Google Photo Editor: గూగుల్ ఫొటో ఎడిటర్ సరికొత్త అప్డేట్

కొత్త గూగుల్ ఫోటో ఎడిటర్ సరికొత్త లేఅవుట్‌తో కొత్త ఫీచర్లతో కనిపిస్తోంది. స్మార్ట్ సజెషన్స్, ఈజీ టు యూజ్ గ్రాన్యులర్ అడ్జెస్ట్మెంట్స్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. గూగుల్ ఫోటో ఎడిటర్ ఇప్పుడు కారౌసెల్ లేఅవుట్లో కనిపిస్తుంది.

news18-telugu
Updated: October 1, 2020, 9:12 PM IST
Google Photo Editor: గూగుల్ ఫొటో ఎడిటర్ సరికొత్త అప్డేట్
Google Photo Editor: గూగుల్ ఫొటో ఎడిటర్ ఫీచర్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గూగుల్ సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. సెప్టెంబర్ 30న జరిగిన ఆన్‌లైన్ కార్యక్రమంలో పిక్సెల్ 5, పిక్సెల్ 4ఎ 5జి స్మార్ట్ ఫోన్లతో పాటు క్రోమ్కాస్ట్, గూగుల్ నెస్ట్ స్మార్ట్ స్పీకర్ వంటి మరికొన్ని డివైజ్లను విడుదల చేసింది. అదే సమావేశంలో హార్డ్ వేర్‌ తోపాటు కొన్ని సాఫ్ట్ వేర్ అప్ డేట్లను కూడా ప్రకటించింది. వాటిలో గూగుల్ ఫోటోస్ ఎడిటర్ అప్ డేట్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆండ్రాయిడ్ లోని కొత్త గూగుల్ ఫోటో ఎడిటర్ సరికొత్త లేఅవుట్‌తో కొత్త ఫీచర్లతో కనిపిస్తోంది. స్మార్ట్ సజెషన్స్, ఈజీ టు యూజ్ గ్రాన్యులర్ అడ్జెస్ట్మెంట్స్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. గూగుల్ ఫోటో ఎడిటర్ ఇప్పుడు కారౌసెల్ లేఅవుట్లో కనిపిస్తుంది. దాని కింద ఎడిటింగ్ ఆప్షన్లు ఉన్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది

ఫోటోలను ఎడిట్ చేసుకునేందుకు Google AI ని ఉపయోగించే కొత్త సజెషన్స్ ఆప్షన్ ఇచ్చారు. దీని ద్వారా ఫోటో క్వాలిటీని పెంచుకోవచ్చు. వాటిని బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్‌గా మార్చుకోవచ్చు. థర్డ్ కలర్ పాప్ ఆప్షన్ ద్వారా బ్యాక్ గ్రౌండ్‌ను బ్లాక్ అండ్ వైట్ లోకి మార్చుకోవచ్చు. రాబోయే నెలల్లో వీటికి సంబంధించి మరిన్ని అప్ డేట్లు ఇవ్వనున్నట్టు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఫోటో ఎడిటింగ్ కోసం అదనంగా క్రాప్, ఎడ్జెస్ట్, ఫిల్టర్స్, మోర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. క్రాప్, ఫిల్టర్ ఆప్షన్లలో సొంతంగా సెట్టింగ్స్‌ను ఉపయోగించుకోవాలి. ఎడ్జెస్ట్ ఆప్షన్లో వినియోగదారులు ఫోటోకు గ్రాన్యులర్ ఎడ్జెస్ట్మెంట్లను ఎంపిక చేసుకోవచ్చు. కాంట్రాస్ట్, షాడోస్, బ్రైట్‌నెస్ , వార్మ్త్, శాచురేషన్ వంటి ఫోటో ఎడిటింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కొత్త "ఎడ్జెస్ట్మెంట్" ఆప్షన్ ద్వారా సులువుగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఇవి లైట్, కలర్ ఎడ్జెస్ట్మెంట్ ఆప్షన్లలో ఉండేవి.

అప్డేట్ చేసి వాడుకోవచ్చు
పిక్సెల్ 4ఎ 5జీ, పిక్సెల్ 5 ఫోన్లలో కొత్త 'పోర్ట్రెయిట్ లైట్' ఫీచర్‌ను గూగుల్ ఫోటో ఎడిటర్‌కు జత చేసింది. మెషీన్ లెర్నింగ్ ద్వారా ముఖాలపై ఏర్పడే లైటింగ్‌ను 'పోర్ట్రెయిట్ లైట్' ఫీచర్ మెరుగుపరుస్తుంది. గూగుల్ ఫొటోస్ యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్లను ఎంచుకొని ఫొటోలను మెరుగ్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలోని గూగుల్ ఫోటోస్ యాప్‌ను అప్డేట్ చేసుకొని ఈ ఫీచర్లను వాడుకోవచ్చని గూగుల్ ప్రకటించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 1, 2020, 9:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading