గూగుల్ స్మార్ట్‌ఫోన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 4ఏ ఇండియాలో అధికారికంగా రిలీజైంది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా మార్కెట్లో పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజైన సంగతి తెలిసిందే. ఇటీవల పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్ 5 స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసినా వాటిని ఇండియాలో లాంఛ్ చేయబోమని గూగుల్ ప్రకటించింది. కేవలం పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్‌ను మాత్రమే ఇండియాలో రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అక్టోబర్ 16న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ జరగనుంది. ఇండియాలో ధర గూగుల్ పిక్సెల్ 4ఏ రూ.31,999. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్పెషల్ లాంఛ్ ప్రైస్ ప్రకటించింది గూగుల్. రూ.2,000 తక్కువకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమ్మనుంది. అంటే రూ.29,999 ధరకే గూగుల్ పిక్సెల్ 4ఏ సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ 4ఏ యూజర్లకు మూడు నెలలు పాటు యూట్యూబ్ ప్రీమియం, గూగుల్ వన్ ఫ్రీ ట్రయల్ లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 4ఏ విశేషాలు చూస్తే 6బీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, గూగుల్ అసిస్టెంట్ బటన్ లాంటి ప్రత్యేకతలున్నాయి. వెనుకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పోర్ట్రైట్ మోడ్, నైట్ సైట్, టాప్ షాట్ లాంటి కెమెరా ఫీచర్స్ ఉన్నాయి.
Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు
Flipkart Big Billion Days: ఈ సాంసంగ్ స్మార్ట్ఫోన్లపై రూ.30,000 వరకు డిస్కౌంట్... ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు
ఇక కొత్తగా నెస్ట్ డివైజ్‌లను ప్రకటించింది. నెస్ట్ ఆడియా స్మార్ట్ స్పీకర్ ధర రూ.7,999 కాగా స్పెషల్ లాంఛ్ ప్రైస్‌లో భాగంగా రూ.6,999 ధరకే కొనొచ్చు. నెస్ట్ ఆడియో డివైజ్ చాక్, చార్కోల్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్ స్పీకర్‌ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉపయోగించొచ్చు. ఈ రెండు ప్రొడక్ట్స్‌ని ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అక్టోబర్ 16 నుంచి కొనొచ్చు. పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. నెస్ట్ ఆడియో డివైజ్‌ను రిలయెన్స్ రీటైల్ ఔట్లెట్స్, టాటా క్లిక్‌లో కొనొచ్చు.
గూగుల్ పిక్సెల్ 4ఏ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 5.81 అంగుళాల ఫుల్ హెచ్డీ ఓలెడ్ డిస్ప్లే, 1,080 x 2,340 పిక్సెల్ రెజల్యూషన్
ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ
రియర్ కెమెరా: 12.2మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,140ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: జస్ట్ బ్లాక్
ధర: సుమారు రూ.31,999 (స్పెషల్ లాంఛ్ ప్రైస్ రూ.29,999)