Google Privacy: ప్రైవసీ సెట్టింగ్స్ అప్‌డేట్ చేసిన గూగుల్.. మరింత గోప్యత కోసం ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

Google Privacy: ప్రపంచ వ్యాప్తంగా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చినట్లు గూగుల్ ప్రకటించింది. జీమెయిల్, గూగుల్ అకౌంట్లు, యూట్యూబ్‌లో మీ డేటాను సురక్షితంగా ఒకే చోట ఉంచుకునేలా మార్పులు చేసింది.

  • Share this:
ప్రస్తుత ప్రజల దైనందిన జీవితంలో గూగుల్ (Google)  కూడా భాగమైపోయింది. ఏం కావాలన్నా, ఎందులో సందేహమున్నా.. చాలామంది గూగుల్ సెర్చింగ్‌పైనే ఆధారపడుతున్నారు. స్కూల్ అసైన్మెంట్లు (School assignments), వర్క్ ఈమెయిల్స్ (Work emails), వీడియోలు చూడటం , కాల్స్ కోసం ఇలా చాలా విషయాల్లో గూగుల్ సాయం తీసుకుంటున్నాం. కంపెనీ కూడా ఇందుకు తగినట్లుగానే ఎన్నో నెట్వర్కింగ్ టూల్స్ ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. తాజాగా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చినట్లు గూగుల్ ప్రకటించింది. జీమెయిల్ (Gmail), గూగుల్ అకౌంట్లు, యూట్యూబ్‌లో మీ డేటాను (User Day) సురక్షితంగా ఒకే చోట ఉంచుకునేలా మార్పులు చేసింది.

యూజర్లు 'ప్రైవసీ చెకప్ (Privacy Checkup)' ద్వారా సెట్టింగ్స్ సులభంగా మార్చుకోవచ్చు. గూగుల్ డేటా కలెక్షన్ ను పరిమితం చేసుకుంటే కొన్ని ట్రేడ్ ఆఫర్లను కూడా ఇస్తుంది. మీకు అంతగా ఉపయోగపడని గూగుల్ సేవల సిఫార్సులు, ఇతర ప్రకటనలు తక్కువగా ఉంచాలనే లక్ష్యంతో ఈ మార్పులు తీసుకొచ్చింది. ఈ ప్రైవసీ సెట్టింగ్స్ వెబ్‌లో మీ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ పై ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగత గూగుల్ యాప్స్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండే సెట్టింగ్స్ ద్వారా వీటిని యాక్సెస్ చేయవచ్చు. ఏయే సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలో చూద్దాం.

ఇంటర్​నెట్​ లేకున్నా.. గూగుల్​ పే, ఫోన్​ పే, యూపీఐ పేమెంట్స్​ చేయొచ్చు.. ఎలాగో తెలుసా?

* బ్రౌజింగ్ యాక్టివిటీ..
బ్రౌజింగ్ యాక్టివిటీని గూగుల్‌ ట్రాక్ చేయకుండా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సాధారణంగా వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ ప్రొడక్ట్స్ అత్యంత గోప్యంగా ఉంచుతాయి. ఉదాహరణకు గూగుల్ సెర్చ్‌లో మీ అనారోగ్యానికి సంబంధించిన వివరాలను వెతికినప్పుడు.. అలాంటి సమాచారాన్ని గూగుల్ వదిలేస్తుంది. ఇదే సమయంలో మ్యాప్స్ టూల్స్ మాత్రం మీ రాకపోకలకు సంబంధించిన డేటా సేకరిస్తాయి. ఈ సమాచారం పర్సనలైజ్డ్ ప్రొడక్ట్స్‌కు ఉపయోగపడుతుంది. ఇది కంపెనీ ప్రకటనలకు కూడా సహాయపడుతుంది. ప్రైవసీ సెట్టింగ్స్ క్లీన్ చేసేటప్పుడు మీరు మొదటగా ఆగేది కంట్రోల్ పేజీలోనే. ఇక్కడ టోగుల్‌ను ఆఫ్ చేసి యాక్టివిటీని ఆఫ్ చేయవచ్చు. ఈ ఆప్షన్ గ్రే కలర్లో ఉంటుంది.

Realme Narzo 50 Series: రియల్‌మీ నార్జో 50ఏ, నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ధర ఎంతంటే


వెబ్‌లో myaccount.google.com ద్వారా డేటా & ప్రైవసీ సెట్టింగ్స్‌కు వెళ్లాలి. అనంతరం వెబ్ అండ్ యాప్ యాక్టివిటికీ వెళ్లాలి. ఇక్కడ యాక్టివిటీ కంట్రోల్ పేజీ కనిపిస్తుంది. వెబ్ అండ్ యాప్ యాక్టివిటీకి సంబంధించిన టోగుల్‌ను టర్న్ ఆఫ్ చేయాలి. అనంతరం డేటా కలెక్షన్‌ను పాజ్ చేయాలని నిర్ధారించే పాప్ అప్ కనిపిస్తుంది.

* ప్రైవసీ గురించి ఆందోళన చెందుతుంటే..
మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారనే విషయానికి వస్తే.. ఈ సెట్టింగ్స్ చాలా అంశాలను కవర్ చేస్తాయి. కాబట్టి ఆ సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా కంపెనీ మీ గురించి కలెక్ట్ చేస్తున్న డేటాను లిమిట్ చేసుకోవాలి. మీరు యూట్యూబ్‌లో చూసే వీడియోలు, లోకేషన్, మీరు వదిలేసిన ప్రొడక్ట్ రివ్యూలు లాంటి వాటిలో కంపెనీ మీ గురించి సేకరిస్తున్న డేటాను పరిమితం చేసుకోవచ్చు. మీకు ఇబ్బందిగా ఉన్నా లేదా నచ్చని ప్రకటనలను ఇవ్వవద్దని కంపెనీని అడగవచ్చు.

