GOOGLE MESSAGES BATTERY DRAIN PROBLEMS WITH GOOGLE MESSAGES APP SEE HOW TO FIX EASY GH VB
Google Messages: ఈ యాప్ తో బ్యాటరీ డ్రైన్ సమస్యలు.. సమస్యకు పరిష్కారం ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ గూగుల్ మెసేజెస్ (Google Messages) ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. అయితే ఈ యాప్‌లోని ఒక కొత్త బగ్ (Bug) కారణంగా ప్రస్తుతం యూజర్లు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు.
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ గూగుల్ మెసేజెస్ (Google Messages) ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. యూజర్లు హైక్వాలిటీ ఫొటోలతో సహా వీడియోలు ఈజీగా షేర్ చేసుకునేందుకు ఇది బెస్ట్ యాప్‌గా నిలుస్తుంది. వాట్సాప్ లాంటి అప్లికేషన్లకు ఇది చక్కటి ఆల్టర్నేటివ్గానూ నిలుస్తోంది. అయితే ఈ యాప్‌లోని ఒక కొత్త బగ్ (Bug) కారణంగా ప్రస్తుతం యూజర్లు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంకేతిక సమస్య (Bug) ఫోన్ కెమెరాను బ్యాక్‌గ్రౌండ్‌లో ఆన్ చేసి, బ్యాటరీ ఛార్జింగ్ (Battery Charging) త్వరగా దిగిపోయేలా చేస్తోంది. గూగుల్ (Google) ఇప్పటికే ఈ సమస్యను గుర్తించింది. త్వరలోనే ఈ సమస్యను ఫిక్స్ చేసి ఒక అప్డేట్ రిలీజ్ చేయనుంది. ఆ సమయంలోగా గూగుల్ మెసేజెస్ యూజర్లు ఒక సెట్టింగ్ మార్చి తమ ఫోన్ కెమెరా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆన్ కాకుండా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ మెసేజెస్ యాప్‌లో ఫొటో త్వరగా తీసి.. వెంటనే దాన్ని మెసేజ్‌కు అటాచ్ చేసి ఫ్రెండ్స్‌కు సులభంగా పంపవచ్చు. ఇందులో గ్యాలరీ నుంచి ఇమేజెస్ అటాచ్ చేయవచ్చు. అంతేకాదు, అటాచ్ వ్యూలో థంబ్‌నెయిల్ వ్యూ నుంచి ఇన్స్టంట్ స్నాప్‌షాట్ లేదా ఫొటో తీసుకోవచ్చు. ఈ అటాచ్ వ్యూలో థంబ్‌నెయిల్ సైజులో కెమెరా నుంచి లైవ్ ఫీడ్ ని గూగుల్ మెసేజెస్ అందిస్తుంది.
లేదా మీరు మెరుగైన వ్యూ కోసం దాన్ని విస్తరించవచ్చు. అయితే గూగుల్ మెసేజెస్ యాప్ రీసెంట్ అప్డేట్లలో ఒక బగ్ ఈ కెమెరాని ఎల్లప్పుడూ ఆన్ చేస్తూనే ఉంది. ఈ టెక్నికల్ సమస్య వల్ల వ్యూ కెమెరా ఫీడ్ స్క్రీన్‌పై లేకపోయినా, అలాగే గూగుల్ మెసేజెస్ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నా కూడా కెమెరా రన్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. బ్యాటరీ త్వరగా అయిపోవడమే కాదు ఫోన్ కూడా విపరీతంగా హీట్ ఎక్కుతోంది.
ఈ సమస్యకు ఇలా చెక్ పెట్టండి
గూగుల్ మెసేజెస్ యాప్ కారణంగా మీ ఫోన్ బ్యాటరీ ఎంప్టీ అయిపోతుంటే.. రీసెంట్ వ్యూ (Recent View) లిస్టులో ఈ యాప్‌ను క్లోజ్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల యాప్ యాక్టివిటీ ఆగిపోతుంది. అప్పుడు గూగుల్ మెసేజెస్ వల్ల ఆన్ అయిన కెమెరా కూడా ఆఫ్ అవుతుంది. లేదంటే మీరు గూగుల్ మెసేజెస్ వ్యూఫైండర్ని యూజ్ చేసి.. ఆ యాప్ మీ ఫోన్ కెమెరాను యూజ్ చేయకుండా కెమెరా పర్మిషన్ ఆఫ్ చేయొచ్చు.
ఏదైనా ఆండ్రాయిడ్ లేదా పిక్సెల్ ఫోన్లో ఇలా చేయడానికి, మీ యాప్ లాంచర్లోని గూగుల్ మెసేజెస్ యాప్ ఐకాన్ నొక్కి పట్టుకుని, ఇన్ఫో ఐకాన్ పై నొక్కండి. ఇది మిమ్మల్ని సెట్టింగ్స్ యాప్‌కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు గూగుల్ మెసేజెస్ యాప్‌కు ఇచ్చిన పర్మిషన్ మేనేజ్ చేయడానికి “పర్మిషన్స్ (Permissions)” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు "కెమెరా(Camera)" టోగుల్ను "ఆఫ్" చేస్తే చాలు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.