Home /News /technology /

GOOGLE SAYS APPLE AND ANDROID PHONES HACKED BY ITALIAN SPYWARE UMG GH

Spyware: యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లన్నీ హ్యాక్..! గూగుల్ సంచలన రిపోర్ట్..!!

యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లు హ్యాక్ (Photo: REUTERS/Kacper Pempel )

యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లు హ్యాక్ (Photo: REUTERS/Kacper Pempel )

ఒక స్పైవేర్ కంపెనీ ఇటలీ (Italy), కజకిస్తాన్‌ (Kazakhstan)లోని మొబైల్ యూజర్లను టార్గెట్ చేసినట్లు తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజాలైన యాపిల్ (Apple), గూగుల్ (Google) వెల్లడించాయి. ఇటలీ, కజకిస్తాన్‌లోని ఐఫోన్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు రీసెంట్‌గా హ్యాక్‌కు గురైనట్లు ఈ టెక్ కంపెనీలు పే

ఇంకా చదవండి ...
ఈరోజుల్లో కొన్ని ప్రభుత్వాలు స్పైవేర్ (Spyware) కంపెనీల నుంచి హ్యాకింగ్ టూల్స్ కొనుగోలు చేసి కొందరిపై నిఘా పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఒక స్పైవేర్ కంపెనీ ఇటలీ (Italy), కజకిస్తాన్‌ (Kazakhstan)లోని మొబైల్ యూజర్లను టార్గెట్ చేసినట్లు తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజాలైన యాపిల్ (Apple), గూగుల్ (Google) వెల్లడించాయి. ఇటలీ, కజకిస్తాన్‌లోని ఐఫోన్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు రీసెంట్‌గా హ్యాక్‌కు గురైనట్లు ఈ టెక్ కంపెనీలు పేర్కొన్నాయి. ఐఫోన్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లపై గూఢచర్యం చేయడానికి ఓ ఇటాలియన్ కంపెనీ డెవలప్ చేసిన హ్యాకింగ్ టూల్స్ ఉపయోగించినట్టు గూగుల్ గురువారం ఒక నివేదికలో తెలిపింది. మిలన్‌కు చెందిన ఆర్‌సీఎస్ (RCS) ల్యాబ్ యూజర్ల ప్రైవేట్ మెసేజెస్, కాంటాక్ట్స్‌పై గూఢచర్యం చేయడానికి టూల్స్ అభివృద్ధి చేసినట్టు రిపోర్ట్ పేర్కొంది. ఈ పవర్‌ఫుల్ స్పైవేర్ ఎలాంటి మొబైల్‌నైనా ఎఫెక్ట్ చేయగలదని రిపోర్ట్ చెప్పింది.

ఈ స్పైవేర్ విక్రేతలు ప్రమాదకరమైన హ్యాకింగ్ టూల్స్‌ను అమ్ముకుంటూ.. వాటిని ప్రభుత్వాలకు ఆయుధాలుగా అందిస్తున్నారని గూగుల్ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆర్‌సీఎస్ ల్యాబ్ తన వెబ్‌సైట్‌లో యూరోపియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంస్థలు తమకు క్లయింట్‌లుగా పేర్కొంటోంది. యూరోపియన్, అమెరికన్ రెగ్యులేటర్లు స్పైవేర్ అమ్మకం, దిగుమతిపై కొత్త నిబంధనలను రావాలని ఆలోచిస్తున్న నేపథ్యంలోనే ఈ హ్యాకింగ్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఆర్‌సీఎస్ ల్యాబ్ తన ప్రొడక్ట్స్, సర్వీసులు యూరోపియన్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలకు క్రైమ్స్ ఇన్వెస్టిగేట్‌ చేయడంలో సహాయపడుతున్నాయని పేర్కొంది. ఆర్‌సీఎస్ ల్యాబ్ సిబ్బంది సంబంధిత కస్టమర్లు నిర్వహించే ఏ కార్యకలాపాలలో పాల్గొనరని కూడా చెప్పుకొచ్చింది. అలాగే తన ప్రొడక్ట్స్ దుర్వినియోగం చేస్తున్నారని చెప్పటం నిజం కాదని పేర్కొంది.