Redmi 9 Activ: రూ.10,000 లోపు మరో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... సేల్  ఎప్పుడంటే..

* లొకేషన్, యూట్యూబ్ డేటా కలెక్షన్ ఆపేయవచ్చు..
యాక్టివిటీ కంట్రోల్ పేజీ నుంచి స్క్రోల్ డౌన్ చేసి గ్రే కలర్‌లో ఉన్న లోకేషన్ హిస్టరీని టర్న్ ఆఫ్ చేయవచ్చు. గూగుల్ ఇప్పటికే ఈ లొకేషన్‌కు సంబంధించి సేకరించిన డేటా గురించి timeline.google.com పోర్టల్ కు వెళ్లవచ్చు. అలాగే ఇంకా కిందకు వెళ్తే గ్రే కలర్ లో ఉండే యూట్యూబ్ హిస్టరీని కూడా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు.

* పాత కార్యకలాపాలను తొలగించడం..
భవిష్యత్తు డేటా సేకరణను నిరోధించడమే కాకుండా పాత యాక్టివిటీని కూడా గూగుల్ యూజర్లు డిలీట్ చేసుకోవచ్చు. ప్రతి సెక్షన్ కింద ఉండే 'మేనేజ్ యాక్టివిటీ'ని క్లిక్ చేయడం ద్వారా ప్రక్రియను ప్రారంభించవచ్చు. మూడు నెలల వరకు ఆటో డిలీట్ ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు.

* ప్రొడక్ట్ రివ్యూస్ ఎలా దాచాలి?
మీ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ లో ఉన్న 'పీపుల్ అండ్ షేరింగ్' కు వెళ్లాలి. అనంతం అక్కడ ఉన్న 'మేనేజ్ షేర్డ్ ఎండార్స్‌మెంట్స్‌’ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత కనిపించే ఆప్షన్లలో ప్రొడక్ట్ రివ్యూస్‌ విభాగాన్ని హైడ్ చేసుకోవచ్చు.

* ప్రొఫైల్ లాక్ చేయడం..
ప్రొఫైల్‌ను లాక్ చేయడానికి.. అకౌంట్ సెట్టింగ్స్ లోని పీపుల్ అండ్ షేరింగ్ ఆప్షన్‌కు వెళ్లాలి. ఇతరులు మీ గురించి చూడాలనుకుంటున్న విషయాలను తెలియజేసే 'అబౌట్ మీ' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. సున్నితమైన వివరాలు ఉంటే 'ఎనీ వన్' అనే ఆప్షన్‌కు బదులు 'ఓన్లీ మీ' అనే ఆప్షన్ సెట్ చేసుకోవాలి. "యాడ్ పర్సనలైజేషన్" సెట్టింగ్స్‌ను ఆఫ్ చేయడానికి ఓ పెద్ద టోగుల్ ఉంటుంది. దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు.

* యాడ్ పర్సనలైజేషన్ టర్న్ ఆఫ్ చేయడం..
ఇందుకోసం మీరు యాడ్ సెట్టింగ్స్‌లో మై యాక్టివిటీ పేజీకి వెళ్లాలి. లేదా adssettings.google.com. పోర్టల్‌కు వెళ్లవచ్చు. అక్కడ గ్రే కలర్‌లోని టర్న్ ఆఫ్ టోగుల్‌పై క్లిక్ చేయాలి.

* ఔట్ సైడ్ యాప్స్ కటాఫ్ చేయడం..
చివరగా మీ గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న యాప్స్ వివరాలను తనిఖీ చేయాలి. ఇందుకోసం గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ లోని సెక్యూరిటీకి వెళ్లాలి. అక్కడ ఉన్న 'థర్డ్ పార్టీ యాప్ విత్ అకౌంట్ యాక్సెస్' కు వెళ్లాలి. అనంతరం 'మేనేజ్ థర్డ్ పార్టీ యాక్సెస్' ఆప్షన్‌పై నొక్కాలి. నిజమైన, నమ్మదగిన లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే యాక్సెస్ ఉండేలా చూసుకోండి.

* మీరు మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటే..
యాప్స్ నుంచి గూగుల్ డేటా కలెక్షన్ నివారించాలంటే మీరు అందులో ఉండే కొన్ని ప్రొడక్ట్స్‌ను దూరంగా ఉంచాలి. వీలైతే క్రోమ్ బ్రౌజర్‌ను ఉయోగించకండి. దీనికి బదులు ఫైర్ ఫాక్స్ లేదా బ్రేవ్ లాంటి ఎక్కువ గోప్యతను పాటించే బ్రౌజర్లను ఎంచుకోండి. మీరు క్రోమ్ ఉపయోగిస్తుంటే.. సైన్ అవుట్ చేసి, ట్రాకర్లను నిరోధించడానికి 'ప్రైవసీ బ్యాడ్జర్ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్' లాంటి టూల్స్ వాడండి. 'DuckDuckGo' లాంటి ప్రత్యామ్నాయంతో కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడకాన్ని మీరు నివారించవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published: