Google Chrome: గూగుల్ యూజర్లకు అలర్ట్.. అర్జెంట్‌గా క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోండి

అర్జెంట్‌గా క్రోమ్‌ను అప్డేట్ చేసుకోమని చెబుతున్న గూగుల్ (PC: Google)

క్రోమ్ బ్రౌజర్‌లో ఏడు హై సెక్యూరిటీ థ్రెట్స్‌ కనుగొన్నట్లు గూగుల్ బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది. దీంతో ఈ సంస్థ తాజాగా విండోస్, మాక్ యూజర్లు వెంటనే ఆ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని కోరింది.

  • Share this:
ఇంటర్నెట్ యూజర్లకు (Internet Users) మెరుగైన సేవలందించే గూగుల్ (Google) క్రోమ్ బ్రౌజర్‌ (Chrome Browser).. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా వినియోగదారులను సొంతం చేసుకుంది. యూజర్ బేస్ పరంగా ప్రముఖ వెబ్ బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, యాపిల్ సఫారి, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి పోటీ సంస్థలపై గూగుల్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇదే సమయంలో క్రోమ్ వ్యవస్థల్లోని లోపాలను తమకు అస్త్రంగా మార్చుకునేందుకు హ్యాకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రౌజర్ సెక్యూరిటీని దాటి, వినియోగదారుల డేటాను హ్యాక్ చేయగల సామర్థ్యాలను హ్యాకర్లు అన్వేషిస్తుంటారు. ఈ ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకున్న గూగుల్.. రెండు నెలల్లో నాలుగోసారి క్రోమ్‌ బ్రౌజర్‌కు ఎమర్జెన్సీ అప్‌డేట్లు తీసుకొచ్చింది. క్రోమ్ యాప్‌ను వీలైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేసుకోవాలని కస్టమర్లను గూగుల్ కోరుతోంది.

క్రోమ్ బ్రౌజర్‌లో ఏడు హై సెక్యూరిటీ థ్రెట్స్‌ కనుగొన్నట్లు గూగుల్ బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది. దీంతో ఈ సంస్థ తాజాగా విండోస్, మాక్ ఓఎస్, లైనక్స్ వెర్షన్‌ల కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. మెరుగైన సెక్యూరిటీ కోసం వినియోగదారులు క్రోమ్ బ్రౌజర్‌ని వెర్షన్ 92.0.4515.159 కి అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ పేర్కొంది. మిగతా ఓఎస్ యూజర్లకు ఈ అప్‌డేట్ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

ఈ సెక్యూరిటీ థ్రెట్స్‌ను గుర్తించడంలో సహాయపడిన పరిశోధకులకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ బగ్స్ వివరాలు, లింక్‌లను గూగుల్ వెల్లడించలేదు. ఎక్కువ మంది వినియోగదారులు కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ అయ్యే వరకు ఈ వివరాలు బయటకు రాకపోవచ్చు. ఈ బగ్స్ గురించి సమాచారం బయటకు వస్తే, హ్యాకర్లు వీటిని సద్వినియోగం చేసుకుంటూ, యూజర్ల డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఉంది. అందువల్ల బ్రౌజర్‌ని ఇంకా అప్‌డేట్ చేయని వారు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

మీ క్రోమ్ బ్రౌజర్.. 92.0.4515.159 వెర్షన్ కి అప్‌డేట్ అయిందని నిర్ధారించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. యూజర్లు స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్స్‌ విభాగంలో హెల్ప్ సెక్షన్‌కు వెళ్లి.. About Google Chrome ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇందుతో క్రోమ్ ప్రస్తుత వెర్షన్ వివరాలు కనిపిస్తాయి. మీరు ప్రస్తుతం వాడుతున్నది 92.0.4515.159 వెర్షన్ అయితే, గూగుల్ గుర్తించిన బగ్స్ నుంచి డివైజ్‌కు సెక్యూరిటీ ఉంటుంది. ఈ బగ్ హ్యాకర్ల చేతికి చేరకముందే యూజర్లు గూగుల్ క్రోమ్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు.
Published by:John Naveen Kora
First published: