సెర్చ్ ఇంజిన్ దిగ్గజం అయిన గూగుల్... తమ యూజర్లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. గూగుల్ నెస్ట్ మినీ స్పీకర్ ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్పీకర్ విలువ అమెరికాలో 49 డాలర్లు. ఇండియాలో రూ.3.999. ఇంత విలువైన స్పీకర్‌ను ఫ్రీగా ఇస్తామని గూగుల్ ప్రకటించింది. అయితే ఈ అవకాశం గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే. గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసినవారందరికీ ఉచిత సేవలు పరిమితంగా లభిస్తాయి. ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునేవారికి గూగుల్ వన్ పేరుతో పెయిడ్ సర్వీస్ అందిస్తోంది గూగుల్. స్టోరేజ్ కోసం యూజర్లు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారు తమ ప్లాన్ అప్‌గ్రేడ్ చేస్తే ఉచితంగా గూగుల్ నెస్ట్ మినీ లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ప్లాన్ నుంచి 2టీబీ స్టోరేజ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అయినవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. డిసెంబర్ 9 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
PUBG vs FAU-G: ప్రీ-రిజిస్ట్రేషన్స్‌లో పబ్‌జీ మొబైల్ ఇండియాదే పైచేయి... ఈ లెక్కలు చూడండి
WhatsApp Feature: మెసేజెస్‌తో వాట్సప్ ఫుల్ అవుతోందా? ఈ సెట్టింగ్స్ మార్చండి
ఈ ఆఫర్ ఇండియా ఇండియాలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం అమెరికాలోని యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందిస్తోంది గూగుల్. ప్రస్తుతం ఉన్న గూగుల్ వన్ ప్లాన్ అప్‌గ్రేడ్ చేసుకున్న యూజర్లకు కూపన్ లభిస్తుంది. ఆ కూపన్ నెస్ట్ మినీ స్పీకర్‌కు రీడీమ్ చేసుకోవచ్చు. ఎలా రీడీమ్ చేసుకోవాలో వివరిస్తూ యూజర్లకు మెయిల్స్ పంపిస్తోంది గూగుల్. ఇటీవల గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌లో అనేక మార్పులు వచ్చాయి. అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్‌ను నిలిపివేస్తున్నట్టు గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టోరేజ్ ఫుల్ అయినవాళ్లు మరింత స్టోరేజ్ కోసం గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.
Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
Dual Selfie Camera Phones: సెల్ఫీ కోసం రెండు కెమెరాలు ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
ఇండియాలో గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్స్ వివరాలు చూస్తే ప్రతీ అకౌంట్‌కు 15జీబీ స్టోరేజ్ ఉచితంగా ఇస్తోంది గూగుల్. 100జీబీ స్టోరేజ్ కోసం నెలకు రూ.130, ఏడాదికి రూ.1,300 చెల్లించాలి. ఇక 200జీబీ స్టోరేజ్ కోసం నెలకు రూ.210, ఏడాదికి రూ.2,100 చెల్లించాలి. 2టీబీ స్టోరేజ్ కావాలంటే నెలకు రూ.650, ఏడాదికి రూ.6,500 చెల్లించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google Assistant, Google Drive