Apps: 200 యాప్స్ తొలగించిన గూగుల్... మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలిట్ చేయండి

Alert: 200 యాప్స్ తొలగించిన గూగుల్... మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలిట్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Dangerous Apps | 200 యాప్స్‌ను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది గూగుల్. ఈ యాప్స్‌లో SimBad పేరుతో యాడ్‌వేర్ ఉందని, దీంతో ఆండ్రాయిడ్ యూజర్ల ముప్పు తప్పదని గూగుల్ గుర్తించింది.

  • Share this:
    స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలదు. స్మార్ట్‌ఫోన్‌ను ఇంకా స్మార్ట్‌గా వాడుకోవాలంటే యాప్స్ తప్పనిసరి. ప్లేస్టోర్‌లో లక్షల్లో యాప్స్ ఉంటాయి. మరి వాటిలో అసలువి ఏవో, నకిలీవి ఏవో, మీ డేటాను కొట్టేసేవి ఏవో తెలుసుకోవడం కష్టం. ఇలాంటి యాప్స్‌పై గూగుల్ నిత్యం నిఘా పెడుతూ ఉంటుంది. యూజర్ల ప్రైవసీకి ముప్పుగా మారే యాప్స్‌ని గుర్తించి తొలగిస్తుంది. ఇటీవల 200 యాప్స్‌ను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది గూగుల్. ఈ యాప్స్‌లో SimBad పేరుతో యాడ్‌వేర్ ఉందని, దీంతో ఆండ్రాయిడ్ యూజర్ల ముప్పు తప్పదని గూగుల్ గుర్తించింది. యూజర్ల డేటాను కొట్టేస్తున్న ఈ 200 యాప్స్‌ని 15 కోట్ల సార్లు యూజర్లు డౌన్‌లోడ్ చేశారు. అయితే వీటిని గూగుల్ ఇప్పటికే తొలగించినా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే మాత్రం ఆ డేంజరస్ యాప్స్‌ను వెంటనే డిలిట్ చేయాలి.

    Read this: YouTube: యూట్యూబ్‌ చూస్తున్నారా? ఇంటర్నెట్ డేటా ఇలా ఆదా చేయొచ్చు

    గూగుల్ తొలగించిన యాప్స్‌లో ప్రధానమైనవి ఇవే...


    Phone Finder
    Dual Screen Browser
    Face Beauty Makeup
    Deleted Files recovery
    Broken Screen
    Modi Photo Frame
    Anti Theft & Full Battery Alarm
    Voice reading for SMS Whatsapp & text sms
    Move App to SD Card
    Live Translator
    Flash on Call
    Football Results & Stats Analyzer
    DSLR Camera Blur
    Recover Deleted Pictures
    Anti-spam Calls
    Professional Recorder

    వీటితో సహా మొత్తం 200 యాప్స్‌లో SimBad యాడ్‌వేర్ ఉన్నట్టు తేలింది. ఆ యాప్స్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గతేడాది 7,00,000 యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి డిలిట్ చేసింది గూగుల్. ఇలాంటి డేంజరస్ యాప్స్ ప్లేస్టోర్‌లో వేలల్లో ఉన్నాయి. అందుకే ఇకపై యాప్స్ డౌన్‌లోడ్ చేసేముందు డెవెలపర్స్ గురించి తెలుసుకోవడం మంచిది.

    Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే

    ఇవి కూడా చదవండి:

    Banks Merger: మూడు బ్యాంకుల విలీనం పూర్తి... కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే

    Realme Discount: రియల్‌మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ధర రూ.9,999 మాత్రమే

    EPFO pension: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త... రిటైర్మెంట్ తర్వాత అధిక పెన్షన్
    First published: