హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smart Speakers: మంచి స్మార్ట్ స్పీకర్ కోసం చూస్తున్నారా? బడ్జెట్ ధరలో బెస్ట్ మోడల్స్ ఇవే

Smart Speakers: మంచి స్మార్ట్ స్పీకర్ కోసం చూస్తున్నారా? బడ్జెట్ ధరలో బెస్ట్ మోడల్స్ ఇవే

Smart Speakers: మంచి స్మార్ట్ స్పీకర్ కోసం చూస్తున్నారా? బడ్జెట్ ధరలో బెస్ట్ మోడల్స్ ఇవే

Smart Speakers: మంచి స్మార్ట్ స్పీకర్ కోసం చూస్తున్నారా? బడ్జెట్ ధరలో బెస్ట్ మోడల్స్ ఇవే

Smart Speakers | మీరు స్మార్ట్ స్పీకర్ కొనాలని అనుకుంటున్నారా? గూగుల్, షావోమీ, ఫ్లిప్‌కార్ట్, లెనోవో, అమెజాన్ లాంటి సంస్థలు రూ.5,000 లోపు స్మార్ట్ స్పీకర్స్ (Smart Speakers under Rs 5000) అందిస్తున్నాయి. వీటిలో ఏది బెస్ట్ తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

కరోనా తర్వాత స్మార్ట్​ ఉత్పత్తులకు విపరీతమైన క్రేజ్​ ఏర్పడింది. ముఖ్యంగా, కరోనా భయంతో ఇంట్లోనే ఎంటర్​టైన్​మెంట్​ వెతుక్కుంటున్నారు. దీంతో, ఇంటర్నెట్-ఆఫ్-థింగ్స్ (IoT) టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ స్పీకర్లకు విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది. అందుకే గూగుల్, అమెజాన్​, లెనెవో వంటి సంస్థలు బడ్జెట్​ ధరలోనే స్మార్ట్​ స్పీకర్లను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం, భారత మార్కెట్​లో రూ. 5,000లోపు లభిస్తున్న ఉత్తమ స్మార్ట్ స్పీకర్లను పరిశీలిద్దాం.

అమెజాన్ ఎకో డాట్ (4వ జనరేషన్​)


అమెజాన్ ఎకో డాట్ స్మార్ట్ స్పీకర్లు కేవలం రూ. 3,999 ధర వద్ద లభిస్తున్నాయి. ఈ ఎకో డాట్​ ఉత్పత్తి అమెజాన్​లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ స్పీకర్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్‌గా మద్దతిస్తుంది. స్టీరియో సౌండ్ ఎక్స్​పీరియన్స్​ కోసం ఇతర స్పీకర్లు/హెడ్‌ఫోన్లకు దీన్ని కనెక్ట్ చేయవచ్చు.

Flipkart Black Friday Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్... ఈ 10 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు

గూగుల్ నెస్ట్ మినీ


గూగుల్ నెస్ట్ మినీ అనేది గూగుల్ నుంచి విడుదలైన స్మాల్​ స్మార్ట్ స్పీకర్. ఇది భారత మార్కెట్​లో రూ. 3,499 వద్ద లభిస్తోంది. గూగుల్​ నెక్ట్స్​ మినీ ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ స్పీకర్ గూగుల్​ అసిస్టెంట్‌తో వస్తుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఎంఐ స్మార్ట్ స్పీకర్


ఎంఐ స్మార్ట్ స్పీకర్ రూ. 3,999 ధర వద్ద లభిస్తుంది. దీన్ని అమెజాన్​, షియోమి అధికారిక వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ స్పీకర్ గూగుల్​ అసిస్టెంట్‌ సపోర్ట్​తో వస్తుంది. దీనిలోని 63.5 ఎంఎం సౌండ్ డ్రైవర్ 12W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.

Nothing Ear 1 TWS: గుడ్ న్యూస్... నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్ ధర తగ్గింది... ఆఫర్ కొద్ది రోజులే

లెనోవో స్మార్ట్ క్లాక్


లెనోవో స్మార్ట్​ క్లాక్​ రూ. 2,999 ధర వద్ద లభిస్తుంది. ఫ్లిప్​కార్ట్​ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ స్పీకర్ 4- అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, 2x పాసివ్ రేడియేటర్లతో కూడిన 3W స్పీకర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ స్పీకర్ మీడియాటెక్​ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0ను అందించింది.

మార్క్యూ స్మార్ట్ హోమ్ స్పీకర్


మార్క్యూ స్మార్ట్ హోమ్ స్పీకర్​ను ఫ్లిప్‌కార్ట్​లో ఆఫర్​పై కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్​ స్పీకర్​ను కేవలం రూ. 3,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది గూగుల్​ అసిస్టెంట్‌కు మద్దతు ఇస్తుంది. మీడియాటెక్​ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

Airtel Tariff Hike: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... నేటి నుంచి పెరగనున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు

అమెజాన్ ఎకో ఇన్‌పుట్


అమెజాన్ ఎకో ఇన్‌పుట్ కంపెనీ పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్​ను కేవలం రూ.3,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ స్పీకర్ ఫాబ్రిక్ డిజైన్‌తో వస్తుంది. ఇది 360-డిగ్రీ సౌండ్‌ను అందిస్తుంది. ఈ ఎకో స్మార్ట్ స్పీకర్​ను ఒక్కసారి ఫుల్​ ఛార్జ్ చేస్తే 10 గంటల వరకు పనిచేస్తుంది.

అమెజాన్ ఎకో డాట్ (3వ జనరేషన్​)


రూ. 5 వేలలోపు బెస్ట్​ స్మార్ట్ స్పీకర్​ను కొనాలనుకునే వారికి అమెజాన్ ఎకో డాట్ (3వ జనరేషన్​) బెస్ట్ ఛాయిస్​. అమెజాన్​లో ఇది కేవలం రూ. 2,999 వద్ద లభిస్తుంది. మరోవైపు, ఫిలిప్స్ స్మార్ట్ బల్బుతో కూడిన ఈ స్మార్ట్ స్పీకర్​ను రూ.3,099 వద్ద కొనుగోలు చేయవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon, AMAZON INDIA, Flipkart, Google, Xiaomi

ఉత్తమ కథలు