గూగుల్ ఫోటోలు(Google Photos) వాడే వారికి శుభవార్త. గూగుల్ ఫోటోస్‌ను సరికొత్త డిజైన్‌తో అప్‌డేట్ చేసింది. ఇది వినియోగదారులకు ఫోటోలను బ్రౌజ్ చేయడం, షేర్ చేయడం, ఇంపోర్ట్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఈ మేరకు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ‘‘గూగుల్ విడుదల చేసిన అప్‌డేట్(Update).. ఆల్బమ్‌లను సోర్టింగ్ చేయడం, ఎక్కడైనా సేవ్ చేసిన ఫోటోలు(Photos) వీడియోలను డౌన్లోడ్(Download) చేసుకోవడం, షేర్ చేసిన కంటెంట్‌ను సులభంగా వెతకడం, స్క్రీన్‌షాట్‌లను సులభంగా కనుగొనడం వంటి ప్రక్రియను సులభతరం చేస్తుంది. గూగుల్ ఫోటోస్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్లన్నింటినీ ఆస్వాదించవచ్చు.’’ అని బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
ఈ కొత్త ఫీచర్లలో మరిన్ని ఆప్షన్లు ఉండే లైబ్రరీ ట్యాబ్ కూడా ఉంటుంది. ఈ లైబ్రరీ ట్యాబ్ వినియోగదారులను తమ ఫోటోలు, ఆల్బమ్‌లను మరింత సులభంగా కనుగొనేలా చేస్తుంది. వినియోగదారుల ప్రాధాన్యతను బట్టి గ్రిడ్ లేదా లిస్ట్‌ను సులభంగా చూసుకోవచ్చు. ఇందుకు గాను లైబ్రరీ ట్యాబ్ అప్డేటెడ్ లేఅవుట్లో కనిపిస్తుంది. కొత్త డిజైన్‌లో ఫోటో రకాన్ని బట్టి సులభంగా ఫోటోలను కనుగొనవచ్చు. ఆల్బమ్‌లు, షేర్డ్ ఆల్బమ్‌లు, ఫేవరెట్‌లు, ఆన్-డివైస్ ఫోల్డర్‌లు వంటి ఆప్షన్ల ద్వారా ఫోటోలను ఫిల్టర్ చేసి సులభంగా మీకు కావాల్సిన వాటిని కనుగొనవచ్చు.
గూగుల్ ఫోటోలను లాక్ చేసేందుకు కూడా ఈ కొత్త అప్‌డేట్ అనుమతిస్తుంది. ఇందుకు గాను యుటిలిటీస్, ఆర్కైవ్, ట్రాష్ ఆప్షన్‌తో కూడిన కొత్త ‘ఇంపోర్ట్ లేటెస్ట్ ఫోటోస్’ సెక్షన్‌ను కూడా జోడిస్తోంది. ఇది వినియోగదారులు ఫోటోలను సులభంగా కాపీ చేయడానికి, ఫోటోలను లేదా వీడియోలను డిజిటలైజ్ చేయడానికి లేదా కెమెరా నుండి ఫోటోలను ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి అనుమతిస్తుంది.
ఈ వారంలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి..
ఆల్బమ్స్ షేరింగ్ కోసం కూడా కొత్త సెక్షన్లను జోడించింది. ఈ సెక్షన్ల ద్వారా మీరు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను కనుగొనడం, వీక్షించడం, నిర్వహించడం చాలా సులభంగా మారుతుంది. ఈ సరికొత్త అప్డేట్లు ఈ వారం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఐఓఎస్ యూజర్లకు త్వరలో అందుబాటులోకి వస్తాయి. మీరు ఫోటోలను బ్యాకప్ చేయనప్పటికీ.. మీ ఇటీవలి స్క్రీన్‌షాట్‌లను సులభంగా కనుగొనేలా కొత్త అప్డేట్ను రూపొందించింది. కాగా, గూగుల్ ఫోటోస్ ఇటీవల తన ఐఓఎస్ యూజర్ల కోసం పోర్ట్రెయిట్ లైట్, బ్లర్, స్మార్ట్ సూచనతో సహా అనేక ఎడిటింగ్ టూల్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.