Google Tips: ఆన్‌లైన్‌ మోసాలను ఈ 8 టిప్స్‌తో అడ్డుకోండి

Google online safety tips | స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్, బ్యాంకింగ్ యాప్స్ లాంటివి ఉపయోగించేవారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇందుకోసం పాటించాల్సిన ఆన్‌లైన్ సేఫ్టీ టిప్స్ ఏంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: February 18, 2020, 11:45 AM IST
Google Tips: ఆన్‌లైన్‌ మోసాలను ఈ 8 టిప్స్‌తో అడ్డుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువగా లావాదేవీలు జరుపుతుంటారా? ఇలా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేప్పుడు మోసపోతామని ఎప్పుడైనా భయపడ్డారా? ఆన్‌లైన్ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. చాలా సులువుగా జరిగిపోతుంటాయి. ఎంతో అప్రమత్తంగా ఉంటే తప్ప ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్టవేయలేం. ఆన్‌లైన్‌లో వస్తువులు, ప్రయాణం కోసం క్యాబ్, రైలు టికెట్లు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం లాంటివన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నవే. అందుకే ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి రెడీగా ఉంటారు. మీరు ఆన్‌లైన్‌లో సేఫ్‌గా ఉండటానికి గూగుల్ 8 టిప్స్ చెబుతోంది. అవేంటో తెలుసుకొని పాటించండి.

1. మీ ఇమెయిల్ ఐడీకి రికవరీ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీ తప్పనిసరిగా ఉండాలి. అవి మారితే వివరాలు అప్‌డేట్ చేయాలి. మీ ఇమెయిల్‌ని ఎవరైనా యాక్సెస్ చేస్తే మీ రికవరీ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్‌కు అలర్ట్ వస్తుంది.

2. పాస్‌వర్డ్ మేనేజర్ ఉపయోగించండి. పాస్‌వర్డ్ మేనేజర్‌తో మీరు స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ క్రియేట్ చేయడంతో పాటు వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ లెక్కల ప్రకారం ఓ వ్యక్తి సగటున 120 పైగా పాస్‌వర్డ్స్ ఉపయోగిస్తారట. మీరు పాస్‌వర్డ్ మేనేజర్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

3. మీ ఓఎస్, యాప్స్, బ్రౌజర్ లాంటివి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. లేకపోతే వైరస్ ఎటాక్స్ తప్పవు.

4. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తప్పనిసరి. దీని ద్వారా మీకు అదనంగా సెక్యూరిటీ లభిస్తుంది. మీరు లాగిన్ చేయాలంటే పాస్‌వర్డ్‌తో పాటు యూనిక్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

5. మీ పాస్‌వర్డ్స్‌ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లాయన్న అనుమానం ఉంటే గూగుల్ సెక్యూరిటీ చెకప్ చేయొచ్చు. దీని ద్వారా రిపీట్ పాస్‌వర్డ్స్, సెక్యూరిటీ లోపాలు తెలుసుకోవచ్చు.

6. మీకు అవసరం లేని యాప్స్, బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్ తొలగించాలి. మీకు తెలియని యాప్స్ డౌన్‌లోడ్ చేయొద్దు. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించొద్దు.7. పాస్‌వర్డ్ అలర్ట్ ఉపయోగించండి. మీ గూగుల్ పాస్‌వర్డ్‌ని నాన్ గూగుల్ సైట్స్‌లో లాగిన్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు మీకు అలర్ట్స్ వస్తాయి.

8. గూగుల్ అకౌంట్‌లో సెక్యూరిటీలోకి వెళ్లి మేనేజ్ డివైజెస్ సెక్షన్‌లో మీరు ఉపయోగించని డివైజ్‌ల నుంచి లాగౌట్ కావాలి. లేకపోతే ఆ డివైజ్ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్తే మీ అకౌంట్‌ని యాక్సెస్ చేసే ప్రమాదముంది.

ఇవి కూడా చదవండి:

Online Gold: ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి

Save Money: జీతం మిగలట్లేదా? ఈ మనీ సేవింగ్ టిప్స్ ట్రై చేయండి

PAN Card: త్వరలో 17 కోట్ల పాన్ కార్డులు చెల్లవు... మీ కార్డు చెక్ చేయండిలా
Published by: Santhosh Kumar S
First published: February 18, 2020, 11:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading