డెబిట్ కార్డ్స్‌తో చెల్లిస్తున్నారా? గూగుల్‌ చూస్తోంది... జర జాగ్రత్త!

ఆఫ్‌లైన్ షాపింగ్‌పై కూడా కన్నేసిన గూగుల్... మాస్టర్‌కార్డ్‌తో సీక్రెట్ అగ్రిమెంట్... డెబిట్ కార్డ్ ద్వారా కొన్న వస్తువుల ప్రకటనలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం... రహస్య ఒప్పందం గుట్టురట్టు చేసిన ‘బ్లూంబర్గ్’... ట్రాక్ చేస్తున్న విషయం నిజమేనని ఒప్పుకున్న గూగుల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 6, 2018, 11:13 AM IST
డెబిట్ కార్డ్స్‌తో చెల్లిస్తున్నారా? గూగుల్‌ చూస్తోంది... జర జాగ్రత్త!
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 6, 2018, 11:13 AM IST
గూగుల్... ప్రపంచంలో ఏ విషయం గురించి అడిగినా క్షణాల్లో సమాధానం చెప్పేసే మహాద్భుత సాధనం. చిన్నచిన్న జీకే కృశ్చన్స్ దగ్గర్నుంచి, రూట్ మ్యాప్స్ దాకా ఎన్నో సేవలను అందిస్తోంది గూగుల్ తల్లి. ఎన్నో సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకీ గూగుల్ ఆధారం. ప్రస్తుత పరిస్థితుల్లో గూగుల్ లేకపోతే హైటెక్ ప్రపంచం స్తంభించిపోతుంది. అయితే మార్కెటింగ్ ప్రకారం ఆలోచిస్తే గూగుల్ చేసే ప్రతిదాంట్లో గెయిన్ స్ట్రాటెజీ ఉంటుంది. మనం ఎక్కడున్నాం, ఎక్కడికెళ్తున్నాం వంటి విషయాలను ట్రాక్ చేస్తుంది గూగుల్. ఇది అందరికీ తెలిసిన పాత విషయమే. ఆన్‌లైన్‌లో మనం ఏ వస్తువుల కోసం సెర్చ్ చేస్తున్నామో ట్రాక్ చేసి, వాటినే యాడ్స్ రూపంలో ప్రత్యేక్షమయ్యేలా చేస్తుంది... ఇది కూడా చాలా పాత విషయమే. ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ మాత్రమే కాకుండా ఆఫ్‌లైన్ షాపింగ్‌పై కూడా కన్నేసింది గూగుల్.

కిషోర్ దగ్గర్లోని సూపర్ మార్కెట్‌కి వెళ్లి, ఇంటికి కావల్సిన వస్తువులు కొన్నాడు. స్టైల్‌గా జేబుల్లోంచి డెబిట్ కార్డ్ తీసి, పేమెంట్ చేశాడు. ఆ తర్వాత గూగుల్ ఓపెన్ చేసినా, గూగుల్ క్రోమ్ ద్వారా ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా తాను కొన్న తాలుకూ వస్తువుల యాడ్స్ కనిపించాయి. ఆశ్చర్యకరంగా అనిపించినా, ఆ యాడ్స్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఇది మనందరం చేసే పని. అయితే మనం ఏం కొంటున్నదీ, ఎలాంటి వస్తువులను కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నది లాంటి విషయాలన్నీ గూగుల్‌కి ఎలా తెలుస్తున్నాయి. ఈ కోణంలోనే ఓ సీక్రెట్ ఆపరేషన్ చేసింది ‘బ్లూంబర్గ్’. ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో ఓ షాకింగ్ విషయం బయటపడింది. అదే మాస్టర్ కార్డ్‌తో, గూగుల్ సీక్రెట్ పార్టనర్‌షిప్.

ఇన్నాళ్లు గూగుల్ రూపొందించిన ప్రత్యేక ఆల్‌గారిథమ్‌తో మనం సెర్చ చేసే విషయాలను ట్రాక్ చేసి, వాటికి సంబంధించిన యాడ్స్ ప్రత్యేక్షమయ్యేలా ప్లాన్ చేసిన గూగుల్, ఇప్పుడు ఆఫ్‌లైన్ కొనుగోళ్లను కూడా వదిలిపెట్టకూడదని పక్కాగా డిసైడ్ అయ్యింది. అందుకే ఆఫ్‌లైన్ కొనుగోళ్లకు ఉపయోగించే మాస్టర్‌కార్డ్‌తో రహస్య ఒప్పందం చేసుకుంది. ఏడాది క్రితం జరిగిన ఈ సీక్రెట్ అగ్రిమెంట్ కారణంగా మాస్టర్‌కార్డ్ ఉపయోగించే, మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు సమాచారం క్షణాల్లో గూగుల్‌కి అందుతోంది. ఈ సమాచారాన్ని వాడి యాడ్స్ క్రియేట్ చేసి, సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక్షం అయ్యేలా చేస్తోంది. ఈ సీక్రెట్ ఆపరేషన్ జరిపిన ‘బ్లూంబర్గ్’ ఓ ఫైనాన్సియల్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కంపెనీ.

‘బ్లూంబర్గ్’ సీక్రెట్ ఆపరేషన్ వెల్లడించిన విషయాలు నిజమేనని ఒప్పుకుంది గూగుల్.



‘‘మాకు యాడ్స్ ఇచ్చే కంపెనీ ఉత్పత్తుల గురించి మేం ప్రతీ విషయం సేకరిస్తాం. వారికి ఆన్‌లైన్‌లో ఉన్న డిమాండ్ మాత్రమే కాకుండా, ఆఫ్‌లైన్‌లో ఉన్న క్రేజ్ గురించి తెలిపేందుకే మాస్టర్‌కార్డ్‌తో ఒప్పందం చేసుకున్నాం...’ అని మీడియాకు వెల్లడించారు గూగుల్ అధికార ప్రతినిధి.

ఆఫ్‌లైన్ షాపింగ్ వివరాలను సేకరిస్తున్న విషయం వాస్తవమేనని ఒప్పుకున్న గూగుల్, వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లకుండా డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది.
First published: September 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...