టెక్ దిగ్గజం గూగుల్ (Google) తీసుకొచ్చిన ప్లేస్టోర్ (Play store) గురించి ఆండ్రాయిడ్ యూజర్లందరికీ తెలిసే ఉంటుంది. అన్ని రకాల అప్లికేషన్లు ప్లే స్టోర్‌లో దొరుకుతాయి. ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ (Search Bar)పై నొక్కి కావాల్సిన యాప్ లేదా గేమ్ పేరు టైప్ చేసి వాటిని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే తాజాగా గూగుల్, ప్లేస్టోర్‌లోని సెర్చ్ ఫీల్డ్‌లో అడ్వర్టైజింగ్ యాప్స్ (Advertising Apps) టెస్ట్ చేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని ఒక ప్రముఖ టెక్ వెబ్సైట్ రిపోర్ట్ వెల్లడించింది. మరి అడ్వర్టైజింగ్ యాప్స్ అంటే ఏంటి? వీటి వల్ల ప్రయోజనం ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెర్చ్ బాక్స్‌పై క్లిక్ చేయగానే నాలుగు రీసెంట్ సెర్చెస్ కనిపిస్తాయి. కానీ ప్లే స్టోర్ అప్డేట్ 33.0.17-21లో సెర్చ్ ఫీల్డ్‌పై క్లిక్ చేసినప్పుడు ఓన్లీ అడ్వర్టైజింగ్ యాప్స్ మాత్రమే కనిపించాయి. రిపోర్ట్ ప్రకారం, ఈ యాప్ వెర్షన్లో యూజర్ ఏదైనా ఒక లెటర్ టైప్ చేసిన తర్వాతనే సెర్చ్ హిస్టరీ కనిపిస్తుంది. తర్వాత మునుపటి సెర్చ్‌లు మొదట డిస్ప్లే అవుతాయి. ఆపై ఆటోకంప్లీట్ రికమండేషన్స్ కనిపిస్తాయి. సెర్చ్ ఫీల్డ్‌పై ట్యాప్ చేసిన తర్వాత యూజర్ ఎన్నడూ సెర్చ్ చేయని, ఇంటరాక్ట్ అవ్వని యాప్స్ కనిపిస్తాయి. యూజర్‌కి నచ్చే యాప్‌లు & గేమ్‌లను సెర్చ్ ఫీల్డ్‌లోనే చూపించడానికి గూగుల్ ఈ అడ్వర్టైజింగ్ యాప్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం.
“ఈరోజు ప్లే స్టోర్ వెర్షన్ 33.0.17-21 వాడుతున్న ఒక డివైజ్‌లో సెర్చ్ ఫీల్డ్‌ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎన్నడూ సెర్చ్ చేయని లేదా ఇంటరాక్ట్ అవ్వని మూడు యాప్స్ కనిపించాయి. అవన్నీ గేమ్‌లు. అవి వాటి ఐకాన్స్‌తో సహా కనిపించాయి. సమ్మనర్స్ వార్: క్రానికల్స్, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ సీజన్ 10, ఫిష్‌డమ్ సాలిటైర్ అనే గేమ్స్ కనిపించాయి. ఆ యాప్స్ పెయిడ్ సజెషన్సా లేదా మామూలు సజెషన్సా అనేదానిపై క్లారిటీ లేదు. ఈ మార్పు నవంబర్‌లో రీసెంట్ Google Play సిస్టమ్ అప్డేట్కి సంబంధించినది కావచ్చు. ఈ అప్డేట్లో ఫోన్ సెర్చ్ రిజల్ట్స్ కోసం కొత్త ఫార్మాట్లు, మీరు ఇష్టపడే యాప్‌లు & గేమ్‌లను కనుగొనడంలో మీకు సహాయపడే కొత్త ఫీచర్లు ఉన్నాయి." అని ఆ రిపోర్ట్ పేర్కొంది.
కాల్ ఆఫ్ డ్యూటీ అనేది ప్లే స్టోర్ గేమ్స్ ట్యాబ్‌లోని 'సజెస్టెడ్ ఫర్ యూ' సెక్షన్లో తరచుగా కనిపిస్తుంది. అయితే టెస్టింగ్‌లో అది సెర్చ్ సెక్షన్లో కనిపిస్తోంది. ప్లే స్టోర్‌లో సెర్చ్ ఫీల్డ్ కింద కనిపించే అడ్వర్టైజింగ్ యాప్స్ 'సజెస్టెడ్ ఫర్ యూ' ట్యాబ్‌లో కనిపించడం లేదని రిపోర్టు వెల్లడించింది. ఇవి సెర్చ్ బార్ కింద కనిపించే న్యూ యాప్ ప్రమోషన్స్ అయి ఉండొచ్చని ఇంకొన్ని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. అయితే మోస్ట్ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం, మేజర్ అప్డేట్స్, ఆన్‌గోయింగ్ ఈవెంట్స్ లేదా యూజర్స్ ఆసక్తి చూపే యాప్‌లు, గేమ్‌లను హైలైట్ చేయడానికి ఒక ఆర్గానిక్ డిస్కవరీ ఫీచర్‌గా గూగుల్ దీనిని టెస్ట్ చేస్తోంది. అడ్వర్టైజింగ్ యాప్స్‌గా పిలిచే ఇవి యూజర్ల అభిరుచికి తగినట్లు లేదా వారు ఇష్టపడే గేమ్స్, యాప్స్ చూపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Apps, Google, Google Play store