Home /News /technology /

GOOGLE RELEASED LIST OF BEST ANDROID APPS OF 2021 HERE DETAILS NS GH

Best Android Apps: 2021 బెస్ట్​ ఆండ్రాయిడ్​ యాప్స్ ఇవే.. జాబితాను ప్రకటించిన గూగుల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన యాప్స్​ జాబితాను సెర్చింజన్​ దిగ్గజం గూగుల్ విడుదల చేస్తుంది. అంతేకాదు, ఆయా కేటగిరీలోని బెస్ట్ యాప్స్​గా నిలిచిన వాటికి అవార్డులను కూడా అందజేస్తుంది. ఈ ఏడాదికి కూడా బెస్ట్​ యాప్స్​ లిస్ట్​ను విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో స్మార్ట్​ఫోన్ (Smartphone) ​తోనే రోజు మొదలవుతోంది.. స్మార్ట్​ఫోన్​తోనే రోజు ముగుస్తుంది. ఉదయం లేవడంతోనే ఫేస్​బుక్​ (Facebook), వాట్సాప్​ (Whatsapp), ట్విట్టర్ (Twitter)​, ఇన్​స్టాగ్రామ్ (Instagram)​ ఇలా రకరకాల యాప్స్​కు వచ్చే నోటిఫికేషన్లను (App Notifications) చూసుకోవడం దినచర్యగా మారిపోయింది. అయితే మనం రోజూ ఉపయోగించే యాప్స్​లో బెస్ట్​ యాప్ ఏదంటే వెంటనే చెప్పడం కాస్త కష్టం.​ అందుకే ప్రతి ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన యాప్స్​ జాబితాను సెర్చింజన్​ దిగ్గజం గూగుల్ (Google) విడుదల చేస్తుంది. అంతేకాదు, ఆయా కేటగిరీలోని బెస్ట్ యాప్స్​గా నిలిచిన వాటికి అవార్డులను కూడా అందజేస్తుంది. ఈ ఏడాదికి కూడా బెస్ట్​ యాప్స్​ లిస్ట్​ను విడుదల చేసింది. 2021 గాను ఇండియాలో బెస్ట్​ యాప్స్​ లిస్ట్​ను ఓసారి పరిశీలిద్దాం.

బిట్‌క్లాస్ (Bitclass)
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లైవ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా పేరొందింది. ఈ యాప్​ బేకింగ్, డ్యాన్స్, మ్యూజిక్, పర్సనల్ ఫైనాన్స్​, థియేటర్ యాక్టింగ్ ఇలా వివిధ కేటగిరిల్లో ఉచిత క్లాసులను అందిస్తుంది.
No Password: ఇక పాస్‌వ‌ర్డ్ ఉండ‌దు.. అయినా మీ ఎకౌంట్ సేఫ్.. మైక్రోసాఫ్ట్ కొత్త ఆలోచ‌న‌

ఫ్రంట్​ రో (FrontRow)
బిట్​ క్లాస్​ వలే ఇది కూడా ఒక ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్. మ్యూజిక్​, క్రికెట్, డ్యాన్స్, మరిన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులతో ఉచిత శిక్షణ అందజేస్తుంది.
Smartphone Tips: పొరపాటున ఫోటోలు, వీడియోలు డిలిట్ చేశారా? ఇలా తిరిగి పొందొచ్చు

క్లబ్‌హౌస్: సోషల్ ఆడియో యాప్ (Clubhouse)
క్లబ్ హౌస్ అనేది సోషల్ ఆడియో యాప్. ఇక్కడ యూజర్లు తమకు ఇష్టమైన అంశాలపై గ్రూప్​గా చాట్ చేయవచ్చు.
Debit Card EMI: మీ డెబిట్ కార్డ్‌లో ఈఎంఐ ఫెసిలిటీ ఉందా..? అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి

హాట్​స్టెప్​ (Hotstep)
హాట్‌స్టెప్ అనేది డ్యాన్సర్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు, ఎంటర్​టైన్​మెంట్​ కోరుకునే వ్యక్తుల కోసం రూపొందించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్. దీనిలో వివిధ కళాకారుల చేత ఉచితంగా డ్యాన్స్ ట్యుటోరియల్స్​, లైవ్ సెషన్లు నిర్వహిస్తుంది.

సోర్టిజీ (Sortizy): వంటకాలు, మీల్ ప్లానర్ & కిరాణా సర్వీసులు
సోర్టిజీ యాప్ వంట చేయడానికి అవసరమయ్యే పదార్థాలు, మీల్​ ప్లానర్, కిరాణా జాబితాను అందిస్తుంది.

సర్వ (SARVA): యోగా & ధ్యానం
సర్వ అనేది యోగా, మెడిటేషన్ యాప్.

