టెక్ బ్రాండ్స్ అన్నీ వినియోగించే యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌గా నిలుస్తోంది ఆండ్రాయిడ్ (Android). అయితే ఆండ్రాయిడ్ యూజర్లకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్లను అందిస్తోంది గూగుల్ (Google). ప్రస్తుతం ఆండ్రాయిడ్ కోసం సరికొత్త ఎమోజీలు, కలర్ కస్టమైజేషన్ ఆప్షన్లను అందిస్తున్నట్లు తెలిపింది. త్వరలో అందుబాటులోకి రానున్న అప్డేట్లో యూజర్లు ఎంతగానే ఎదురుచూస్తున్న పింక్ హార్డ్ కనిపించనుంది. గూగుల్ ప్రకటించిన తాజా అప్డేట్ల వివరాలు ఇవే..
* త్వరలో యూనికోడ్ 15.0 లాంచ్
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) యూనికోడ్ 15.0ని త్వరలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 31 కొత్త ఎమోజీ క్యారెక్టర్స్, యానిమేషన్లు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు కలర్ కస్టమైజేషన్ ఆప్షన్లు ఉంటాయని తెలిపింది.
కొత్త యూనికోడ్ 15లో వచ్చిన మొత్తం 31 ఎమోజీలలో నల్ల పక్షి(Black Bird), గాడిద(Donkey), దుప్పి(Moose), గూస్(Goose), జెల్లీ ఫిష్(jellyfish) వంటి పక్షులు, జంతువులకు చోటు దక్కింది. అలాగే చాలా మంది వినియోగదారులు అభ్యర్థించిన పింక్ హార్డ్ ఎమోజీ(Pink Heart Emoji) కూడా అందుబాటులోకి రానుంది. దీంతోపాటు మరికొన్ని రంగుల్లో హార్ట్ ఎమోజీని గూగుల్ రూపొందిస్తున్నట్లు పేర్కొంది.
* మొత్తం ఎమోజీలు 3,664
దీంతో మొత్తం ఎమోజీల సంఖ్య 3,664కి చేరింది. దీనికి సంబంధించి గూగుల్ డెవలపర్స్ బ్లాగ్‌లో గూగుల్ చేసిన పోస్ట్‌లో.. ఈ క్యారక్టెర్స్ త్వరలో ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. వచ్చే ఏడాది ప్రారంభంలో గూగుల్ ప్రొడక్టుల్లో ఈ ఎమోజీలను ఉపయోగించవచ్చని పేర్కొంది.
* ఎమోజీల కోసం కొత్త కలర్ ఫాంట్
గూగుల్ తన ఎమోజీల కోసం కొత్త కలర్ ఫాంట్ సపోర్ట్‌ను అందించనుంది. కొత్త ఫాంట్ ఆకృతిని COLRv1 అంటారు. కలర్ గ్రేడియంట్స్ సహాయంతో వినియోగదారులు ఎమోజీల రంగును మార్చవచ్చు. గూగుల్ ప్రకారం.. నోటో కలర్ ఎమోజీ అనేది ఓపెన్ సోర్స్ ఎమోజీ ఫాంట్. ఇది సరికొత్త యూనికోడ్ స్పెసిఫికేషన్ (v 15.0)కి సపోర్ట్ ఇస్తుంది. 3,664 ఎమోజీలను అందిస్తుంది. Chrome, ఇతర Google ప్రొడక్టుల ద్వారా ఉపయోగించవచ్చు.
* యానిమేటెడ్ ఎమోజీలను లాంచ్ చేసిన గూగుల్
కంపెనీ ఫోన్ ఆపరేటర్ KDDI ద్వారా యానిమేటెడ్ ఎమోజీలను ఆండ్రాయిడ్ కోసం లాంచ్ చేసింది. ఇప్పుడు వినియోగదారులు ఈ ‘డ్యాన్స్ ఎమోట్లను’ డౌన్లోడ్ చేసుకోగలరు. వినియోగదారు దీన్ని ఏ ఫార్మాట్లోనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిలో కొన్ని యానిమేటెడ్ ఎమోజీలు ఇప్పటికే గూగుల్ మెసేజ్‌లలో అందుబాటులో ఉన్నాయని గూగుల్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.