసిస్టెంట్‌తో కనెక్ట్ అవుతున్నాయి. అలా కనెక్ట్ చేయించుకున్నవారు... లైట్లు వెలగాలన్నా, ఏసీ ఆన్ అవ్వాలన్నా... అన్నీ గూగుల్ అసిస్టెంట్ ద్వారా పని చేయించుకుంటున్నారు. కొన్ని రకాల గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ కూడా... ఈ పనులు చేసిపెడుతున్నాయి. ఒక వేళ గూగుల్ ప్లే స్టోర్ పనిచెయ్యకపోతే... యాప్స్ కూడా పనిచెయ్యవు. దాంతో... ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పనిచెయ్యవు. అందువల్ల ప్రతీదీ టెక్నాలజీపై ఆధార పడటం అంత మంచిది కాదనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. ఆ యూజర్... గూగుల్ పై ఆధారపడకుండా ఉండి ఉంటే... తన ఇంట్లో లైట్లను తానే వెలిగించుకుని, తానే ఆర్పుకునేవాడు. గూగుల్ సర్వీసులను వాడుకోవడం వల్ల అవి ఆగిపోయే సరికి... ఇంట్లో లైట్లు కూడా వెలిగే పరిస్థితి లేకుండా పోయింది.
I’m sitting here in the dark in my toddler’s room because the light is controlled by @Google Home. Rethinking... a lot right now.
బ్రౌన్ తన ట్వీట్ ద్వారా... తాను గూగుల్ హోమ్ (Google Home) వాడుతున్నట్లు తెలిపాడు. ఇదో రకమైన ఫస్ట్ జనరేషన్ స్మార్ట్ స్పీకర్. ఇది గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ఆధారంగా కంట్రోల్ అవుతుంది. అంటే దీన్ని వాడే వారు దీనికి ఏం ఆర్డర్ ఇస్తే... స్పీకర్ అది చేస్తుంది. వాతావరణం వివరాలు చెబుతుంది. ఆన్లైన్లో వస్తువుకి ఆర్డర్ ఇస్తుంది, లైట్లను వేస్తుంది, ఆర్పేస్తుంది. ఇలా చాలా చెయ్యగలదు. ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యే వస్తువులన్నింటినీ గూగుల్ హోమ్ కనెక్ట్ చేసుకోగలదు. గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్ తీసుకుంటూ పనిచేస్తుంది. గూగుల్ సర్వీసులు ఆగినప్పుడు గూగుల్ హోమ్ కూడా ఆగిపోయింది. దాంతో... లైట్లు వెలిగే పరిస్థితి లేకుండా పోయింది.
ప్రతీదీ స్మార్ట్ వస్తువులతో కనెక్ట్ చేసుకునేవారికి ఇదో హెచ్చరికే అంటున్నారు టెక్ నిపుణులు. టెక్నాలజీని వాడటం మంచిదే కానీ... అది లేకపోతే పనులు ఆగిపోయేంతలా దానిపై ఆధారపడవద్దంటున్నారు. కనీసం స్విచ్చులు, లైట్ల వంటివైనా సొంతంగా వేసుకోమని సూచిస్తున్నారు. బ్రౌన్ కూడా తాను మరోసారి ఆలోచించుకోవాలని చెప్పడం వెనక ఉద్దేశం ఇదే. గూగుల్‌లో వచ్చిన ఓ చిన్న టెక్నికల్ సమస్య... ఇంత పెద్ద సమస్యకు కారణమైంది. సర్వీసులు గంటలోపే తిరిగి వచ్చాయి కాబట్టి సరిపోయింది... అదే మరి కొన్ని గంటలు పట్టి ఉంటే... ఎంత ఇబ్బంది అని అంటున్నారు నిపుణులు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.