• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • GOOGLE REMOVES ANTI INDIA APP FROM PLAY STORE ON PUNJAB CHIEF MINISTERS DEMAND BA

ఆ యాప్‌‌‌ను తొలగించిన గూగుల్ ప్లే స్టోర్

ఆ యాప్‌‌‌ను తొలగించిన గూగుల్ ప్లే స్టోర్

వీటిని గూగుల్ ప్లే స్టోర్ తొలగించినప్పటికీ మీరు APK స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే, దాని వల్ల మీ ఫోన్‌ మీద సైబర్ ఎటాక్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2020 సిక్కు రెఫరెండం మొబైల్ అప్లికేషన్‌ను తొలగించారు. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

  • Share this:
    గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2020 సిక్కు రెఫరెండం మొబైల్ అప్లికేషన్‌ను తొలగించారు. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 2020 సిక్కు రెఫరెండం పేరుతో ఓ మొబైల్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది. దీనిపై కొందరు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఈ విషయం తెలిసిన పంజాబ్ ప్రభుత్వం.. దీనిపై అభ్యంతరం తెలిపింది. ఈ యాప్‌ వల్ల భారత్‌లో ఉద్భవించే ప్రమాదాల్ని వివరిస్తూ అమరీందర్‌ సింగ్‌ కేంద్రానికి, భద్రతా అధికారులకు లేఖ రాశారు. వెంటనే జోక్యం చేసుకొని యాప్‌ని ప్లే స్టోర్‌ నుంచి తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు గూగుల్‌పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రత్యేక ఖలిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నవారు తమ మద్దతును ఓటింగ్ రూపంలో తెలిపేలా ఈ యాప్‌ని రూపొందించారు. అయితే, దీన్ని పంజాబ్‌ ప్రభుత్వం డీఐటీఏసీ ల్యాబ్‌లో క్షుణ్నంగా సమీక్ష చేయించింది. ఓటింగ్ వివరాలన్నీ.. ఓ వేర్పాటువాద సంస్థ ఆధ్వర్యంలో ఉన్న వెబ్ సర్వర్‌లో నిక్షప్తిం అవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీన్ని భారత్‌లో నిర్వహించడం చట్ట విరుద్ధమంటూ గూగుల్‌ లీగల్ సెల్‌కు లేఖ రాయడంతో సంస్థ ఆ యాప్‌ను తొలగించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు