ఆ యాప్‌‌‌ను తొలగించిన గూగుల్ ప్లే స్టోర్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2020 సిక్కు రెఫరెండం మొబైల్ అప్లికేషన్‌ను తొలగించారు. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

news18-telugu
Updated: November 20, 2019, 10:20 PM IST
ఆ యాప్‌‌‌ను తొలగించిన గూగుల్ ప్లే స్టోర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2020 సిక్కు రెఫరెండం మొబైల్ అప్లికేషన్‌ను తొలగించారు. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 2020 సిక్కు రెఫరెండం పేరుతో ఓ మొబైల్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది. దీనిపై కొందరు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఈ విషయం తెలిసిన పంజాబ్ ప్రభుత్వం.. దీనిపై అభ్యంతరం తెలిపింది. ఈ యాప్‌ వల్ల భారత్‌లో ఉద్భవించే ప్రమాదాల్ని వివరిస్తూ అమరీందర్‌ సింగ్‌ కేంద్రానికి, భద్రతా అధికారులకు లేఖ రాశారు. వెంటనే జోక్యం చేసుకొని యాప్‌ని ప్లే స్టోర్‌ నుంచి తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు గూగుల్‌పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రత్యేక ఖలిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నవారు తమ మద్దతును ఓటింగ్ రూపంలో తెలిపేలా ఈ యాప్‌ని రూపొందించారు. అయితే, దీన్ని పంజాబ్‌ ప్రభుత్వం డీఐటీఏసీ ల్యాబ్‌లో క్షుణ్నంగా సమీక్ష చేయించింది. ఓటింగ్ వివరాలన్నీ.. ఓ వేర్పాటువాద సంస్థ ఆధ్వర్యంలో ఉన్న వెబ్ సర్వర్‌లో నిక్షప్తిం అవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీన్ని భారత్‌లో నిర్వహించడం చట్ట విరుద్ధమంటూ గూగుల్‌ లీగల్ సెల్‌కు లేఖ రాయడంతో సంస్థ ఆ యాప్‌ను తొలగించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 20, 2019, 10:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading