Alert: ఏప్రిల్ 2న మూతపడనున్న Google+, డేటా ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

మీరు గూగుల్ ప్లస్ అకౌంట్ డిలిట్ చేస్తే అందులోని డేటా మాత్రమే పోతుంది. మీరు డిలిట్ చేయకపోయినా ఏప్రిల్ 2 నుంచి డేటా డిలిట్ అవుతుంది. అయితే గూగుల్ ఫోటోస్‌లో అప్‌లోడ్ చేసిన డేటా, ఫోటోలు మాత్రం డిలిట్ కావు.

news18-telugu
Updated: February 9, 2019, 5:10 PM IST
Alert: ఏప్రిల్ 2న మూతపడనున్న Google+, డేటా ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Alert: ఏప్రిల్ 2న Google+ షట్ డౌన్, మీరేం చేయాలో తెలుసుకోండి
  • Share this:
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ గూగుల్ ప్లస్(Google+) ఏప్రిల్ 2న మూతపడనుంది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ గూగుల్ ప్లస్‌ను నిర్వహించడం, కొనసాగించడంలో ఎదుర్కొంటున్న పలు సవాళ్ల కారణంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను మూసెయ్యాలని నిర్ణయించినట్టు గూగుల్ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి Google+ అకౌంట్లలోని డేటా మొత్తం డిలిట్ కానుంది. ఫిబ్రవరి 4 నుంచే మీరు కొత్త డేటా అప్‌లోడ్ చేయడానికి కుదరదు. మరి మీకు గూగుల్ ప్లస్ అకౌంట్ ఉందా? అందులో ఫోటోలు, వీడియోలు ఉన్నాయా? అయితే మీరేం చేయాలో తెలుసుకోండి.

Read this: #Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల... వివరాలివే

Google+ డేటా ఎలా డౌన్‌లోడ్ చేయాలి?


మీ Google+ డేటాను ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు డేటా డౌన్‌లోడ్ చేసినంత మాత్రాన Google+ ప్రొఫైల్ డిలిట్ కాదు. కావాలంటే మీరే మీ ప్రొఫైల్‌ని డిలిట్ చేయొచ్చు. ముందుగానే Google+ డేటాను డౌన్‌‌లోడ్ చేయాలి. మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ యువర్ డేటా పేజీలోకి వెళ్లాలి. మీరు కావాలనుకున్నవి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్‌ పేజీలోకి వెళ్లి ఫైల్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ డేటాను ఎలా పొందాలో చెప్పి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read this: Alert: ఫోటో ఎడిటింగ్ యాప్స్‌లో వైరస్... ఈ యాప్స్ మీ దగ్గరున్నాయా?

Google Plus shut down, delete google+ profile, Google, Google plus data backup, Google plus data download, Google+, Google Plus shutting down, Google Apps, Gmail, new GMAIL app, గూగుల్ ప్లస్ డేటా డౌన్‌లోడ్, గూగుల్ ప్లస్ డేటా బ్యాకప్, గూగుల్ ప్లస్ షట్ డౌన్, గూగుల్ ప్లస్ ప్రొఫైల్
గూగుల్ ప్లస్

Google+ ప్రొఫైల్ ఎలా డిలిట్ చేయాలి?

జీమెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి టాప్ రైట్ కార్నర్‌లో ప్రొఫైల్ పిక్చర్‌పైన క్లిక్ చేయాలి. అక్కడ "గూగుల్ ప్లస్ ప్రొఫైల్" అని కనిపిస్తే మీ అకౌంట్ గూగుల్ ప్లస్‌తో లింక్ అయినట్టు అర్థం. "గూగుల్ ప్లస్ ప్రొఫైల్" పైన క్లిక్ చేస్తే గూగుల్ ప్లస్ పేజీ ఓపెన్ అవుతుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి పేజీ చివర్లో "డిలిట్ యువర్ గూగుల్ ప్లస్ ప్రొఫైల్"పై క్లిక్ చేయాలి. గూగుల్ ప్లస్ ప్రొఫైల్ డిలిట్ చేస్తే ఏం జరుగుతుందో వివరంగా ఉంటుంది. పూర్తిగా చదివి ప్రొఫైల్ డిలిట్ చేయొచ్చు. ఆ తర్వాత జీమెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి టాప్ రైట్ కార్నర్‌లో ప్రొఫైల్ పిక్చర్‌పైన క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ "గూగుల్ ప్లస్ ప్రొఫైల్" కనిపించదు. మీ "గూగుల్ ప్లస్ ప్రొఫైల్" డిలిట్ అయిపోయినట్టే.

Read this: Honor View 20: రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లల్లో హానర్ వ్యూ 20 సేల్

మీరు గూగుల్ ప్లస్ అకౌంట్ డిలిట్ చేస్తే అందులోని డేటా మాత్రమే పోతుంది. మీరు డిలిట్ చేయకపోయినా ఏప్రిల్ 2 నుంచి డేటా డిలిట్ అవుతుంది. అయితే గూగుల్ ఫోటోస్‌లో అప్‌లోడ్ చేసిన డేటా, ఫోటోలు మాత్రం డిలిట్ కావు. మీ జీమెయిల్, యూట్యూబ్ లాంటి సేవలన్నీ ఎప్పట్లాగే వాడుకోవచ్చు.

గూగుల్ ప్లస్ డిలిట్ చేయడానికి పలు కారణాలున్నాయి. గతేడాది ఓ బగ్ కారణంగా 5 లక్షల మంది డేటాకు ముప్పు వాటిల్లింది. ఆ బగ్‌ను గుర్తించేసరికి మరో బగ్ కారణంగా 5.25 కోట్ల యూజర్ల డేటాకు మరో ముప్పు ఎదురైంది. దీంతో గూగుల్ ప్లస్‌ని మూసెయ్యాలని నిర్ణయించింది గూగుల్.

ఇవి కూడా చదవండి:

Attention Please: ఇకపై మీ రైలు ఆలస్యంగా రాదు... భారతీయ రైల్వే కొత్త ప్లానింగ్

Income Tax: 80సీ లిమిట్ మొత్తం వాడేశారా? పన్ను ఆదా చేయడానికి మరో 5 మార్గాలు

Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో యాడ్-ఆన్ మంచిదేనా?
First published: February 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading