గూగుల్ ఫోటోస్ ఇక ఉచితం కాదు... ఈ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్‌లో మీ ఫోటోలు అప్‌లోడ్ చేయొచ్చు

Google Photos Alternative | మీరు గూగుల్ ఫోటోస్‌లో మీ ఫోటోస్ అప్‌లోడ్ చేస్తున్నారా? గూగుల్ ఫోటోస్ బదులు ఈ క్లౌడ్ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు.

news18-telugu
Updated: November 25, 2020, 1:10 PM IST
గూగుల్ ఫోటోస్ ఇక ఉచితం కాదు...  ఈ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్‌లో మీ ఫోటోలు అప్‌లోడ్ చేయొచ్చు
గూగుల్ ఫోటోస్ ఇక ఉచితం కాదు... ఈ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్‌లో మీ ఫోటోలు అప్‌లోడ్ చేయొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గూగుల్ ఫోటోస్ ఉచితంగా అందిస్తున్న స్టోరేజ్ సేవలను 2021 జూన్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు గూగుల్ సంస్థ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మీదట గూగుల్ ఫోటోస్‌లో 15జీబీకి మించి డేటా స్టోర్ చేసుకోవాలంటే నెలవారీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ ప్రకటనతో చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. మీరు కూడా మీ డేటా మొత్తాన్ని మరో స్టోరేజ్ స్పేస్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ ప్రత్యామ్నాయ క్లౌడ్ స్టోరేజ్ సేవల గురించి తెలుసుకోండి.

గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలా?గూగుల్ ప్రకటించిన దాని ప్రకారం 15జీబీ స్టోరేజ్ వరకు మీరు ఎటువంటి చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల, కేవలం 15జీబీ స్టోరేజీ పరిమితిని మించి ఉంటే మాత్రమే గూగుల్ వన్ సభ్యత్వాన్ని కొనుగోలు చేయండి. ఇతర క్లౌడ్ స్టోరేజ్ సర్వీసులతో పోలిస్తే గూగుల్ తక్కువ ధరలకే మెరుగైన సేవలను అందిస్తుంది. అంతేకాక, గూగుల్ ఫోటోస్లో అట్రాక్టివ్ ఫీచర్లు ఉంటాయి. కీవర్డ్, లొకేషన్ లేదా పేరు ద్వారా సులభంగా ఫోటోలను వెతకడం, ఆటోమేటిక్ ఫోటో బ్యాకప్ వంటి ఫీచర్లను అందిస్తుంది. కాబట్టి, ఈ సేవలను పొందడానికి గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం మంచి ఎంపిక.

రోజూ 3జీబీ డేటా ఇచ్చే Jio, Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే...

Poco M3: భారీ బ్యాటరీ, ట్రిపుల్ AI కెమెరాలతో రిలీజైన పోకో ఎం3

గూగుల్ ఫోటోలకు ప్రత్యామ్నాయాలు


మెగా

MEGA అనేది క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ ప్రొవైడర్. దీన్ని మీ ఫోటోలు లేదా వీడియోలను స్టోర్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది 50జీబీ వరకు ఫ్రీ స్టోరేజ్‌కు అనుమతిస్తుంది. కానీ ఈ ఉచిత సర్వీసు కేవలం 30 రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 30 రోజుల తర్వాత మీకు 15జీబీ క్లౌడ్ స్టోరేజ్ మాత్రమే లభిస్తుంది. మీ బ్యాంక్ కార్డు వివరాలను నమోదు చేయకుండా కూడా మీరు దీనిలో లాగిన్ అవ్వొచ్చు. అలాగే, ఈ సైట్‌లో స్టోర్ అయ్యే మీ ఫైల్‌లు, చాట్‌లు చాలా భద్రంగా ఉంటాయి. దీనిలో రిఫరల్ బెనిఫిట్ కూడా ఉంది. ఒకవేళ మీ ద్వారా సిఫార్సు చేయబడిన మీ స్నేహితుడు దీనిలో సైన్ ఇన్ అయినచో మీరు ఏడాది కాలానికి గాను అదనపు ఫ్రీ స్టోరేజ్‌ను పొందుతారు. ఈ ప్లాట్‌ఫాం మీకు ఆడియో/వీడియో కాల్‌లను స్టోరేజ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. దీనిలో వచ్చే బేస్ ప్లాన్ నెలకు రూ. 437ల నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్ మీకు 400GB స్టోరేజ్ స్పేస్ను ఇస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీరు గరిష్టంగా 1GB డేటాను అప్‌లోడ్ చేయవచ్చు.

