హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Pixel 7: గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో ఫోన్లు అదిరిపోయాయ్.. రూ.15 వేల భారీ డిస్కౌంట్‌తో కొనండి!

Google Pixel 7: గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో ఫోన్లు అదిరిపోయాయ్.. రూ.15 వేల భారీ డిస్కౌంట్‌తో కొనండి!

గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో ఫోన్లు అదిరిపోయాయ్.. రూ.15 వేల భారీ డిస్కౌంట్‌తో కొనండి!

గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో ఫోన్లు అదిరిపోయాయ్.. రూ.15 వేల భారీ డిస్కౌంట్‌తో కొనండి!

Google Pixel 7 Pro | గూగుల్ ఎట్టకేలకు తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రోలను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ఫీచర్లు బాగున్నాయి. డిస్కౌంట్ ఆఫర్ కూడా పొందొచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Google Pixel 7 Pro | దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ తాజాగా అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. పిక్సెల్ 7 (Pixel 7) పేరుతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాదిలో ఎంత గానే ఎదురు చూస్తున్న స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఇదే. గురువారం నాడు జరిగిన మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర వంటి విషయాలు తెలుసుకుందాం.

  గూగుల్ పిక్సెల్ 7 ఫోన్‌లో 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ టెన్సర్ జీ2 ప్రాసెసర్‌ను అమర్చింది. డ్యూయెల్ రియర్ కెమెరా (50 ఎంపీ, 12 ఎంపీ) ఉంటుంది. ముందు భాగంలో 10.8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని చెప్పుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 4270 ఎంఏహెచ్. 8 జీబీ ర్యామ్, ఎన్ఎఫ్‌సీ, 5జీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 59,999 నుంచి ప్రారంభం అవుతోంది.

  క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే.. వెంటనే ఈ 3 పనులు చేయండి! బ్యాంక్ నుంచి రిలీఫ్ పొందొచ్చు!

  ఇక గూగుల్ పిక్సెల్ 7 ప్రో ఫోన్‌లో 6.7 అంగుళాల ఎల్‌టీపీవో డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్, సినిమ్యాటిక్ వీడియో, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా (50 ఎంపీ, 12 ఎంపీ, 48 ఎంపీ) వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ ఫేస్ లాక్, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి. ఫిక్సెల్ 7 ప్రో ధర రూ. 84,999 నుంచి ప్రారంభం అవుతోంది. లాంచ్ ఆఫర్ కింద దీన్ని రూ.69,999కు కొనొచ్చు. అంటే 15 వేల భారీ తగ్గింపు లభిస్తోంది. ఇందులో బ్యాంక్ ఆఫర్ రూ.11,250. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 3,750. ఈ ఫోన్లకు ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి.

  హోమ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. 4 ఏళ్లు అదనంగా ఈఎంఐ కట్టాల్సిందేనా?

  దిగ్గజ ఈకామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ కొత్త ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో రెండు ఫోన్లు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. అక్టోబర్ 13 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం అవుతాయి. ఈ రెండు ఫోన్లు లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 13పై పని చేస్తాయి.

  మరోవైపు గూగుల్ తొలిసారిగా స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌లోకి తీసువచ్చింది. పిక్సెల్ వాచ్. దీని ధర దాదాపు రూ. 28,600గా ఉంది. ఇది బ్లూటూత్ వేరియంట్‌కు వర్తిస్తుంది. అదే ఎల్‌టీఈ వేరియంట్ అయితే రేటు రూ. 32,700గా ఉంది. అక్టోబర్ 6 నుంచి పిక్సెల్ స్మార్ట్‌వాచ్‌లకు ప్రిఆర్డర్ ఇవ్వొచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Google, Latest offers, Mobile offers, Offers, Smartphone

  ఉత్తమ కథలు