ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సెప్టెంబర్‌లో పదుల సంఖ్యలో కొత్త మోడల్స్ వచ్చాయి. రాబోయేది దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ కావడంతో అక్టోబర్‌లో కూడా కంపెనీలు పోటాపోటీగా కొత్త స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. షావోమీ, రియల్మీ, సాంసంగ్ లాంటి బడా కంపెనీలు కొత్త మోడల్స్‌ని పరిచయం చేయనున్నాయి. గూగుల్ కూడా ఇండియాలో గూగుల్ పిక్సెల్ 4ఏ రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 17న ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 5, పిక్సెల్ 4ఏ 5జీ స్మార్ట్ఫోన్లను కూడా లాంఛ్ చేసింది. అయితే ఇవి ఇండియాకు రావట్లేదు. వీటి బదులు ఇండియాలో గూగుల్ పిక్సెల్ 4ఏ రిలీజ్ చేయాలని గూగుల్ నిర్ణయించింది. గూగుల్ పిక్సెల్ 4ఏ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 4ఏ టీజర్ పేజీ కనిపిస్తోంది. ఇక ఫోన్ విశేషాలు చూస్తే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 6బీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, గూగుల్ అసిస్టెంట్ బటన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. వెనుకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పోర్ట్రైట్ మోడ్, నైట్ సైట్, టాప్ షాట్ లాంటి కెమెరా ఫీచర్స్ ఉన్నాయి.
September Smartphones: సెప్టెంబర్‌లో రిలీజైన బెస్ట్ 12 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
WhatsApp Tricks: వాట్సప్ స్టేటస్‌లో ఈ ట్రిక్స్ ట్రై చేశారా?
గూగుల్ పిక్సెల్ 4ఏ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 5.81 అంగుళాల ఫుల్ హెచ్డీ ఓలెడ్ డిస్ప్లే, 1,080 x 2,340 పిక్సెల్ రెజల్యూషన్
ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ
రియర్ కెమెరా: 12.2మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,140ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: జస్ట్ బ్లాక్
ధర: సుమారు రూ.27,000
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android 10, Google, Smartphone