అమెజాన్ ఫోటోస్

మీరు అమెజాన్ ప్రైమ్ సభ్యులైతే మీ ఫోటోలు, వీడియోల స్టోరేజ్కు అమెజాన్ ఫోటోస్ మంచి ప్రత్యామ్నాయం. ఈ–-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రైమ్ మెంబర్స్కు ఉచిత, అపరిమిత, పూర్తి -రిజల్యూషన్ ఫోటో స్టోరేజ్ సౌకర్యంతో పాటు 5GB వీడియో స్టోరేజ్ను కూడా అందిస్తుంది. ఇది కూడా గూగుల్ ఫోటోల మాదిరిగానే సేవలను అందిస్తుంది. మీ ఫోటోలను వర్చువల్ ఫోటో ఆల్బమ్ ఫైర్ టివి, ఎకో షో, ఫైర్ టాబ్లెట్లుగా చూడటానికి మీకు దీనిలో అవకాశం ఉంటుంది. మీ మొత్తం డేటాను ఆటోమేటిక్గా సమీకరిస్తుంది. తద్వారా మీరు వాటిని ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు. కుటుంబంతో ఫోటోలను పంచుకోవడానికి దీనిలో ఫ్యామిలీ వాల్ట్ ఆప్షన్ కూడా ఉంది. 100GB స్టోరేజ్ కోసం, మీరు నెలకు 1.99 యూఎస్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.148) చెల్లించాల్సి ఉంటుంది. ఇది గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ కంటే చాలా తక్కువ.

Mobile Apps: వెంటనే ఈ 5 యాప్స్ మీ ఫోన్ నుంచి డిలిట్ చేయండి

WhatsApp OTP scam: అలర్ట్... వాట్సప్‌లో ఓటీపీ స్కామ్ కలకలం... తప్పించుకోండి ఇలా

డెగూ

దీనిలో మీరు 100GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ను పొందవచ్చు. అందువల్ల, ఇది గూగుల్ ఫోటోలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. దీనిలో స్టోర్ చేసే అన్ని ఫైళ్లు ఎండ్- టు- ఎండ్ ఎన్క్రిప్టెడ్తో భద్రంగా ఉంటాయి. మీ రిఫెరల్తో మీ స్నేహితులు సైన్ అప్ చేస్తే మీరు 500GB వరకు ఎక్కువ ఉచిత స్టోరేజ్ స్పేస్ను సంపాదించవచ్చు. అంతేకాక, దీనిలో ఆటోమేటిక్ బ్యాకప్ ఆప్షన్ కూడా ఉంది. 500GB ప్లాన్ కోసం నెలకు 2.99 యూఎస్ డాలర్లు, 10TB ప్లాన్ కోసం నెలకు 9.99 యూఎస్ డాలర్లు చెల్లించాలి.

డ్రాప్‌బాక్స్

క్లౌడ్ స్టోరేజ్ సేవలను పొందడానికి డ్రాప్‌బాక్స్ బెస్ట్ ఆప్షన్. దీనిలో 2TB స్టోరేజ్ స్పేస్ కోసం మీరు నెలకు 9.99 యూఎస్ డాలర్లు (సుమారుగా రూ. 740) చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు ఒక సంవత్సరానికి 119.88 యూఎస్ డాలర్లు (సుమారు రూ .8,870) ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే, గూగుల్ విషయానికి వస్తే ఇది 2 టిబి స్టోరేజ్ స్పేస్ కోసం నెలకు రూ .650, ఏటా రూ .6,500 వసూలు చేస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: November 25, 2020, 12:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading