GOOGLE REMOVES OVER 4 LAKH PIECES OF BAD CONTENT IN INDIA IN MAY UMG GH
Google: గూగుల్‌లో బ్యాడ్ కంటెంట్.. మొత్తం అవే సెర్చింగ్.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు
గూగుల్‌లో బ్యాడ్ కంటెంట్ సెర్చింగ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం, టెక్ (Tech) దిగ్గజం గూగుల్ ఇండియా(Google India) మే నెలలో ఆటోమేటెడ్ డిటెక్షన్ ప్రాసెస్ ద్వారా దాదాపు నాలుగు లక్షల బ్యాడ్ కంటెంట్ పీస్‌ల(Bad Content Pieces)ను తొలగించింది. నివేదికలోని పూర్తి వివరాలు..
ఆన్‌లైన్‌లో వ్యాపిస్తున్న బ్యాడ్ కంటెంట్ (Bad Content)పై వివిధ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నాయి. ఇటీవల ట్విట్టర్ (Twitter) కొన్ని వందల అకౌంట్‌ల (Account)ను తొలగించగా.. తాజాగా గూగుల్ చర్యలు తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం, టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా(Google India) మే నెలలో ఆటోమేటెడ్ డిటెక్షన్ ప్రాసెస్ ద్వారా దాదాపు నాలుగు లక్షల బ్యాడ్ కంటెంట్ పీస్‌ల(Bad Content Pieces)ను తొలగించింది. ఒక నెల రిపోర్టింగ్ వ్యవధిలో నియమించిన యంత్రాంగాల ద్వారా భారతదేశంలో ఉన్న వ్యక్తిగత వినియోగదారుల నుంచి 25,694 ఫిర్యాదులు అందాయని గూగుల్ కంపెనీ తెలిపింది.
కంపెనీ విడుదల చేసిన ఓ నివేదికలో.. వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులు గూగుల్ SSMI ప్లాట్‌ఫారమ్‌లలో స్థానిక చట్టాలు లేదా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించినట్లు విశ్వసించే థర్డ్ పార్టీ కంటెంట్‌కు సంబంధించినవని పేర్కొంది. అందుకున్న ఫిర్యాదులలో వివిధ వర్గాలు ఉన్నాయని, కొన్ని అభ్యర్థనలు మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించాయని ఆరోపించవచ్చని వివరించింది. అయితే మరికొన్ని పరువు నష్టం వంటి కారణాలతో కంటెంట్ రకాలను నిషేధించే స్థానిక చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది.
ఈ ఫిర్యాదులలో 24,000కి పైగా కాపీరైట్ ఉల్లంఘనలు ఉన్నాయి, దాని తర్వాత ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనలు (433), ఇతర చట్టపరమైన సమస్యలు (257) ఉన్నాయి. వినియోగదారు ఫిర్యాదులకు ప్రతిస్పందనగా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన 62,673 కంటెంట్ పీస్‌లను గూగుల్ తొలగించింది.
గూగుల్ ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌కు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించినప్పుడు, వాటిని జాగ్రత్తగా అంచనా వేస్తామని గూగుల్ పేర్కొంది. ట్విట్టర్ తన మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు మే నెలలో 46,000 కంటే ఎక్కువ భారతీయ వినియోగదారుల ఖాతాలను నిషేధించింది. ఈ వివరాలను మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ఆదివారం తన నెలవారీ సమ్మతి నివేదికలో తెలిపింది. నివేదిక ప్రకారం.. చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, నాన్ కాన్సెన్సువల్ న్యూడిటీ, సిమిలర్ కంటెంట్ కారణంగా ట్విట్టర్ 43,656 ఖాతాలను తొలగించగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 2,870 ఖాతాలను నిషేధించింది.
2022 ఏప్రిల్ 26, 2022 మే 25 మధ్య ఈ ప్లాట్‌ఫారమ్ తన స్థానిక ఫిర్యాదుల యంత్రాంగం ద్వారా భారతదేశంలో 1,698 ఫిర్యాదులను అందుకుంది. ఇందులో ఆన్‌లైన్ దుర్వినియోగం/వేధింపు(Online Abuse/Harassment)(1,366), ద్వేషపూరిత ప్రవర్తన(Hateful Conduct) (111), తప్పుడు సమాచారం, మ్యానిపులేడెట్ మీడియా(36)కి సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. సెన్సిటివ్ అడల్ట్ కంటెంట్(28), వంచన(25) వర్గాలకు చెందిన ఫిర్యాదులు కూడా ఉన్నట్లు నివేదికలో స్పష్టం చేసింది.
ఏప్రిల్‌లో, వాట్సాప్‌దేశంలో 844 ఫిర్యాదుల నివేదికలను అందుకుంది. అందులో 123 అకౌంట్‌లపై చర్యలు తీసుకుంది. కొత్త IT రూల్స్ 2021 ప్రకారం, 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులతో పెద్ద డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నెలవారీ సమ్మతి నివేదికలను ప్రచురించాలి.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.