Home /News /technology /

GOOGLE PLAY TESTING THIS NEW FEATURE TO HELP YOU DISCOVER OFFERS CHECK ALL DETAILS JNK GH

Google Play app: గూగుల్​ ప్లే స్టోర్​లో కొత్త ఫీచర్​​.. అన్ని ఆఫర్లు తెలియజేసేలా ప్రత్యేక ఆఫర్​ ట్యాబ్​ పరిచయం

గూగుల్ ప్లే స్టోర్‌లో కొత్త ఫీచర్.. వివరాలు ఇవే (PC: Google)

గూగుల్ ప్లే స్టోర్‌లో కొత్త ఫీచర్.. వివరాలు ఇవే (PC: Google)

గూగుల్​ ప్లే యాప్​ స్టోర్​ కింది భాగంలో ఇప్పటివరకు గేమ్స్​, యాప్స్​, మూవీస్​, బుక్స్​ ట్యాబ్​లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు కొత్తగా ‘ఆఫర్స్’ ట్యాబ్​ను జోడిస్తోంది. ఈ కొత్త ట్యాబ్ ఇప్పటికే ఉన్న గేమ్స్, యాప్‌లు, సినిమాలు, టీవీ, పుస్తకాలు వంటి ట్యాబ్‌ల సరసన చేరుతుంది.

ఇంకా చదవండి ...
టెక్​ దిగ్గజం గూగుల్ (Google) వరుసగా కొత్త ఫీచర్లను (New Features) పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల తన గూగుల్​ పే యాప్​లో (Google Pay App) వాయిస్​ బేస్డ్​ మనీ ట్రాన్స్​ఫర్​ (Money Transfer) ఫీచర్​ను జోడించిన గూగుల్​.. ఇప్పుడు గూగుల్​ ప్లే స్టోర్​లో (Google Play Store) కొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. గూగుల్​ ప్లే యాప్​ స్టోర్​ కింది భాగంలో ఇప్పటివరకు గేమ్స్​, యాప్స్​, మూవీస్​, బుక్స్​ ట్యాబ్​లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు కొత్తగా ‘ఆఫర్స్’ ట్యాబ్​ను జోడిస్తోంది. ఈ కొత్త ట్యాబ్ ఇప్పటికే ఉన్న గేమ్స్, యాప్‌లు, సినిమాలు, టీవీ, పుస్తకాలు వంటి ట్యాబ్‌ల సరసన చేరుతుంది. అయితే ఈ ట్యాబ్​ యూజర్లందరికీ కనిపించదు. కేవలం గూగుల్​ ప్లే పాస్​ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న యూజర్లకు మాత్రమే ఈ ‘ఆఫర్​’ అందుబాటులో ఉంటుంది. ఈ ట్యాబ్​ ద్వారా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన ఆఫర్లను ఒకే దగ్గర చూసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న థంబ్‌ నెయిల్స్​ కంటే పెద్ద పెద్ద కవర్ ఫోటోస్​తో ఈ ఆఫర్​ ట్యాబ్​ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్లను కూడా కంపెనీ షేర్ చేసింది. ఈ ఆఫర్​ సెక్షన్​లోనే 'మీరు ఇష్టపడే గేమ్​ ఆఫర్లు' అనే ట్యాబ్ కూడా ఉంటుంది. గూగుల్​ ప్లే ఇప్పటికే ఈ ఆఫర్​ సెక్షన్​ను కలిగి ఉంది. అయితే ఆఫర్లకు సంబంధించిన ప్రత్యేక ట్యాబ్​ ఇప్పటివరకు అందుబాటులో లేదు. దీన్ని త్వరలోనే A/B టెస్టర్లకు మొదట అందుబాటులోకి తేనుంది. కంపెనీ త్వరలోనే ఈ ఫీచర్​ను అధికారికంగా ప్రకటించనుంది.

Vivo V23e 5G: వివో వి23ఈ 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్.. అద్భుతమైన ఫీచర్లతో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్




* ఒకే దగ్గర అన్ని ఆఫర్లు..

ఈ సంవత్సరం ప్రారంభంలో గూగుల్​ ప్లే తన ఇంటర్‌ఫేస్‌ను రిఫ్రెష్ చేసింది. ఈ పెద్ద అప్‌డేట్‌ ద్వారా హాంబర్గర్ మెనూని తొలగించి, దానిని నేమ్ ఐకాన్‌తో రిప్లేస్​ చేసింది. యూజర్లు ఈ​ నేమ్ ఐకాన్‌పై క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్లు, పేమెంట్లు, సబ్​స్క్రిప్షన్లు, ప్లే ప్రొటెక్షన్​ వంటి సాధారణ సెట్టింగ్‌లకు వారు యాక్సెస్ పొందుతారు. మెయిన్​ సెట్టింగ్స్​ పేజీలో డ్రాప్​డౌన్​ మెనూని కూడా చేర్చింది. ఈ డ్రాప్-డౌన్ మెనూలో లైబ్రరీని కూడా పరిచయం చేసింది. ఈ లైబ్రరీ మెనూలో విష్​ లిస్ట్​ను జోడించుకునే అవకాశం ఉంటుంది. యూజర్లకు వారి ప్రాంతం ఆధారంగా ప్లే పాయింట్లు, ప్లే పాస్​ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవల గూగుల్ భారత యూజర్ల కోసం కొన్ని ప్రత్యేక ఫీచర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరిన్ని కొత్త సదుపాయాలతో యూజర్ల దృష్టిని సంస్థ ఆకర్షిస్తోంది.
Published by:John Kora
First published:

Tags: Google, Google pay, New feature, Technology

తదుపరి వార్తలు