అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ (Google), డిమాండ్ లేని సేవలను ఎప్పటికప్పుడూ తొలగిస్తుంది. ఏ కంపెనీలో అయినా ఇది కామన్ ప్రాసెస్. అయితే తాజాగా ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఒక పాపులర్ ఫీచర్ (Feature)ను కంపెనీ తొలగించింది. గూగుల్ వాయిస్ యాప్ నుంచి కీలకమైన స్మార్ట్ రిప్లై ఫీచర్‌ను తొలగిచింది. ఆండ్రాయిడ్, iOS వాయిస్ యాప్ నుంచి దీన్ని తీసివేసింది. అయితే ఎందుకు ఈ ఫీచర్‌ను తొలగించారన్నదానిపై ఇప్పటి వరకూ ఆ సంస్థ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
స్మార్ట్ రిప్లై ఫీచర్‌ను గతేడాది ఫిబ్రవరిలో ఈ సంస్థ తీసుకొచ్చింది. ఈ ఫీచర్లో ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా మనకు మెసేజ్ చేసేటప్పుడు దానికి తగిన మూడు రిప్లైలను ఆటోమేటిక్‌గా స్మార్ట్ ఫీచర్ ఇస్తుంది. అందులో మనకు నచ్చిన రిప్లైను లేదా సరైన రిప్లై అనుకున్నదాన్ని ఎంపిక చేస్తే సరిపోతుంది. మళ్లీ మనం ప్రత్యేకించి రిప్లై టైప్ చేయాల్సిన అవసరం లేదు. వేగంగా చాట్ చేసేందుకు, మెసేజ్‌లు పంపించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
* అప్డేట్ ఇదే..
9to5Google గూగుల్ రిపోర్ట్ ప్రకారం.. స్మార్ట్ రిప్లై ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో గూగుల్ వాయిస్ నోట్స్‌ను రిలీజ్ చేసింది. స్మార్ట్ రిప్లై ఫీచర్ ఇక అందుబాటులో ఉండదనే నోట్స్‌ను ప్రచురించింది. అయితే స్మార్ట్ రిప్లై ఫీచర్‌ను గూగుల్ వాయిస్ తొలగించినప్పటికీ, అదే సంస్థకు చెందిన గూగుల్ మెసేజెస్, జీమెయిల్, గూగుల్ డాక్స్లలో ఇప్పటికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మరి వీటిలో ఉన్న ఈ ఫీచర్‌ను వాయిస్ యాప్‌లో ఎందుకు తొలగించారో అన్నదానిపై ఇప్పటి వరకు కంపెనీ వివరణ ఇవ్వలేదు.
* సర్వర్ల మార్పు కారణమా?
వాయిస్ యాప్ అన్ని వెర్షన్ల నుంచి దీన్ని తొలగించటాన్ని సాంకేతిక మార్పు కింద భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్వర్లను మార్చేందుకే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. యూజర్లకు ఇప్పటికీ నోటిఫికేషన్లలో స్మార్ట్ రిప్లై సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇది ఆండ్రాయిడ్ డివైజెస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే గూగుల్ ఒక్కో యాప్‌కు ఫీచర్ సిస్టమ్‌ను మేనేజ్ చేయటానికి బదులుగా ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ అంతటికీ కలిపి ఈ ఫీచర్‌ను మేనేజ్ చేయాలనే ఆలోచనలో కూడా ఉండి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి : వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఇక, పాత చాట్లను ఈజీగా సెర్చ్ చేయవచ్చు!
కొన్ని ప్లాట్‌ఫామ్స్ లేదా యాప్స్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్‌ను గూగుల్ వాయిస్‌లో తొలగించేందుకు మరో కారణం కూడా ఉండొచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. గూగుల్ వాయిస్‌ను మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఆ సంస్థ చూడకపోవటం కూడా మరో కారణం కావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి కాలింగ్ సర్వీస్ కిందనే ఈ ఫీచర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని గూగుల్ భావిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.