GOOGLE PIXEL 6A GOOGLE PIXEL 6A SMARTPHONE LAUNCH IN INDIA THIS YEAR FEATURES AND SPECIFICATIONS ARE HERE GH VB
Google Pixel 6a: ఈ ఏడాదే ఇండియాలో గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ లాంచ్.. దీని ఫీచర్లు, ప్రత్యేకతలు..
ప్రతీకాత్మక చిత్రం
ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తూ మార్కెట్ వాటా పెంచుకుంటున్న గూగుల్.. త్వరలో మరో కొత్త పిక్సెల్ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) పేరుతో లైనప్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను (Smartphones) రిలీజ్ చేస్తూ మార్కెట్(Market) వాటా పెంచుకుంటున్న గూగుల్(Google).. త్వరలో మరో కొత్త పిక్సెల్ ఫోన్‌ను(Pixel Phone) రిలీజ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) పేరుతో లైనప్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. ఈ మిడ్-రేంజ్ పిక్సెల్ ఫోన్‌ను బుధవారం జరిగిన Google I/O 2022 కీనోట్ ఈవెంట్‌లో ఆవిష్కరించారు. గూగుల్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ అప్‌డేట్‌ను షేర్ చేసింది. పిక్సెల్ 6a ఫోన్ ఈ ఏడాది చివర్లో ఇండియాలో అమ్మకానికి వస్తుందని పేర్కొంది. Pixel 4a తర్వాత ఈ సిరీస్‌లో మన దేశంలో లాంచ్ అయ్యే ఫోన్ ఇదే కానుంది.
గూగుల్ ఫోన్లకు ఇండియాలో మార్కెట్ పెద్దగా లేకపోవడం, 5G నెట్‌వర్క్ లేకపోవడం వల్ల మన దేశంలో Pixel 5, Pixel 6 సిరీస్‌లను లాంచ్ చేయలేదు. అయితే గత కొన్నేళ్లుగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగంగా మారిపోయింది. దీంతో గూగుల్ మన దేశంపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం షియోమి, రియల్‌మీ, వన్‌ప్లస్ వంటి బ్రాండ్‌లతో పాటు యాపిల్ఐఫోన్ SE 2022 వంటి ఎన్నో డివైజ్‌లు మిడ్ రేంజ్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. దీంతో గూగుల్ సైతం కొత్త పిక్సెల్ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయాలని నిర్ణయించింది.
* గూగుల్ పిక్సెల్ 6A ధర
తాజా ఈవెంట్‌లో ప్రకటించిన వివరాలను బట్టి చూస్తే.. గూగుల్ పిక్సెల్ 6a ధర 449 డాలర్ల (సుమారు రూ. 34,700) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ కేవలం ఒక మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత మారకం విలువ, యాడ్-ఆన్ టాక్స్‌లను కలిపితే ఈ ఫోన్ ధర రూ. 40,000 వరకు ఉండవచ్చు. అయితే ఈ రేంజ్ ధరతో మిడ్ రేంజ్ ఫోన్లను యూజర్లు కొనుగోలు చేస్తారా లేదా అనేది గూగుల్ పరిగణనలోకి తీసుకొని ఇండియాలో ఫోన్ ధరను ప్రకటించే అవకాశం ఉంది.
We’re so thrilled to announce that the Pixel 6a is coming to India later this year 🫶
More details 🔜#GoogleIOhttps://t.co/WsYLhBu6ud
* గూగుల్ పిక్సెల్ 6A స్పెసిఫికేషన్‌లు
ఈ ఫోన్ 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే, ఫుల్ HD+ రిజల్యూషన్ సపోర్ట్‌తో వస్తుంది. కానీ 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే అందిస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఇన్‌బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లతో రానుంది. ఇది 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది గూగుల్ టెన్సార్ (Google Tensor) చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. పిక్సెల్ 6a ఫోన్ 12.2 మెగాపిక్సెల్ వైడ్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌తో యూజర్లను ఆకట్టుకోనుంది. పిక్సెల్ 6a ఫోన్ 4410mAh బ్యాటరీతో వస్తుంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ గురించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.