Home /News /technology /

GOOGLE SAYS BEWARE OF SLICE APP AND QUICKLY DELETE FROM PHONE UMG GH

Slice App: మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా..? అయితే వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే డేంజర్‌లో పడినట్లే

స్లైస్ యాప్‌ను డిలీట్ చేయమంటున్న గూగుల్ (Twitter)

స్లైస్ యాప్‌ను డిలీట్ చేయమంటున్న గూగుల్ (Twitter)

ప్రస్తుతం స్లైస్ యాప్ (Slice App) చాలా హానికరమైనదని యూజర్లను గూగుల్ ప్లే ప్రొటెక్ట్ హెచ్చరిస్తోంది. ఈ యాప్ యూజర్ల పర్సనల్ డేటాపై నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తోందని... దీనిని వెంటనే డిలీట్ చేసుకోవాలని సూచిస్తోంది.

ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు సైబర్ అటాక్స్‌కి గురవుతున్నారు. హ్యాకర్లు ఏదో ఒక మార్గం ద్వారా మొబైల్ యూజర్ల బ్యాంక్ డీటెయిల్స్‌తో పాటు పర్సనల్ డేటాను తస్కరిస్తున్నారు. ముఖ్యంగా రకరకాల యాప్‌ల ద్వారా యూజర్ల వ్యక్తిగత వివరాలు, డేటాను కాజేస్తున్నట్లు ఇటీవల చాలా నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఇలాంటి హానికరమైన యాప్స్ (Harmful Apps) గురించి గూగుల్ ప్లే ప్రొటెక్ట్ (Google Play Protect) ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం స్లైస్ యాప్ (Slice App) చాలా హానికరమైనదని యూజర్లను గూగుల్ ప్లే ప్రొటెక్ట్ హెచ్చరిస్తోంది. ఈ యాప్ యూజర్ల పర్సనల్ డేటాపై నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తోందని... దీనిని వెంటనే డిలీట్ చేసుకోవాలని సూచిస్తోంది.

యూజర్ల డేటాను కొల్లగొట్టడానికి యత్నించే డేంజరస్ యాప్‌లను గుర్తించడానికి గూగుల్ ప్లే ప్రొటెక్ట్ రోజూ యాప్‌లను స్కాన్ చేస్తూనే ఉంటుంది. అయితే జూన్ 24న స్లైస్ యాప్ ఒక హానికరమైన యాప్ అని గూగుల్ ప్లే ప్రొటెక్ట్ గుర్తించింది. ఆ తర్వాత ఈ యాప్ యూజర్లందరికీ "స్లైస్ మీ ఫోన్‌ను ప్రమాదంలో పడేస్తుంది" అనే నోటిఫికేషన్ పంపింది. యూజర్లు స్లైస్ యాప్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసిన వెంటనే ఒక ప్లే ప్రొటెక్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీ స్లైస్ ఓ హానికరమైన యాప్ అని.. ఈ యాప్ మెసేజ్‌లు, ఫొటోలు, కాల్ హిస్టరీ, ఆడియో రికార్డింగ్స్‌ వంటి పర్సనల్ డేటాను రహస్యంగా చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొంది. అంతేకాదు యూజర్లను వారి డివైజ్ నుంచి యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయమని కూడా గూగుల్ ప్లే ప్రొటెక్ట్ రికమండ్ చేసింది.



బెంగళూరు బేస్డ్ పేమెంట్ & క్రెడిట్ సర్వీసెస్ అందించే ఫిన్‌టెక్ కంపెనీ స్లైస్ 2015లో స్లైస్ యాప్‌ను తీసుకొచ్చింది. అయితే గూగుల్ తన కంపెనీ యాప్ హానికరమైనదని చెబుతుండగా స్లైస్కంపెనీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. "నిన్న సాయంత్రం మేం అందించిన ఆండ్రాయిడ్ అప్‌డేట్ వల్ల ప్లేస్టోర్ నుంచి రిస్క్ నోటిఫికేషన్ యూజర్లందరికీ వెళ్ళిపోయింది. మేం ఈ సమస్య ఎక్కడ వచ్చిందో వెతికి.. 4 గంటల్లో సమస్యను పరిష్కరించాం. 1% మంది యాప్ యూజర్లు ఇప్పటికీ ప్రీవియస్ వెర్షన్‌నే యూజ్ చేస్తున్నారు. మీకు గూగుల్ వార్నింగ్ కనిపిస్తుంటే, మీ యాప్‌ను తక్షణమే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. తరువాత మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి" అని స్లైస్ జూన్ 24న ఓ ట్వీట్ చేసింది.

స్లైస్ మళ్లీ ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. స్లైస్, ఎప్పటిలాగే యూజర్ల డేటా, ప్రైవసీని ప్రొటెక్ట్ చేసేందుకు పూర్తి నిబద్ధతతో ఉందని.. మీ డేటాని దొంగలించేలా యాప్‌లో ఎలాంటి చేంజ్ తీసుకురాలేదని కంపెనీ చెప్పుకొచ్చింది. స్లైస్ యూపీఐలో యాప్ అప్‌డేట్‌ గురించి తగినంత సమాచారం అందించబడకపోవడం వల్ల ఈ సాంకేతిక లోపం ఏర్పడిందని, దీనివల్ల యూజర్లు ఫేస్ చేసిన ఇబ్బందులకు క్షమాపణలు చెబుతున్నామని తెలిపింది.
Published by:Mahesh
First published:

Tags: Apps, Cyber Attack, Google, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు