టెక్ దిగ్గజం గూగుల్ (Goole) తయారు చేస్తున్న పిక్సెల్ ఫోన్లు (Pixel Phones) ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో విడుదలవుతున్నాయి. యాపిల్ ఐఫోన్లకు ధీటుగా గూగుల్ వీటిలో బెస్ట్, అడ్వాన్స్‌డ్, హై రేంజ్ ఫీచర్లను అందిస్తోంది. ధరలు కూడా ఐఫోన్ల(iPhones) తో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంటున్నాయి. దీంతో ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కోసం చూసేవారు వీటి కోసం ఆరా తీస్తున్నారు. అయితే గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఫోన్లు గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. వీటికి సక్సెసర్‌గా పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో మోడళ్లు రానున్నాయి.
అక్టోబర్ 6న గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ వాచ్‌లను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. గూగుల్ నుంచి రానున్న మొదటి స్మార్ట్‌వాచ్.. పిక్సెల్ వాచ్‌ను కూడా రిలీజ్ చేయనుంది. అయితే ఇండియాలో కూడా పిక్సెల్ 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు గూగుల్ ధ్రువీకరించింది. కానీ లాంచ్ డేట్‌ను వెల్లడించలేదు.
ఫ్లిప్‌కార్ట్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో కోసం స్పెషల్ పేజీని కూడా ఏర్పాటు చేసింది. అంటే ఈ రెండు ఫోన్లు ఇండియాలో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని అర్థమవుతోంది. కాబట్టి అక్టోబర్ 6న దేశంలో ఈ రెండు ఫోన్లు విడుదల కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటి ధర, ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ స్పెసిపికేషన్లను చెక్ చేద్దాం.
* ధరలు ఎంత?
తాజా లీక్‌ల ప్రకారం వెనిలా పిక్సెల్ 7 ధర 599 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. మన కరెన్సీలో ఇది రూ. 48,600కి సమానం. పిక్సెల్ 7 ప్రో ధర 899 డాలర్ల (దాదాపు రూ.72,900) నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఇండియాలో ట్యాక్స్‌లతో కలిపి ఈ ధరలు మరింత పెరగవచ్చు. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో అధికారికంగా ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేసిన తర్వాతే, వీటి ధరల వివరాలు కచ్చితంగా తెలిసే అవకాశం ఉంది.
* కెమెరా, పర్ఫార్మెన్స్
పిక్సెల్ 7 ఫోన్లు రెండిట్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 11 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. పిక్సెల్ 7లో 48 మెగాపిక్సెల్, పిక్సెల్ 7 ప్రోలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలు ఉంటాయి. పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లు టెన్సర్ G2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. పిక్సెల్ 7 ఫోన్ 6.3 అంగుళాల ఫుల్ HD+ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో రానుందని, పిక్సెల్ 7 ప్రో వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల QHD+ OLED ప్యానెల్‌తో రానుందని లీకుల ద్వారా తెలుస్తోంది. పిక్సెల్ 7 ప్రో మోడల్ 12GB RAM వెర్షన్‌లో రానుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 128GB, 256GB స్టోరేజ్ స్పేస్‌తో రానున్నాయి.
ఇది కూడా చదవండి :వావ్.. ఈ 5జీ ఫోన్‌పై రూ.12 వేల డిస్కౌంట్.. రూ.26 వేల ఎక్స్చేంజ్ ఆఫర్!
* డిజైన్, ఫినిషింగ్
ఈ ఏడాది గూగుల్ నిర్వహించిన ‘Google I/O 2022’ ఈవెంట్‌లో పిక్సెల్ 7 సిరీస్ ఫోన్ల ప్రివ్యూను అందించింది. ఇప్పుడు కంపెనీ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ కొత్త డిజైన్ ఫిల్మ్‌ను ఆవిష్కరించింది. ఇటీవల విడుదల ఒక వీడియోలో కొత్త పిక్సెల్ వాచ్, పిక్సెల్ బడ్స్ ప్రోతో పాటు లేటెస్ట్ పిక్సెల్ ఫోన్లను చూపించింది. పిక్సెల్ 6 ఫోన్ల మాదిరిగా కాకుండా సరికొత్త రియర్ కెమెరా సెటప్‌తో, కొత్త కలర్ వేరియంట్లలో పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లు రానున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.
పిక్సెల్ 7 ఫోన్ అబ్సిడియన్, లెమన్‌గ్రాస్, స్నో ఫినిషింగ్‌తో వస్తుంది. అయితే పిక్సెల్ 7 ప్రో అబ్సిడియన్, హాజెల్, స్నో ఫినిషింగ్స్‌తో వస్తుంది. రియర్ ప్యానెల్ కూడా గ్లాసీ ఫినిషింగ్‌తో ఆకట్టుకుంటుంది. పిక్సెల్ 7 వేరియంట్ మాట్-ఫినిష్డ్ కెమెరా మాడ్యూల్, ఫ్రేమ్‌తో వస్తున్నట్లు కనిపిస్తోంది. పిక్సెల్ 7 ప్రో కెమెరా మాడ్యూల్, ఫ్రేమ్.. క్రోమ్ వంటి రిఫ్లెక్టివ్ సర్ఫేస్‌తో రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Smart watch, Smartphone, Tech news