మీరు గూగుల్ ఫోటోస్ వాడుతున్నారా? మీరు క్లిక్ చేసే ప్రతీ ఫోటో గూగుల్ ఫోటోస్‌లోకి అప్లోడ్ చేస్తున్నారా? అయితే మీకు త్వరలో షాక్ తప్పదు. గూగుల్ ఫోటోస్‌లోకి అన్లిమిటెడ్ స్టోరేజ్ ఇక ఉండదు. 2021 జూన్ 1 నుంచి అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉండదని గూగుల్ గతంలోనే ప్రకటించింది. అంటే మరో 12 రోజుల్లో గడువు ముగుస్తుంది. 2021 జూన్ 1 నుంచి మీరు అప్లోడ్ చేసే ఫోటోలన్నీ మీకు గూగుల్ ఉచితంగా ఇచ్చే 15జీబీ అకౌంట్లోకి వెళ్తుంది. అయితే ఇప్పటికే మీరు అప్లోడ్ చేసిన ఫోటోలకు ఈ నియమం వర్తించదు. అంటే మే 31 వరకు మీరు ఎన్ని ఫోటోలు అప్లోడ్ చేసినా అన్లిమిడెట్ కోటాలోకే వెళ్తుంది. కానీ ఆ తర్వాత అప్లోడ్ చేసే ఫోటోలు మాత్రం 15జీబీ కోటాలోకి వెళ్తుంది. జూన్ 1 నుంచి మీరు 15 జీబీ వరకే ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ జీమెయిల్, గూగుల్ డ్రైవ్‌లో ఇప్పటికే ఎక్కువ ఫైల్స్ ఉన్నట్టైతే ఎక్కువ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయలేరు.
Realme Narzo 30: రియల్మీ నార్జో 30 రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే
Postinfo: పోస్ట్ ఆఫీస్ సేవల కోసం ఈ యాప్... ఇలా వాడుకోండి
మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది. ఇందుకోసం మీరు గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అదనంగా స్టోరేజ్ లభిస్తుంది. గూగుల్ వన్‌లో మూడు రకాల ప్లాన్స్ ఉన్నాయి. నెలకు రూ.130 లేదా ఏడాదికి రూ.1300 చెల్లిస్తే 100జీబీ స్టోరేజ్ లభిస్తుంది. నెలకు రూ.210 లేదా ఏడాదికి రూ.2100 చెల్లిస్తే 200జీబీ స్టోరేజ్ లభిస్తుంది. నెలకు రూ.650 లేదా ఏడాదికి రూ.6500 చెల్లిస్తే 2టీబీ స్టోరేజ్ లభిస్తుంది. వీటితో పాటు గూగుల్ ఎక్స్‌పర్ట్స్‌తో యాక్సెస్, మీ కుటుంబ సభ్యులను యాడ్ చేసే అవకాశం, ఎక్స్ట్రా మెంబర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 15 స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్
Realme 8 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ.13,999 మాత్రమే
ఇప్పటికే రెండుమూడు అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఫోటోలు, వీడియోలను దాచుకుంటున్నవాళ్లు ఉన్నారు. ప్రతీ అకౌంట్‌పై లిమిట్ 15జీబీ మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. గూగుల్ కొత్త రూల్ 2021 జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది కాబట్టి ఇప్పటికే మీ దగ్గర ఉన్న ఫోటోలు, వీడియోలు అంతలోపు అప్లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google news