హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

హెచ్చరిక.. మీ ఫోన్‌లో ఈ 2 యాప్స్ ఉంటే వెంటనే డిలేట్ చేయండి.. లేదంటే ఫసక్కే!

హెచ్చరిక.. మీ ఫోన్‌లో ఈ 2 యాప్స్ ఉంటే వెంటనే డిలేట్ చేయండి.. లేదంటే ఫసక్కే!

హెచ్చరిక.. మీ ఫోన్‌లో ఈ 2 యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలేట్ చేయండి.. లేదంటే ఫసక్కే!

హెచ్చరిక.. మీ ఫోన్‌లో ఈ 2 యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలేట్ చేయండి.. లేదంటే ఫసక్కే!

Fake Apps | స్మార్ట్‌ఫోన్ వాడే వారికి హెచ్చరిక. మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలేట్ చేయండి. ఎందుకంటే రెండు యాప్స్‌లో మాల్వేర్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అందువల్ల వీటిని వెంటనే ఫోన్ నుంచి తొలగించండి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Dangerous Apps | స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే ఫోన్‌లో ఎన్నో రకాల యాప్స్ ఉంటాయి. కొంత మంది గేమ్స్ యాప్స్ ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటే.. మరికొంత మంది ఫైనాన్షియల్ యాప్స్ (Apps) ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఎవరి అభిరుచులకు అనుగుణంగా వారు నచ్చిన యాప్స్ వాడుతూ ఉంటారు. అయితే ఏ యాప్ అంటే ఆ యాప్‌ను వాడటం వల్ల ఇబ్బందులు రావొచ్చు. అందుకే అవసరం ఉంటే తప్ప అనవసరంగా యాప్స్‌ను ఫోన్‌లో (Smartphone) ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. ఎందుకంటే అన్ని యాప్స్ సురక్షితంగా ఉండకపోవచ్చు.

  మనం ఫోన్ భద్రంగా ఉండాలని గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాంటీ వైరస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటాం. అయితే వీటిల్లో కూడా కొన్నింటి వల్ల ఇబ్బందులు కలగొచ్చు. ఎందుకంటే షార్క్‌బాట్ మాల్వేర్ మళ్లీ గూగుల్ ప్లేస్టోర్‌లోకి వచ్చింది. ఫేక్ యాంటీ వైరస్ యాప్స్, క్లీనర్ యాప్స్‌లో ఇది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మాల్వేర్ యూజర్ల బ్యాంకింగ్ డేటాను తస్కరిస్తోంది. అంటే మీరు ఇలాంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే నష్టపోవాల్సి రావొచ్చు. మీ బ్యాంకింగ్ వివరాలు మోసగాళ్ల చేతికి చేరే ప్రమాదం ఉంటుంది.

  పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొంటే రూ.22 వేల తగ్గింపు! ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు

  మిస్టర్ ఫోన్ క్లీనర్, కిల్‌హవీ మొబైల్ సెక్యూరిటీ వంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఈ యాప్స్‌ను 60 వేల సార్లు ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అందువల్ల మీరు కూడా ఈ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఉంటే.. వెంటనే మీ ఫోన్ నుంచి తొలగించండి. మీ డేటాను సురక్షితంగా ఉంచుకోండి. ఎన్‌సీసీ గ్రూప్‌కు చెందిన ఫాక్స్ ఐటీ ప్రకారం.. స్పెయిన్, ఆస్ట్రేలియా, పోలాండ్, జర్మనీ, యూఎస్, ఆస్ట్రియాలోని యూజర్లు లక్ష్యంగా ఈ మాల్వార్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి యాప్స్‌కు మనం దూరంగా ఉండటం ఉత్తమం.

  ఆఫర్లే ఆఫర్లు.. సగం ధరకే టీవీలు, ఏసీలు.. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై భారీ తగ్గింపు

  యాప్స్‌ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అప్‌డేట్ రూపంలో ఈ మాల్వేర్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతూ వస్తోందని ఫాక్స్ ఐటీ అల్బర్ట్ సెరుగా తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్‌లో రెండు యాప్స్‌ను గుర్తించామని పేర్కొన్నారు. షార్క్‌బాట్ డ్రాపర్ యాప్స్ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ఇవి 10 వేల నుంచి 50 వేల వరకు డౌన్స్‌లోడ్స్‌ను కలిగి ఉన్నాయని తెలిపారు. గూగుల్ ఈ యాప్స్‌ను నిషేధించిందని తెలిపారు. అందువల్ల ఇంకా ఎవరైనా వీటిని ఉపయోగిస్తూ ఉంటే డిలేట్ చేయడం మంచిది. కాగా షార్క్‌బాట్ అనేది బ్యంకింగ్ ట్రోజన్. ఇది క్రిప్టో యాప్స్, ఫైనాన్షియల్ యాప్స్ లక్ష్యంగా పని చేస్తుంది. వీటి నుంచి డేటాను తస్కరిస్తుంది. ఇందులో లాగిన్ సమాచారం కూడా ఉంటుంది. ఈ మాల్వేర్ ఈ వివరాలను హ్యాకర్లకు చేరవేస్తుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Apps, Cell phone, Malware, Mobile phone, Smartphone

  ఉత్తమ కథలు