GOOGLE PLAY STORE NEW UPDATE LAUNCH OF LABELS TO KNOW HOW MUCH DATA ANDROID APPS ARE COLLECTING GH VB
Google Play Store: గూగుల్ ప్లేస్టోర్ కొత్త అప్డేట్.. వాటి కోసం కొత్త లేబుల్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటన..
ప్రతీకాత్మక చిత్రం
ఆండ్రాయిడ్ యాప్‌ల ద్వారా సేకరించిన డేటా రకాలపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ప్లేస్టోర్‌కు కొత్త ప్రైవసీ లేబుల్స్ తీసుకువస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.
టెక్నాలజీ(Technology) వాడకం పెరిగే కొద్దీ, దాన్ని తప్పుడు పనులకు ఉపయోగించే ధోరణి సైతం పెరుగుతోంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు(Smartphones), ఇంటర్నెట్(Internet) ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చిన తర్వాత వివిధ రకాల యాప్స్ వాడకం పెరిగింది. ఈ క్రమంలో కొన్ని రకాల యాప్స్(Apps) యూజర్ల ప్రైవసీ(Privacy), సెక్యూరిటీకి భంగం కలిగిస్తున్నాయి. డెవలపర్లు యాప్(APP) ద్వారా యూజర్ల డేటాను సేకరిస్తున్నారనే వార్తలు మనకు తరచుగా వినిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు గూగుల్ ప్లే స్టోర్(Playstore), యాపిల్ యాప్ స్టోర్ ఎప్పటికప్పుడు కొత్త రకం సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తుంటాయి. తాజాగా ఆండ్రాయిడ్ యాప్‌ల(Android App) ద్వారా సేకరించిన డేటా(Data) రకాలపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను(New Feature) లాంచ్ చేసింది. ఇప్పుడు ప్లేస్టోర్‌కు కొత్త ప్రైవసీ లేబుల్స్(New Privacy Labels) తీసుకువస్తున్నట్లు గూగుల్(Google) ప్రకటించింది.
గత ఏడాదే యాప్ స్టోర్ కోసం యాపిల్ ఇలాంటి లేబుల్స్‌ను ప్రారంభించింది. యాప్స్ ఎంత డేటాను సేకరిస్తున్నాయనే వివరాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు. అయితే కాస్త ఆలస్యంగానైనా గూగుల్ ఈ దిశగా అడుగులు వేసింది. ఈ లేబుల్.. యాప్స్ ద్వారా డెవలపర్లు ఎంత డేటా సేకరిస్తున్నారనే వివరాలను యూజర్లకు చూపుతుంది. ‘ఏదైనా యాప్ సేకరించే డేటాను డిస్ప్లే చేయడం మాత్రమే సరిపోదని యూజర్లు, యాప్ డెవలపర్ల నుంచి వాదనలు విన్నాం. తమ డేటాను ఎలాంటి అవసరం కోసం సేకరిస్తున్నారు? డెవలపర్ ఆ డేటాను థర్డ్ పార్టీలతో షేర్ చేస్తున్నారా, లేదా? అనేది యూజర్లు తెలుసుకోవాలనుకుంటున్నారు.’ అని గూగుల్ పేర్కొంది. ఈ ఫీచర్ ఇప్పుడు ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వస్తోంది.
గూగుల్ గత ఏడాది మేలో ‘గూగుల్ ప్లే డేటా సేఫ్టీ సెక్షన్’గా పిలిచే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. మార్పులను అమలు చేయడానికి డెవలపర్లకు ఇది చాలా సమయాన్ని ఇస్తుంది. ప్రత్యేకంగా దీంట్లో కొత్త లేబుల్స్ ఉంటాయి. ఎలాంటి డేటాను సేకరిస్తున్నారు; ఆ డేటాను థర్డ్ పార్టీస్‌తో షేర్ చేస్తున్నారా; యాప్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్; యాప్ గూగుల్ ప్లే ఫ్యామిలీ పాలసీకి కట్టుబడి ఉందా, లేదా; డెవలపర్ గ్లోబల్ స్టాండర్డ్‌కు వ్యతిరేకంగా సెక్యూరిటీ ప్రాస్టీసెస్ను వ్యాలిడేట్ చేశారా.. వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ విషయంలో గూగుల్, యాపిల్ స్టోర్ల లక్ష్యం ఒకటే. యాప్‌లు డేటాను ఎలా, ఎందుకు సేకరిస్తున్నాయనే విషయంపై వినియోగదారులకు మరింత అవగాహన కల్పించేందుకు, వారికి డేటాపై మరింత నియంత్రణ అందించేందుకు కృషి చేస్తున్నాయి. వారు ఉపయోగించాలనుకుంటున్న సేవల రకాల ప్రకారం నిర్ణయాలు తీసుకునేలా చేయడం దీని లక్ష్యం.
ప్లే స్టోర్‌కు లేబుల్స్ జోడించడం అనేది యూజర్లు, ప్రైవసీ అడ్వకేట్స్ విజయంగా భావిస్తున్నారు. ఎందుకంటే డెవలపర్లు ఇప్పుడు ఎలాంటి డేటాను ఎందుకు సేకరించారు అనే వివరాలను రిపోర్ట్ చేయాలి. ఈ కొత్త సెక్షన్ మరికొన్ని వారాల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. డెవలపర్లందరూ తమ డేటా సేఫ్లీ సెక్షన్ వివరాలను సమర్పించడానికి జూన్ 20 వరకు సమయం ఇచ్చారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.