ప్రముఖ ఫొటో షేరింగ్(Sharing), ఫొటో సర్వీస్ ఫ్లాట్‌ఫామ్ గూగుల్ ఫొటోస్ (Google Photos) కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ మొబైల్ యూజర్లను ఆకర్షిస్తోంది. అయితే ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను (New Features) తీసుకువచ్చినప్పటికీ.. ఇందులో ఒక బేసిక్ ఫీచర్ మాత్రం మిస్ అవుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ ఫీచర్‌ను గూగుల్ అందరికీ పరిచయం చేసింది. గతంలో గూగుల్ ఫొటోస్‌లోని(Google Photos) ఆల్బమ్ (Albums)లలోని ఫొటోలను నేరుగా డిలీట్(Delete) చేయడం కుదరకపోయేది. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో ఆల్బమ్స్‌లోని ఫొటోలు డైరెక్ట్‌గా డిలీట్ చేయడం సాధ్యమవుతుంది. ఈ కొత్త అప్డేట్ ఆండ్రాయిడ్(Android), ఐఓఎస్ వెర్షన్ల గూగుల్ ఫొటోస్ యాప్‌లకు రిలీజ్ అయ్యింది. ఫొటోలను క్లౌడ్ స్టోరేజ్ లో సేవ్ చేసుకునేందుకు చాలామంది యూజర్లు గూగుల్ ఫొటోస్ ఫ్లాట్‌ఫామ్‌నే వాడుతుంటారు. అయితే గూగుల్ ఫొటోస్‌లో ఉన్న మీడియాని డిలీట్ చేయడానికి చాలా శ్రమపడాల్సి వచ్చేది.
నిజానికి ఆల్బమ్ నుంచి నేరుగా ఫొటోలను డిలీట్ చేసే ఫెసిలిటీ గూగుల్ ఫొటోస్ వెబ్ వెర్షన్ (Web Version)లో చాలా ఏళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రావడంతో ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయడం మరింత ఈజీగా మారింది. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్ ప్రైవేట్ ఆల్బమ్ల్లోని ఫొటోలు లేదా వీడియోలు డిలీట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. షేర్డ్ ఆల్బమ్ (Shared Album)ల్లోని మీడియాని డైరెక్ట్‌గా డిలీట్ చేయడం కుదరదు.
గూగుల్ ఫొటోస్ యూజర్లు ‘మూవ్ టు ట్రాష్ (Move To Trash)’ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఆల్బమ్‌లలోని మీడియాను తొలగించవచ్చు. ఈ అప్డేట్కు ముందు, ఆల్బమ్ నుంచి మాత్రమే మీడియాను తీసివేయడం సాధ్యమయ్యేది. సేవ్డ్ మీడియా (Saved Media) నుంచి దాన్ని తొలగించడానికి, మెయిన్ ఫీడ్ లో మీడియాను సెర్చ్ చేసి డిలీట్ చేయాల్సి వచ్చేది. ఈ ప్రాసెస్ చాలా సమయంతో కూడుకున్నది. ఆండ్రాయిడ్‌లో షేర్డ్ ఆల్బమ్‌ల విషయంలో మీడియా డిలీట్ చేసే ప్రాసెస్ ఇప్పటికీ యథాతథంగా ఉంటుంది.
అయితే యాప్ ఐఓఎస్ వెర్షన్ యూజర్లు మాత్రం షేర్డ్ ఆల్బమ్‌లో స్టోర్ చేసిన ఫొటోలను నేరుగా ట్రాష్ (Trash)కి మూవ్ చేయవచ్చు. ఈ ఫెసిలిటీని గూగుల్ తన స్వంత ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌కు ఇవ్వకుండా ఐఓఎస్‌కి మాత్రమే ఇవ్వడం గమనార్హం. టెక్ దిగ్గజం ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఎప్పుడు సమానంగా మారుస్తుందో చూడాలి. మీడియా బ్రౌజ్ చేస్తున్నప్పుడు డేట్/లొకేషన్ చూపించే కొత్త ఇండికేటర్ కూడా గూగుల్ ఇటీవల లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో గూగుల్ ఫొటోస్‌లో టాప్ లెఫ్ట్ కార్నర్లో మీడియాకి సంబంధించిన డేట్, లొకేషన్ మీరు వీక్షించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google photos, New feature