ఇదీ చదవండి:  ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ ప్రారంభం.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్.. బెస్ట్ డీల్స్ ఇవే..!


ఆర్‌సీఎస్ ల్యాబ్ తన వెబ్‌సైట్‌లో తనను తాను లాఫుల్ ఇంటర్సెప్షన్ టెక్నాలజీస్‌ తయారీదారుగా చెప్పుకుంది. వాయిస్, డేటా కలెక్షన్, ట్రాకింగ్ సిస్టమ్స్‌ వంటి సర్వీసెస్ అందించే తయారీ సంస్థగా కూడా తన గురించి వివరించింది. ఈ కంపెనీ ఒక్క ఐరోపాలోనే ప్రతిరోజూ 10,000 ఇంటర్సెప్టెడ్ టార్గెట్స్ హ్యాండిల్ చేస్తుంది. గూగుల్ పరిశోధకులు ఆర్‌సీఎస్ ల్యాబ్ గతంలో వివాదాస్పద, ప్రస్తుతం మూతపడిన ఇటాలియన్ గూఢచారి సంస్థ హ్యాకింగ్ టీమ్‌తో కలిసి పనిచేసినట్లు కనుగొన్నారు. ఈ గూఢచారి సంస్థ విదేశీ ప్రభుత్వాలు ఫోన్లు, కంప్యూటర్లను ట్యాప్ చేయడానికి నిఘా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.ఈ క్రమంలో గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించే యూజర్లను ప్రొటెక్ట్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఈ స్పైవేర్ గురించి వారిని అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. ప్రభుత్వాల కోసం స్పైవేర్‌ను తయారుచేసే గ్లోబల్ ఇండస్ట్రీ శరవేగంగా విస్తరిస్తోంది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు వ్యక్తులపై నిఘా పెట్టేందుకు వీలుగా మరిన్ని కంపెనీలు ఇంటర్సెప్షన్ టూల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల కోసం ఇలాంటి టూల్స్ కంపెనీలు అభివృద్ధి చేస్తూ మానవ హక్కులు, పౌర హక్కులను కాలరాయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిఘా వ్యతిరేక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం పెగాసస్ స్పైవేర్ జర్నలిస్టులు, కార్యకర్తలు తదితర ముఖ్యమైన వ్యక్తులపై గూఢచర్యం చేయడానికి పలు ప్రభుత్వాలు యూజ్ చేసినట్టు తెలియగానే స్పైవేర్ ఇండస్ట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆర్‌సీఎస్ ల్యాబ్ టూల్ పెగాసస్ లాగా సీక్రెట్‌గా డేటా కలెక్ట్ చేయలేదు కానీ మెసేజెస్ చదవగలదు, పాస్‌వర్డ్‌లను చూడగలదు. ఆర్‌సీఎస్ ల్యాబ్ స్పైవేర్ టూల్ టార్గెట్ యూజర్ల ఫోన్‌లకు ఒక లింక్‌ సెండ్ చేస్తుంది. పొరపాటున దానిపై క్లిక్ చేస్తే హానికరమైన అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ అయి ఇన్‌స్టాల్ అవుతుంది. తర్వాత డేటా కనెక్టివిటీ ఆఫ్ అవుతుంది. ఆపై ఇంకొక లింక్‌ వస్తుంది. డేటా ఆన్ చేయాలంటే ఆ లింక్‌లో ఉన్న అప్లికేషన్ కూడా డౌన్‌లోడ్ చేయాలని అడుగుతుంది. డౌన్‌లోడ్ చేసిన తర్వాత అటాక్ ప్రారంభమవుతుంది.
Published by:Mahesh
First published:

Tags: Android, Google, Hackers, Iphone

తదుపరి వార్తలు