హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Play: గూగుల్ ప్లే స్టోర్ సరికొత్త లోగో.. ఆ మెంబర్స్ కు దిమ్మతిరిగే స్పెషల్ రివార్డ్స్.. వాళ్లెవరో లుక్కేయండి !

Google Play: గూగుల్ ప్లే స్టోర్ సరికొత్త లోగో.. ఆ మెంబర్స్ కు దిమ్మతిరిగే స్పెషల్ రివార్డ్స్.. వాళ్లెవరో లుక్కేయండి !

  గూగుల్ ప్లే సరికొత్త లోగో.. ఆ మెంబర్స్ కు దిమ్మ తిరిగే స్పెషల్ రివార్డ్స్.. వారెవరో లుక్కేయండి !

గూగుల్ ప్లే సరికొత్త లోగో.. ఆ మెంబర్స్ కు దిమ్మ తిరిగే స్పెషల్ రివార్డ్స్.. వారెవరో లుక్కేయండి !

టెక్ దిగ్గజం గూగుల్ నుంచి గూగుల్ ప్లే (Google Play) సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి 2022 నాటికి పది సంవత్సరాలు పూర్తవుతోంది. పదో వార్షికోత్సవాన్ని ఈ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ సరికొత్త, మెరుగైన లోగో(Logo)తో జరుపుకుంటుంది.

ఇంకా చదవండి ...

టెక్ దిగ్గజం గూగుల్ నుంచి గూగుల్ ప్లే (Google Play) సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి 2022 నాటికి పది సంవత్సరాలు పూర్తవుతోంది. ఆండ్రాయిడ్(Android), స్మార్ట్‌టీవీ, ఇతర రకాల డివైజ్‌లకు 2012లో వేర్వేరు తేదీల్లో గూగుల్ ప్లే సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పదో వార్షికోత్సవాన్ని ఈ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ సరికొత్త, మెరుగైన లోగోతో జరుపుకుంటుంది. గూగుల్ ప్లే లోగో తాజాగా సరికొత్త రూపంలోకి మారింది. లోగో మొత్తం ఆకృతిని కంపెనీ మార్చేసింది. గూగుల్ ఇతర ఐకాన్స్‌కు ఉపయోగించే ఆకుపచ్చ, పసుపు, నీలం, ఎరుపు రంగులతో కొత్త లోగో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

పదో వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ప్లే పాయింట్స్ (Play Points) మెంబర్స్‌కు పది రెట్లు ఎక్కువ రివార్డ్ పాయింట్లను అందిస్తామని గూగుల్ ప్లే ట్వీట్ చేసింది. అంటే ఇప్పుడు గూగుల్ ప్లే పాయింట్స్ మెంబర్స్‌కు స్పెషల్ రివార్డ్‌ లభిస్తుంది. వీరు ప్లే స్టోర్ ద్వారా చేసే ప్రతి కొనుగోలుపై ఇప్పుడు 10 రెట్లు ఎక్కువ పాయింట్‌లను పొందవచ్చు. అయితే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్(Offer) అని కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: Glowing Skin: ఈ నాలుగు రకాల జ్యూస్‌లతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా తయారు చేసుకోండి !



గూగుల్ ప్లే వైస్ ప్రెసిడెంట్ టియాన్ లిమ్ ఈ విషయాల గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘గూగుల్ మ్యాజిక్‌ను మెరుగ్గా ప్రతిబింబించే కొత్త లోగోను పరిచయం చేస్తున్నాం. మా ఇతర ప్రొడక్ట్స్ అయిన గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ఫోటోస్, జీమెయిల్(Gmail), ఇతర లోగోలతో మ్యాచ్ చేయడానికి ఈ మార్పులు తీసుకొస్తున్నాం. ఇప్పుడు190 దేశాలలో 2.5 బిలియన్ల కంటే ఎక్కువ మంది యూజర్లు.. యాప్స్, గేమ్స్ కోసం ప్రతి నెలా గూగుల్ ప్లే సేవలను ఉపయోగిస్తున్నారు. 2 మిలియన్లకు పైగా డెవలపర్లు తమ వ్యాపారాలను నిర్మించుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను చేరుకోవడానికి మాతో కలిసి పని చేస్తున్నారు’ అని చెప్పారు.

ఈ నెల ప్రారంభంలో గూగుల్ తాజా మీడియా స్ట్రీమింగ్ డివైజ్‌ క్రోమ్‌కాస్ట్‌తో విత్ గూగుల్ టీవీని లాంచ్ చేసింది. ఇవి ఇప్పుడు ఇండియాలో అందుబాటులో ఉన్నట్లు గూగుల్ తెలిపింది. దీని ధర రూ.6,399గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. గూగుల్ TV అనేది ఆండ్రాయిడ్ TVకి రీబ్రాండెడ్ వెర్షన్. ఇది ఏ టీవీకైనా స్మార్ట్ టీవీ(Smart Tv) క్యాపబిలిటీస్ అందిస్తుంది. దీన్ని HDMI కనెక్టర్ ద్వారా టీవీకి ప్లగ్ చేయవచ్చు, వైర్‌లెస్ రిమోట్‌ ఉపయోగించి డివైజ్‌ను కంట్రోల్ చేయవచ్చు. వైర్‌లెస్ రిమోట్ వాయిస్ ఇన్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది స్పెషల్ గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను కలిగి ఉంది.

First published:

Tags: Android, GMAIL, Google, Smart TV, Tech news

ఉత్తమ కథలు