హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Pixel: గూగుల్ కొత్త అవకాశం.. ఫోన్ రిపేర్ వస్తే వినియోగదారులే సమస్యను పరిష్కరించుకోవచ్చు.. ఎలా అంటే..

Google Pixel: గూగుల్ కొత్త అవకాశం.. ఫోన్ రిపేర్ వస్తే వినియోగదారులే సమస్యను పరిష్కరించుకోవచ్చు.. ఎలా అంటే..

ప్రతీకాాత్మక చిత్రం

ప్రతీకాాత్మక చిత్రం

శామ్‌సంగ్ (Samsung) తరహాలో వినియోగదారులకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టెక్ దిగ్గజం గూగుల్‌ (Google). వినియోగదారులే తమ ఫోన్లను(Phones) రిపేరు చేసుకొనే అవకాశాన్ని గూగుల్‌ కల్పిస్తోంది.

శామ్‌సంగ్ (Samsung) తరహాలో వినియోగదారులకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టెక్ దిగ్గజం గూగుల్‌ (Google). వినియోగదారులే తమ ఫోన్లను(Phones) రిపేరు చేసుకొనే అవకాశాన్ని గూగుల్‌ కల్పిస్తోంది. చెడిపోయిన విడి భాగాలను రీప్లేస్‌ చేసుకొనే సదుపాయంతోపాటు, అవసరమైన కిట్‌ను కూడా అందిస్తుంది. గూగుల్‌ పిక్సెల్‌ 2 నుంచి పిక్సెల్‌ 6 ప్రో వరకు స్మార్ట్‌ఫోన్లకు ఈ సదుపాయం అందుతుంది. Google Pixel స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఇప్పుడు తమ అతిపెద్ద సమస్యను స్వయంగా పరిష్కరించుకోవచ్చు. Google దాని వినియోగదారులకు, ముఖ్యంగా Google Pixel స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారికి సెల్ఫ్ రిపేర్ ఆప్షన్‌ ఎంచుకొనే అవకాశం కల్పిస్తుంది.

ఈ సేవలు అందిస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇదే. కాబట్టి మీ వద్ద ఏదైనా Pixel ఫోన్‌ ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పాత Pixel 2 నుంచి మొదలు తాజా Pixel 6 Pro వరకు ఈ సదుపాయాన్ని గూగుల్‌ కల్పిస్తోంది. ఫోన్‌లో పాడైపోయిన భాగాలను కంపెనీకి షిప్ చేసి.. మీరే రిపేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

వినియోగదారులు బ్యాటరీ(Battery), కెమెరా(Camera), స్క్రీన్ రీప్లేస్‌మెంట్(Screen Replacement) వంటి స్మార్ట్‌ఫోన్ భాగాలను పోస్టల్ చిరునామాకు పంపవచ్చని Google చెబుతోంది. మీరు Pixel స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయగల US, UK, కెనడా, ఆస్ట్రేలియా, కొన్ని EU దేశాలలో ప్రోగ్రామ్ ప్రారంభమైంది. Google మీకు విడిభాగాలను తీసుకునే ఎంపికను అందిస్తోంది. స్క్రూడ్రైవర్, నట్స్, స్పడ్జర్‌లను కలిగి ఉన్న రిపేర్ కిట్‌ అందజేస్తోంది.

Xiaomi 12 Pro: త్వరలో భారత్‌లో రిలీజ్ కానున్న షియోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలివే..


గూగుల్ తన స్వీయ మరమ్మత్తు ప్రోగ్రామ్‌ను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తుంది. కంపెనీ ఇతర భాగస్వాముల ద్వారా రిపేర్ కిట్‌ల లభ్యతను విస్తరించబోతోంది. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను సరిచేయడానికి వారికి అవసరమైన శిక్షణ, సాధనాలను అందించబోతోంది. కంపెనీ మొదటి సెట్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను అలాగే వినియోగదారుల కోసం పిక్సెల్ 4ఏ మోడల్‌ను విక్రయించిన భారతదేశం వంటి దేశాలకు గూగుల్ ఈ సేవను తీసుకువస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ విడిభాగాలను రవాణా చేయడానికి అయ్యే ఖర్చు వివరాలపై Google స్పష్టత ఇవ్వలేదు.

Samsung తన వినియోగదారుల కోసం ఇదే విధమైన అవకాశాన్ని ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత Google నుంచి ప్రకటన వెలువడింది. దక్షిణ కొరియా దిగ్గజం iFixit భాగస్వామ్యంతో బ్యాటరీ, డిస్‌ప్లే(Display), ఇతర భాగాలను యజమానులకు అందించడం, వాటిని రవాణా చేయడం, దెబ్బతిన్న భాగాలకు కొత్తవి పొందే అవకాశం ఉంది. గూగుల్, శాంసంగ్ రెండూ ప్రతి ఇంటిలో సేకరిస్తున్న ఇ-వ్యర్థాల మొత్తాన్ని నియంత్రించడానికి ఒక చర్యగా ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. కంపెనీలు తమ ఉత్పత్తి ప్యాకేజింగ్, ఛార్జింగ్ అడాప్టర్లు, కేబుల్‌లను తొలగించడం ప్రారంభించాయి. ఇది యాపిల్ గత సంవత్సరం మార్కెట్‌లో ఓ ట్రెండ్‌గా ప్రారంభించింది.

First published:

Tags: Features, New features, New smart phone

ఉత్తమ కథలు