ప్రపంచమంతా ఈ రోజు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. అయితే గతంతో పోలిస్తే ఈ కొత్త ఏడాది చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. 2020లో మానవాళిని ముప్పుతిప్పలు పెట్టి ప్రశాంతత లేకుండా చేసిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తో ఈ ఏడాది చెక్ పడుతుందని అంతా భావిస్తున్నారు. ఈ కొత్త ఏడాదిలో మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలని అంతా కోరుకుంటున్నారు. అయితే ప్రతీ సారి హోరెత్తే న్యూ ఇయర్ వేడుకల కోలాహలం ఈ సారి కరోనా ఆంక్షల నేపథ్యంలో కరువైంది. దీంతో అంతా ఫోన్ కాల్స్, వాట్సాప్, ఇతర మెసేంజర్, సోషల్ మీడియా ఖాతాల ద్వారానే విషెస్ చెప్పుకున్నారు. ప్రముఖులు, సెలబ్రెటీలు తమ అభిమానులకు వివిధ మాద్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మెసేజ్ లతో ఫోన్లు హోరెత్తుతున్నాయి.
అయితే దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ సైతం నెటిజన్లకు వినూత్నంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపింది. ప్రత్యేకంగా రూపొందించిన డూడుల్ సహాయంతో విషెస్ చెప్పి నెటిజన్లను సర్ ప్రైజ్ చేస్తోంది గూగుల్. ‘New Year's Day 2021’ పేరుతో రూపొందించిన ఈ ఆకట్టుకునే డూడుల్ పై క్లిక్ చేస్తే రంగు రంగు కాగితాలు ఎగురుతున్నట్లుగా కనిపించి మనకు థ్రిల్ కలిగిస్తాయి.
డూడుల్ పై క్లిక్ చేయగానే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన లైవ్ లింక్ లు, వార్తలు మనకు కనిపిస్తాయి. మీరు కూడా ఈ అద్భుత అనుభూతిని పొందాలంటే
ఇక్కడ క్లిక్ చేయండి. తద్వార గూగుల్ నుంచి న్యూ ఇయర్ విషెస్ పొంది ఆనందించండి.
Published by:Nikhil Kumar S
First published:January 01, 2021, 16:52 IST