ట్రూకాలర్​ (Truecaller)
ఇది కాల్​ ఐడెంటిఫికేషన్​ యాప్​. దీని ద్వారా కాల్​ ఎవరు చేస్తున్నారో కనిపెట్టవచ్చు. అంతేకాదు,​ దీని ద్వారా మన లొకేషన్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు.

ఎంబైబ్ (Embibe)​: లెర్నింగ్​ అవుట్​కమ్స్​ యాప్​

సీబీఎస్ఈ/ఎన్​సీఈఆర్​టీ, ఐసీఎస్ఈ బోర్డ్‌లకు సంబంధించిన క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు కావాల్సిన పుస్తకాలు, మాక్ టెస్ట్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇంజనీరింగ్, మెడికల్, ప్రభుత్వ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్​ కూడా ఉచితంగా అందిస్తుంది.

ఎవాల్వ్​ మెంటల్ హెల్త్​ (Evolve Mental Health): ధ్యానాలు, స్వీయ సంరక్షణ & సీబీటీ వ్యక్తుల మానసిక ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి, మెరుగుపరచడానికి ఈ యాప్​ ఉపయోగపడుతుంది.

జంపింగ్ మైండ్స్ (Jumping Minds): టాక్​ & ఫీల్ బెటర్
యాప్ అనామకంగా, సురక్షితంగా 1-1 టెక్స్ట్ చాట్ కోసం వినియోగదారులను సంబంధిత వ్యక్తులకు కనెక్ట్ చేస్తుంది.

మూన్‌బీమ్: పాడ్‌కాస్ట్ డిస్కవరీ (Moonbeam Podcast Discovery)
మూన్‌బీమ్ యాప్​ మీకు ఇష్టమైన పాడ్‌కాస్ట్‌ను కనుగొనడంలో సహాయపడుతుంది. దీనిలో ఎటువంటి ప్రకటనలు లేకుండానే ఫీడ్​ ఆస్వాదించవచ్చు.

ఎవర్ గ్రీన్ క్లబ్ (Evergreen Club)
వృద్ధుల్లో శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవర్​ గ్రీన్​ క్లబ్​ యాప్​ను డిజైన్ చేశారు. ఇది మీకుఉత్తేజకరమైన ఈవెంట్లు & కార్యకలాపాలతో గొప్ప వర్చువల్ అనుభవాన్ని అందిస్తుంది.

హౌజ్ (Houzz): హోమ్ డిజైన్ & రీమోడల్
పేరు సూచించినట్లుగా, హౌజ్ అనేది మీ ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగపడుతుంది.

కాన్సెప్ట్స్: స్కెచ్, నోట్, డ్రా (Concepts: Sketch, Note, Draw)
కాన్సెప్ట్స్ అనేది వైట్‌బోర్డ్ యాప్. ఇది నోట్స్, డూడుల్స్​, మైండ్‌మ్యాప్‌లను రాయడానికి, స్టోరీబోర్డ్‌లు, ప్రోడక్ట్ స్కెచ్‌లు, డిజైన్ ప్లాన్‌లను గీయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

కామ్​ (Calm)
కామ్​ యాప్​ అనేది నిద్ర, ధ్యానం కోసం రూపొందించిన యాప్​. ఈ యాప్​లోని మెడిటేషన్లు, స్లీప్​ స్టోరీలు, మ్యూజిక్​ వంటివి మిమ్మల్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఉండచటంలో సహాయపడతాయి.

కాన్వా (Canva)
కాన్వా యాప్​ అనేది వీడియో, గ్రాఫిక్ డిజైన్‌ను సులభతరం చేస్తుంది. దీని ద్వారా ఉచితంగానే ఫోటో ఎడిటింగ్​, వీడియో మేకింగ్​, లోగో క్రియేటింగ్​ చేసుకోవచ్చు.

మై ఫిట్‌నెస్ పల్​ (My Fitness Pal)
ఇది ఫిట్‌నెస్ ఫ్రీక్స్ రూపొందించన యాప్​. మెరుగైన ఫిట్​నెస్​ కోసం తీసుకోవాల్సిన ఆహారాల గురించి వినియోగదారులకు తెలియజేస్తుంది. ఇది న్యూట్రీషియన్​, కేలరీస్​ ట్రాకర్​గానూ పనిచేస్తుంది.

స్లీప్ సైకిల్ (Sleep Cycle): స్లీప్ అనాలిసిస్ & స్మార్ట్ అలారం క్లాక్​
ఈ యాప్ కూడా మీ నిద్రను ట్రాక్​ చేస్తుంది. ఇది స్మార్ట్ అలారం క్లాక్, స్లీప్ రికార్డర్, స్లీప్ ట్రాకర్‌ వంటి ఫీచర్లతో వస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Google, New apps

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు