Home /News /technology /

GOOGLE SAYS THAT SALES OF ANDROID TABLETS WOULD SURPASS LAPTOPS IN THE FUTURE AND COULD MORE POPULAR PRV GH

Google: ల్యాప్‌టాప్‌ల కంటే ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్లు పాపులర్ అవుతాయంటున్న గూగుల్.. ఈ విభాగంపై దృష్టి పెట్టిన కంపెనీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్ల (Android Tablets) అమ్మకాలు భవిష్యత్తులో ల్యాప్‌టాప్‌ (Laptop)లను అధిగమించనున్నాయి. ఈ విషయాన్ని గతవారం గూగుల్‌ సంస్థ (Google) ప్రకటించింది.

గత కొన్నేళ్లలో స్మార్ట్‌ఫోన్లతోపాటు ఐప్యాడ్‌ (Ipad), ట్యాబ్లెట్ల (Tablets) విక్రయాలు పెరిగాయి. కొవిడ్‌ అనంతరం ట్యాబ్లెట్ల విక్రయాలు జోరందుకొన్నాయి. కాలింగ్‌, వైఫై, పెద్ద స్క్రీన్‌తో అందుబాటులో ఉండే ట్యాబ్లెట్లను కొనేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ మార్కెట్‌లో యాపిల్‌ సంస్థదే హవా అని చెప్పాలి. స్మార్ట్‌ఫోన్లలో రాణించినంతగా ఆండ్రాయిడ్‌.. ట్యాబ్లెట్ల (Android Tablets) లో క్లిక్‌ కాలేదు. అయితే భవిష్యత్తు మొత్తం ట్యాబ్లెట్లదే అని.. దానిపై దృష్టి పెట్టామని తాజాగా గూగుల్‌ (Google) సంస్థ ప్రకటించింది.

ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్ల (Android Tablets) అమ్మకాలు భవిష్యత్తులో ల్యాప్‌టాప్‌ (Laptop)లను అధిగమించనున్నాయి. ఈ విషయాన్ని గతవారం గూగుల్‌ సంస్థ (Google) ప్రకటించింది. భవిష్యత్తులో తీసురానున్న అప్టేట్‌లు, ఫీచర్లకు సంబంధించిన అంశాల్లో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల (Android Tablets) ను చేర్చింది. దీని గురించి గూగుల్‌ ఆండ్రాయిడ్‌ అండ్‌ సీటీవో ట్యాబ్లెట్స్‌ కో ఫౌండర్‌ రిచ్‌ మిల్నెర్‌ , ది ఆండ్రాయిడ్‌ షో వోడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ట్యాబ్లెట్‌లు, జెట్‌ప్యాక్ కంపోజ్, ఆండ్రాయిడ్ 12 గురించి జరిగిన ఎపిసోడ్‌లో కొన్ని విషయాలు చర్చించారు. సంవత్సరాలుగా ట్యాబ్లెట్‌ల కోసం విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌గా మారడంలో ఆండ్రాయిడ్‌ విఫలమైందని అంగీకరించారు. స్మార్ట్‌ఫోన్లలో సాధించగలిగినంత పురోగతి, ట్యాబ్లెట్ల విషయంలో ఆండ్రాయిడ్‌కు సాధ్యపడలేదని తెలిపారు.

మార్కెట్‌ను యాపిల్‌ దూకుడు..

ఆండ్రాయిడ్‌ (Android) వైఫల్యంతో ఐప్యాడ్‌ల తయారీలో లీడర్‌గా మారడానికి యాపిల్‌కి భారీ వెసులుబాటు కలిగింది. ఐప్యాడ్‌ (I Pad)లతో మార్కెట్‌ను యాపిల్‌ ఏలుతోంది. అయితే కొవిడ్‌ కారణంగా ఉత్పాదకత పరంగా ప్రజల అవసరాలు మారాయని, నిర్మాణాత్మక మార్పును కొవిడ్‌ తీసుకొచ్చిందని మిల్నెర్‌ వివరించారు. ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా ట్యాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొస్తే ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

టాబ్లెట్ విక్రయాలు మరింత జనాదరణ పొందుతాయని..

కేవలం అవసరాలను తీర్చే డివైజ్‌లను మించిన స్థాయికి ట్యాబ్లెట్లు చేరాయి. చాలా సదుపాయాలను వినియోగదారులకు కల్పిస్తున్నాయి. ట్యాబ్లెట్ల స్క్రీన్‌ పరిమాణం పెంచితే.. ల్యాప్‌టాప్‌ (Laptops), ట్యాబ్లెట్లకు మధ్య ఉన్న అంతరాన్ని కూడా పూర్తి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. సమీప భవిష్యత్తులో ల్యాప్‌టాప్‌లను అధిగమించి టాబ్లెట్ విక్రయాలు మరింత జనాదరణ పొందుతాయని అంచనా వేశారు. దీని కోసం గూగుల్‌ పూర్తిగా ట్యాబ్లెట్లపై దృష్టి సారించి కొత్త యాప్‌లను రూపొందించడానికి డెవలపర్‌లను ప్రోత్సహించబోతోందని చెప్పారు. ఐపోడ్‌, ఐప్యాడ్‌లకు ప్రత్యామ్నాయంగా ఆండ్రాయిడ్ నిలవగలదా అనే సందేహాన్ని ఎక్కువ మంది వ్యక్తపరుస్తున్నారు.

బిగ్ స్క్రీన్ (Big Screen) డివైజ్‌ల కోసం రూపొందించిన ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ ఆండ్రాయిడ్‌ 12ఎల్‌(Android 12L)ను గూగుల్‌ (Google) విడుదల చేసింది. గూగుల్‌ ప్రసిద్ధ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా నిలిచిన ఆండ్రాయిడ్‌ L వెర్షన్, ఐప్యాడ్‌లతో పోటీపడేందుకు ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్ల (Android Tablets) కు ఉపయోగపడుతుందని గూగుల్‌ ఆశిస్తోంది. అయితే దానికి సంబంధించిన పనులు ఇప్పటికీ జరగలేదని చెబుతున్నారు.

మళ్లీ తెరపైకి..

ట్యాబ్లెట్‌లు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా Realme, Samsung, Lenovo, Xiaomi వంటి బ్రాండ్‌లు ట్యాబ్లెట్లను అందిస్తున్నాయి. యూజర్‌ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్లు మార్కెట్‌లో వినియోగదారులకు అందుబాటులోకి రావాలంటే ఆండ్రాయిడ్‌లో చాలా మార్పులు అవసరం. ఐప్యాడ్‌లపై దృష్టి పెట్టేందుకు ఐప్యాడ్‌ ఓస్‌ కీలకమని, మరిన్ని మార్పులు చేయడం అవసరమని యాపిల్‌ భావిస్తే.. ఆండ్రాయిడ్ టాబ్లెట్-సెంట్రిక్ ప్లాట్‌ఫారమ్‌గా మారడానికి చాలా సమయం పడుతుంది. అందుకే గూగుల్‌ పర్సనల్‌ కంప్యూటర్‌ల ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టడం మేలు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Android, Apple, Google, Laptops, Tablet

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు