Google Pixel 5a: త్వరలోనే గూగుల్ పిక్సెల్ 5a స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్... లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్స్

Google Pixel 5a: త్వరలోనే గూగుల్ పిక్సెల్ 5a స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్... లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Google Pixel 5a | గూగుల్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. గూగుల్ పిక్సెల్ 5ఏ రిలీజ్ కానుంది. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
గూగుల్​ పిక్సెల్ స్మార్ట్​ఫోన్లకు భారత్​లో మంచి డిమాండ్​ ఉంటుంది. ప్రీమియం రేంజ్​లో వచ్చే ఈ స్మార్ట్​ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది గూగుల్. ఇప్పటి వరకు పిక్సెల్ 4ఎ- 5జి వరకు మాత్రమే మార్కెట్​లో అందుబాటులో ఉండగా.. అతి త్వరలోనే పిక్సెల్​ 5ఎ- 5జి వేరియంట్​ కూడా రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన ఫీచర్లు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. కొత్తగా రాబోయే పిక్సెల్ 5ఎ 5జి డిజైన్​, ఫీచర్లు పిక్సెల్ 4 ఎ 5 జి మాదిరిగానే ఉంటాయని లీకులను బట్టి తెలుస్తోంది. అలాగే దీనిలో కూడా పిక్సెల్ 4 ఎ 5 జితో సమానమైన హార్డ్‌వేర్‌ను అందించనున్నారు. అయితే ఈ స్మార్ట్​ఫోన్​ ప్రస్తుతానికి యూఎస్, జపాన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గూగుల్ వెల్లడించింది. గ్లోబల్​ మార్కెట్​లో లాంచింగ్​పై ఎటువంటి స్పష్టతనివ్వలేదు. రాబోయే పిక్సెల్ 5ఎ 5 జి ధర, ఫీచర్లు ఇతర వివరాలను పరిశీలిద్దాం.

Rs 15 lakh prize money: మోదీ ప్రభుత్వం అద్భుత అవకాశం... రూ.15,00,000 గెలుచుకోండి ఇలా

New Rules from August 1: అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

గూగుల్ పిక్సెల్ 5 ఎ స్పెసిఫికేషన్లు


గూగుల్​ పిక్సెల్ 5 ఎ 5 జి 6.2 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్​ ఓఎల్ఈడి డిస్‌ప్లేతో వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765G SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. పిక్సెల్ 4 ఎ 5 జి, పిక్సెల్ 5 రెండింటిలో ఇదే చిప్​సెట్​ను ఉపయోగించారు. దీనిలో 8GB ర్యామ్​, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్​ వంటివి అందించారు. ఇక, కెమెరా విషయానికి వస్తే.. పిక్సెల్ 5ఎ 5జి వేరియంట్​ 12.2 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌ కెమెరాతో వస్తుంది. ప్రస్తుతం పిక్సెల్ 4 ఎ 5 జిలో 3,885 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించగా.. దీనిలో 4000mAh బ్యాటరీని అందించనున్నారు. ఈ బ్యాటరీ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో వస్తుంది. అయితే, దీనిలో వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్​ ఉండదు.

Airtel Plan: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... ఆ ప్లాన్ రద్దు

Vivo V19: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి

గూగుల్ పిక్సెల్ 5 ఎ ధర


పిక్సెల్ 5 ఎ వేరియంట్​​ పిక్సెల్ 4 ఎకు అప్​డేటెడ్ వెర్షన్​గా వస్తుంది. దీన్ని బట్టి చూస్తే పిక్సెల్ 5ఎ 5జీ ధర 4ఎ కంటే కొంచెం ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన రూ. 32,000 ప్రారంభ ధర వద్ద లభించే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం పిక్సెల్ 4 ఎ భారత మార్కెట్​లో రూ .29,999 ధర వద్ద అమ్ముడవుతోంది.
Published by:Santhosh Kumar S
First published: