Google: ఆ యాప్ లు వాడొద్దు.. గూగుల్ కీలక సూచన!

Google: సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీలు, ఫొటోలను ఉంచేవారు వాటికి మెరుగులు దిద్దడానికి బ్యూటిఫికేషన్ యాప్‌లు, ఫిల్టర్లను ఎక్కువగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లలో ఫొటోలు తీసుకున్నప్పుడు అవి ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయ్యాయని కస్లమర్లకు తెలియకపోతే, వారు మానసిక అనారోగ్యాల బారిన పడతారని గూగుల్ చెబుతోంది.

news18-telugu
Updated: October 5, 2020, 8:14 PM IST
Google: ఆ యాప్ లు వాడొద్దు.. గూగుల్ కీలక సూచన!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్మార్ట్‌ఫోన్‌లు, సామాజిక మాధ్యమాలు మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతికత కారణంగా కలుగుతున్న దుష్ప్రభావాలు యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నయని నిపుణులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టిన వారు, వాటికి లైకులు ఎక్కువగా రాలేదని కుంగిపోతుంటారు. కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీలు, ఫొటోలను ఉంచేవారు వాటికి మెరుగులు దిద్దడానికి బ్యూటిఫికేషన్ యాప్‌లు, ఫిల్టర్లను ఎక్కువగా వాడుతున్నారు. అనేక మంది సోషల్ మీడియాలో అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి ఫోటో షేరింగ్ యాప్లో బ్యూటిఫికేషన్ చేయనిదే ఫొటోలను ఎవరూ అప్‌లోడ్‌ చేయట్లేదు. ముఖ్యంగా చైనీస్ స్మార్ట్‌ఫోన్లు అన్నింటిలో ఇలాంటి బ్యూటిఫై ఫిల్టర్లు ఇన్బిల్ట్ గా వస్తున్నాయి. సెల్ఫీలు, ఫోటోలు తీసుకోగానే ఆటోమేటిగ్గా ఫిల్లర్లు సజెషన్లు ఇస్తాయి. కానీ గూగుల్ ఇందుకు భిన్నంగా ఆలోచించింది. స్మార్ట్ ఫోన్లలో ఫొటోలు తీసుకున్నప్పుడు అవి ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయ్యాయని కస్లమర్లకు తెలియకపోతే, వారు మానసిక అనారోగ్యాల బారిన పడతారని గూగుల్ చెబుతోంది.

పిక్సెల్ ఫోన్లలో అవి ఉండవు..

తమ స్మార్ట్ ఫోన్లలో బ్యూటిఫికేషన్ ఫిల్టర్లు ఉండవని గూగుల్ ప్రకటించింది. ఫొటోలకు మెరుగులు అద్దడం మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని గూగుల్ అంటోంది. తమ సంస్థ నుంచి వస్తున్న పిక్సెల్ 4ఎ, పిక్సెల్ 4ఎ 5జీ ఫోన్లలో బ్యూటిఫికేషన్ ఫిల్టర్లకు బదులుగా కొన్ని రీ టచింగ్ టూల్స్ ని అందిస్తున్నామని చెప్పింది. వీటిని మనం డిఫాల్ట్ గా ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను ఆన్ చేసినప్పుడు స్కిన్ టెక్చర్, అండర్-ఐ టోన్, ఐ బ్రైట్నెస్‌ను ఆటోమేటిక్ గా సర్దుబాటు చేస్తుంది.

ఫిల్టర్లతో ప్రమాదం ఏంటి?

ఫిల్టర్ చేసిన సెల్ఫీలు, డిఫాల్ట్ బ్యూటిఫై యాప్లు వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని గూగుల్ తెలిపింది. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉంటున్నామని ప్రకటించింది. ఇలాంటి వాటిపై ఎన్నో రకాల అధ్యయనాలు నిర్వహించామని ఆ సంస్థ ప్రకటించింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల, మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడి వారి అభిప్రాయం తీసుకున్నాం. కెమెరా లేదా ఫోటో యాప్ ఫిల్టర్లు సెల్ఫీలు, ఫొటోలకు మెరుగులు అద్దాయని వినియోగదారులకు తెలియకపోతే, అలాంటి ఫొటోలు మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని మేము కనుగొన్నాం. ఈ డిఫాల్ట్ ఫిల్టర్లు బ్యూటీ స్టాండర్డ్ను ఏర్పాటు చేయగలవు. దీంతో కొంతమంది తమను తాము ఇతరులతో పోల్చుకుంటూ అందం గురించి బాధపడతారు’అని గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ వినిత్ మోడీ చెప్పారు.


గూగుల్ వాదన..

సెల్ఫీలతో శ్రేయస్సు(వెల్ బీయింగ్), బ్యూటీ ఫిల్టర్‌ల మధ్య సంబంధాన్ని వివరించే ప్రత్యేక డాక్యుమెంటేషన్‌ను గూగుల్ విడుదల చేసింది. ‘ఎన్‌హ్యాన్స్మెంట్ , బ్యూటిఫికేషన్, టచ్ అప్ అనేవి అందానికి మెరుగులు అద్దుతాయని ప్రకటించుకుంటాయి. అంటే ఇవి సహజ అందాన్ని తక్కువ చేసి చూపిస్తాయి అని గూగుల్ నమ్ముతుంది. సూచనలతో వ్యక్తి శారీరక రూపాన్ని మెరుగుపరచడం, సరిదిద్దడం అనేవి... వారు ప్రస్తుతం అందంగా లేనట్లు చూపిస్తాయి. అందుకే పిక్సెల్ ఫోన్లు “ఫేస్ రీ టచింగ్” అనే ఫీచర్ పేరును వాడుతున్నాయి. వీటికి భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేర్పులతో అప్‌డేట్ చేస్తాం’అని గూగుల్ ప్రకటించింది.
Published by: Nikhil Kumar S
First published: October 5, 2020, 5:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading