Home /News /technology /

GOOGLE PIXEL 4A 5G TO SAMSUNG GALAXY S51 5G THESE ARE BEST 5 IPHONE 12 ALTERNATIVE MODELS SS GH

iPhone 12: ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న బెస్ట్ ఫోన్లు ఇవే

iPhone 12: ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న బెస్ట్ ఫోన్లు ఇవే
(iphone 12 )

iPhone 12: ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న బెస్ట్ ఫోన్లు ఇవే (iphone 12 )

iPhone 12 | ఐఫోన్ 12 ధర చూసి షాకయ్యారా? అంతకన్నా తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ 5జీ ఫోన్స్ గురించి తెలుసుకోండి.

ఐఫోన్ అంటే నేటి తరం యువతకు ఎంతో క్రేజ్. స్టైలిష్ లుక్‌తో పాటు ఆ మొబైల్ బ్రాండ్ వ్యాల్యూ కోసం ఎంతో మంది ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అందుకే కాస్త ఖరీదైన ఐఫోన్ నుంచి లెటేస్ట్ మోడల్ వస్తుందంటే తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. ఇప్పటికే 12 ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసింది యాపిల్. ఇందులో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 5జీ కనెక్టివిటీ, డ్యూయల్ కెమేరాలు, శక్తిమంతమైన ప్రాసెసర్, ఐఫోన్-11 కంటే తక్కువ బరువు లాంటి ఫీచర్లతో ఫోన్ ప్రియుల మనసును దోచేస్తుంది. అయితే ధర కూడా 699 డాలర్లు(ఐఫోన్ 12 మినీ ప్రారంభ ధర) ఉన్న ఈ మొబైల్ తో పోలిస్తే ఆ ధరకు అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. కరోనా మహ్మమ్మారి ప్రభావంతో ఆర్థిక మాంద్యం తలెత్తుతున్న నేపథ్యంలో ఐఫోన్12 ధర లేదా 700 డాలర్లు(రూ.51,000) కంటే తక్కువ కాస్ట్ లో మార్కెట్లో దొరుగుతున్న అత్యుత్తమ మొబైల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

LG G8X ThinQ: 12 గంటల్లో 1.75 లక్షల యూనిట్స్ సేల్... రూ.70,000 స్మార్ట్‌ఫోన్ రూ.21,990 ధరకే కొనండి ఇలా

Flash Sale: ఫ్లాష్ సేల్‌లో స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే

గూగుల్ పిక్సెల్ 4ఏ 5జీ


5జీ కనెక్టివిటీ కోసం చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారనే సంగతి వాస్తవమే. ముఖ్యంగా పెద్ద నగరాల్లో 5జీ ప్రయత్నించాలని ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ పిక్సెల్ 4ఏ 5జీ బెస్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ధర వచ్చేసి 499 డాలర్లు(రూ.36,587). ఈ నెల ప్రారంభంలో ఈ ఫోన్ ను ఆవిష్కరించి ఆశ్చర్యపరించింది గూగుల్ సంస్థ. 5జీ కనెక్టివిటీ ఉన్న అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానున్న ఫోన్ గూగుల్ పిక్సెల్ 4ఏ 5జీ. అయితే లోవస్ట్ రిజల్యూషన్ డిస్ ప్లే, లెస్ పవర్ ఫుల్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. అంతేకాకుండా వాటర్ ప్రూఫ్ అంశంలో ఇంకా ధ్రువీకరించలేదు. అయితే ఈ మొబైల్ 6.2 అంగుళాల స్క్రీన్, మెరుగైన కెమేరా, 128 జీబీ మెమొరీ సామర్థ్యం, ఆండ్రాయిడ్ ఆపేరిటింద్ సిస్టం, 5జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్లతో అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. నవంబరులో ఈ మొబైల్ లాంచ్ కానుంది.

మొటోరోలా వన్ 5జీ


5జీ కనెక్టివిటీతో పాటు ఈ ఫోన్ లో ఇంకా ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 6.7-అంగుళాల ఫుల్ హెచ్ డీ స్క్రీన్, ఫోర్ రియర్ కెమెరాలు, 128జీబీ స్టోరేజి లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్, లెస్ డిజైరబుల్ యాట్రిబ్యూట్స్ ప్లాస్టిక్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మొబైల్ ప్రారంభ ధర వచ్చేసి 445 డాలర్లు(రూ.32636). ప్రస్తుత మార్కెట్లో ఈ మొబైల్ అందుబాటులో ఉంది.

iPhone: మీ పాత ఫోన్ ఇచ్చేసి రూ.10 వేలకే ఐఫోన్ కొనండి ఇలా

SBI Debit Card: షాపింగ్‌కు డబ్బులు లేవా? రూ.1,00,000 వరకు ఇస్తున్న ఎస్‌బీఐ

శ్యాంసంగ్ గెలాక్సీ ఏ51 5జీ


తక్కువ ఖర్చుతో పాటు అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంది శ్యాంసంగ్ గెలాక్సీ ఏ51 5జీ. గెలాక్సీ ఏ లైనప్ లో ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ 6.5-అంగుళాల డిస్ ప్లే, వెనక వైపు నాలుగు కెమెరాలు, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ రీడర్ తో పాటు పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ లేకపోయినప్పటికీ 499 డాలర్లకు(రూ.36,600) న్యాయం చేసేలా అత్యుత్సుము ఫీచర్లను కలిగి ఉంది.

ఐఫోన్ ఎస్ఈ


బడ్జెట్ ధరకు ఫోన్లు విడుదల చేయాలనే లక్ష్యంతో ఆపిల్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలోనే ఐఫోన్ ఎస్ఈని విడుదల చేసింది. 399 డాలర్లు(రూ.29266)కు ధరతో పాటు 4.7 అంగుళాల డిస్ ప్లే, హోమ్ బటన్ టచ్ ఐడీ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. అయితే లేటెస్ట్ గా వస్తున్న ఐఫోన్లతో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలు ఇందులో లేవు. ఇందులో కేవలం ఒకే ఒక రియర్ కెమేరాను కలిగి ఉంది. మీరు కొంచెం ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఆపిల్ యొక్క ప్రధాన స్మార్ట్‌ఫోన్‌ల యొక్క మునుపటి సంస్కరణను కూడా పొందవచ్చు. ఐఫోన్ 12 లైనప్‌ను ప్రకటించినప్పుడు, ఆపిల్ ఐఫోన్ X, ఐఫోన్ 11 ధరలను తగ్గించింది, ఇది ఇప్పుడు వరుసగా రూ.99499, రూ.99 599 వద్ద ప్రారంభమవుతుంది.

మోటో జీ పవర్..


కాల్స్ చెకింగ్, ఈమెయిల్స్ చూసుకోవడంతో అసౌకర్య సమయాల్లో వాడుకునేందుకు మోటో జీ పవర్ బాగా ఉపకరిస్తుంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒకే ఛార్జ్ లో 16 గంటల రన్ టైమ్ ను కలిగి ఉంటుంది. 6.4-అంగుళాల స్క్రీన్, మూడు రియర్ కెమెరా లెన్సులు లాంటివి ఇందులో ఉన్నాయి. మోటో జీ పవర్ మొబైల్ ప్రారంభ ధర వచ్చేసి 249 డాలర్లు(రూ.18,267)కు అందుబాటులోకి వస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Apple, Google, Iphone, Samsung, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు