యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?

గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన వాటిలో Truck Cargo Simulator, Extreme Car Driving, Hyper Car Driving Simulator, Car Driving Simulator లాంటి యాప్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ యాప్స్ ప్లే స్టోర్‌లో లేవు. అయితే ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నవాళ్లు అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.

news18-telugu
Updated: November 26, 2018, 2:05 PM IST
యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?
యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?
  • Share this:
గూగుల్‌కు మాల్‌వేర్ యాప్స్ పెద్ద తలనొప్పిగా మారాయి. 13 యాప్స్‌లో మాల్‌వేర్ గుర్తించిన గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఆ యాప్స్ ఆండ్రాయిడ్ డివైజ్‌లల్లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తోందని గూగుల్ గుర్తించింది. అంతకంటే ముందే ఈఎస్ఈటీ సెక్యూరిటీ రీసెర్చర్ లుకాస్ స్టెఫాంకో ఆ యాప్స్ గురించి ట్వీట్ చేశారు. మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఐకాన్స్‌ని ఎలా హైడ్ చేస్తోందని చెప్పడంతో వెంటనే పరిశీలించిన గూగుల్ 13 యాప్స్‌ని తొలగించింది. అయితే ఇప్పటికే వాటిని 560,000 సార్లు డౌన్‌లోడ్ చేశారు. వాటిలో కొన్ని ట్రెండింగ్ లిస్ట్‌లో కూడా ఉన్నట్టు తేలింది.గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన వాటిలో Truck Cargo Simulator, Extreme Car Driving, Hyper Car Driving Simulator, Car Driving Simulator లాంటి యాప్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ యాప్స్ ప్లే స్టోర్‌లో లేవు. అయితే ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నవాళ్లు అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. వీటిని ఏపీకీ ఫార్మాట్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశముండటంతో... యూజర్లకు మాల్‌వేర్ ముప్పు తప్పదు.

ఇవి కూడా చదవండి:

టీవీ, ఫ్రిజ్ కొంటారా? ధరలు పెరగనున్నాయి...

ఫ్లిప్‌కార్ట్ హానర్ డేస్ సేల్‌లో ఆఫర్లు ఇవే...

బిట్‌ కాయిన్ కుప్పకూలుతుందని వీళ్లకు ముందే తెలుసా?

చిరువ్యాపారులకు డిజిటల్ స్కిల్స్ నేర్పనున్న ఫేస్‌బుక్
Published by: Santhosh Kumar S
First published: November 26, 2018, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading