హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 17 యాప్స్ ఉంటే రిస్కే

Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 17 యాప్స్ ఉంటే రిస్కే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Riskware Apps | మీ స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీని ఉల్లంఘించి మరీ యాడ్స్ చూపించే యాప్స్ ఇవి. అంతేకాదు... మీ ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవడానికి ఈ యాప్స్ కారణం అవుతాయి. ఫుల్ స్క్రీన్ యాడ్స్ చూపిస్తూ మీకు చికాకు తెప్పిస్తుంటాయి.

మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్‌లో మీకు నచ్చిన యాప్స్ ఇన్‌స్టాల్ చేసి వాడుతున్నారా? అయితే మీరు రిస్కులో ఉన్నట్టే. ప్లే స్టోర్ నుంచి 17 యాప్స్‌ని డిలిట్ చేసింది గూగుల్. సెక్యూరిటీ కంపెనీ బిట్‌డిఫెండర్ వాటిని రిస్క్‌వేర్ యాప్స్‌గా గుర్తించింది. దీంతో వాటిని ప్లేస్టోర్ నుంచి తొలగించింది గూగుల్. ఇప్పటికే ఆ 17 యాప్స్‌ని 5,50,000 సార్లు డౌన్‌లోడ్ చేసినట్టు గుర్తించింది గూగుల్. వాటిలో కార్ రేసింగ్, బ్యాక్‌గ్రౌండ్స్, బార్ కోడ్ స్కానర్ లాంటి యాప్స్ ఉన్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసి ఉపయోగిస్తున్నవారి స్మార్ట్‌ఫోన్‌ రిస్కులో ఉన్నట్టే. మీ స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీని ఉల్లంఘించి మరీ యాడ్స్ చూపించే యాప్స్ ఇవి. అంతేకాదు... మీ ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవడానికి ఈ యాప్స్ కారణం అవుతాయి. ఫుల్ స్క్రీన్ యాడ్స్ చూపిస్తూ మీకు చికాకు తెప్పిస్తుంటాయి. మీ ఫోన్ మోడల్, ఐఎంఈఐ నెంబర్, ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, లొకేషన్ లాంటి కీలక సమాచారాన్ని యాడ్ వెబ్‌సైట్లకు పంపిస్తుంటాయి ఈ యాప్స్. మరి బిట్‌డిఫెండర్ గుర్తించిన 17 రిస్క్ వేర్ యాప్స్ ఏవో తెలుసుకోండి.

బిట్‌డిఫెండర్ గుర్తించిన 17 రిస్క్ వేర్ యాప్స్ ఇవే...


1. Car Racing 2019

2. 4K Wallpaper (Background 4K Full HD)

3. Backgrounds 4K HD

4. Barcode Scanner

5. Clock LED

6. Explorer File Manager

7. File Manager Pro – Manager SD Card/Explorer

8. Mobnet.io: Big Fish Frenzy

9. Period Tracker – Cycle Ovulation Women’s

10. QR & Barcode Scan Reader

11. QR Code – Scan & Read a Barcode

12. QR Code Reader & Barcode Scanner Pro

13. Screen Stream Mirroring

14. Today Weather Radar

15. Transfer Data Smart

16. VMOWO City : Speed Racing 3D

17. Wallpapers 4K, Backgrounds HD

ఒకవేళ ఇప్పటికే మీరు ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసినట్టైతే వెంటనే డిలిట్ చేయడం మంచిది.

కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Best Smartphones: రూ.10,000 బడ్జెట్ లోపు బెస్ట్ 5 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Lock Aadhaar: ఇలా చేస్తే మీ ఆధార్ నెంబర్‌ను ఎవరూ వాడుకోలేరు

Smartphone: రూ.7,500 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

First published:

Tags: FAKE APPS, Google, Mobile App, Playstore, Smartphone, Smartphones