Home /News /technology /

GOOGLE PIXEL 6A SMARTPHONE LAUNCHED IN INDIA KNOW PRICE AND SPECIFICATIONS SS

Google Pixel 6A: ఇండియాలో లాంఛ్ అయిన పిక్సెల్ 6ఏ... 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, ఓలెడ్ డిస్‌ప్లే

Google Pixel 6A: ఇండియాలో లాంఛ్ అయిన పిక్సెల్ 6ఏ... 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, ఓలెడ్ డిస్‌ప్లే
(image: Google)

Google Pixel 6A: ఇండియాలో లాంఛ్ అయిన పిక్సెల్ 6ఏ... 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, ఓలెడ్ డిస్‌ప్లే (image: Google)

Google Pixel 6A | పిక్సెల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6A) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. ఆఫర్స్ కూడా ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.

గూగుల్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6A) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. కొన్ని నెలల క్రితం గూగుల్ IO ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ మొబైల్ ఇండియాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. గూగుల్ పిక్సెల్ 6ఏ ఫీచర్స్ ఎలా ఉంటాయన్న ఆసక్తి అందరిలో కనిపించింది. ఇందులో ఓలెడ్ డిస్‌ప్లే, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, డ్యూయెల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 6ఏ ధర


గూగుల్ పిక్సెల్ 6ఏ ధర వివరాలు చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999. యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రూ.39,999 ధరకే గూగుల్ పిక్సెల్ 6ఏ కొనొచ్చు. ఇక ఇప్పటికే పిక్సెల్ ఫోన్ వాడుతున్నవారు తమ మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.6,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇతర ఏ ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసినా రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ ప్రారంభమైంది. జూలై 28 తర్వాత గూగుల్ పిక్సెల్ 6ఏ డెలివరీ ప్రారంభం అవుతుంది.

Redmi K50i: తక్కువ ధరకే రెడ్‌మీ కే50ఐ రిలీజ్... డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 5,080mAh బ్యాటరీ, 64MP కెమెరా


గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్స్


గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. గ్లాస్ డిజైన్‌తో వస్తుంది. గూగుల్ సొంతగా రూపొందించిన టెన్సార్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 12 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్‌లో 4306ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ లభిస్తుంది. పిక్సెల్ ఫోన్స్ అన్నీ క్లీన్ ఆండ్రాయిడ్ వర్షన్‌తో వస్తాయి. అంటే ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర యాప్స్ ఏవీ ఉండవు.

Vivo T1X: రూ.10,999 ధరకే వివో టీ1ఎక్స్ వచ్చేసింది... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 6GB వరకు ర్యామ్



గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్‌తో పాటు పిక్సెల్ బడ్స్ ప్రో కూడా లాంఛ్ అయ్యాయి. ధర రూ.19,999. 11 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ లభిస్తుందని గూగుల్ చెబుతోంది. జూలై 28న బడ్స్ ప్రో సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Flipkart, Google, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు