Google Smartphone Offers | భారీ తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్ (Smartphone) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. టెక్ దిగ్గజమైన గూగుల్ (Google) కూడా స్మార్ట్ఫోన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా రూ. 11 వేలు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జూలై నెలలో మార్కెట్లోకి వచ్చింది. దీని ఎంఆర్పీ రూ. 43,999. 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఈ రేటు వర్తిస్తుంది. అయితే ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ. 34,999కు కొనొచ్చు. అంటే దాదాపు 20 శాతం డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు.
రూ.3,999కే కొత్త స్మార్ట్‌ఫోన్.. ఎంఐ క్లియరెన్స్ సేల్‌లో సగం ధరకే ఫోన్లు!
అంతేకాకుండా మీరు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. రూ. 2 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ రెండు ఆఫర్లు కలుపుకుంటే గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్‌పై ఏకంగా రూ. 11 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
రూ.549కే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లోని ఈ ఆఫర్ గురించి తెలుసుకోండి!
ఈ ఫోన్లో 6.1 అంగుళాల ఫుల్ హెడ్డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, టైటన్ ఎం2 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ఇంకా ఈ ఫోన్లో 21 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలను అమర్చింది. ఈ ఫోన్లో 4410 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా 5జీ నెట్వర్క్, ఎన్ఎఫ్సీ సపోర్ట్ చేస్తుంది.
ఇకపోతే ఈ ఫోన్‌ను ఈఎంఐలో కూడా కొనుగోలు చేయొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 1697 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. ఈఎంఐ మొత్తం మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన మారుతుంది. 3 నెలలు, ఆరు నెలలు, 9 నెలలు, ఏడాది, 18 నెలలు ఇలా మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇంకా భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ. 21,500 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో ఈ గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్‌పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని భావించే వారు ఈ ఆఫర్ పరిశీలించొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Google, Latest offers, Mobile offers