ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్(Messaging App) గూగుల్ మెసేజెస్ (Google Messages) ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో డిఫాల్ట్ మెసేజింగ్ (SMS) యాప్‌గా కూడా వస్తుంది. యూజర్లకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఇందులో రిచ్ కమ్యూనికేషన్(Communication) సర్వీసెస్ (RCS) కూడా గూగుల్(Google) ప్రవేశపెట్టింది. అయితే ఇదే ఇప్పుడు యూజర్లకు పెద్ద సమస్యగా మారింది. కొన్ని కంపెనీలు ఆర్సీఎస్ సర్వీసెస్ ఉపయోగించి పర్సనల్ లోన్స్ తీసుకోవాలని, లైఫ్ ఇన్సూరెన్స్(Life Insurance) పాలసీలు(Policy) కొనుగోలు చేయాలంటూ రోజూ చాలా మెసేజ్‌లను యూజర్లకు పంపిస్తున్నాయి. తెగ విసిగిస్తున్న ఈ మెసేజ్‌లను యూజర్లు భరించలేకపోతున్నారు. గత కొన్ని వారాలుగా ఈ యాడ్ మెసేజెస్ ఎక్కువైపోయాయి. దీంతో యూజర్లు గూగుల్‌కి ఫిర్యాదు చేస్తున్నారు. మీరు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ విసిగించే యాడ్స్‌ను ఎలా ఆపాలో ఇప్పుడు చూద్దాం.
గూగుల్ మెసేజెస్ వాడుతున్న ఇండియన్ యూజర్లను వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్లు డైలీ స్పామ్ మెసేజెస్‌తో ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి ఇండియన్ వంటి మార్కెట్లలో ఈ ప్లాట్‌ఫామ్ ప్రకటనలకు వేదికగా మారినట్లు కనిపిస్తోంది. ఈ ప్రకటనల్లో ఎక్కువ భాగం బ్యాంకులు లేదా ఫైనాన్సింగ్ సంస్థల నుంచి ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ గురించి ఉంటాయి. ఎమోజీలు, ఫొటోలు, ఇతర మల్టీమీడియా ఐటెమ్‌లను జతచేసి ఆకర్షణీయమైన రూపంలో ఎస్ఎంఎస్ పంపడానికి ఆర్సీఎస్(RCS) టెక్నాలజీ కంపెనీలకు హెల్ప్ అవుతోంది.
యాడ్స్, యాడ్ ఎస్ఎంఎస్లు ఎప్పుడూ గూగుల్ ప్లాన్‌లో భాగం కావు. కానీ యాప్‌కు వస్తున్న యాడ్స్ యూజర్లకు బాగా చిరాకు పుట్టిస్తున్నాయి. సాధారణంగా, ఈ ప్రకటనలు ఎలాంటి ప్రమాదాన్ని కలిగించవు. కానీ యూజర్లు అనుకోకుండా లింక్‌లపై క్లిక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లింక్‌లపై క్లిక్ చేయడం ఎప్పటికైనా ప్రమాదకరమే. నివేదికల ప్రకారం, ఫోన్లో సిమ్ ఇన్స్టాల్ చేయకపోయినా ఈ ప్రకటనలు వస్తున్నాయి. న్యూస్18 టెక్నాలజీ టీమ్ కూడా యాడ్స్ సమస్యను గుర్తించింది. మీరు క్రింద ఉన్న ఫొటోల్లో గూగుల్ మెసేజెస్ యాప్‌కు కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి పాపులర్ సంస్థలకు చెందిన వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్స్ నుంచి ప్రకటనలు రావడం చూడొచ్చు.
సైబర్ అటాకర్స్ ఈ లొసుగును గుర్తించినట్లయితే, వారు మాల్వేర్తో లింక్స్ పంపించి యూజర్ల ఫోన్స్ ఇన్ఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. భద్రతకు సంబంధించి గూగుల్ ఈ అటాక్స్ ను ఎప్పుడు కోరుకోదు.
* గూగుల్ మెసేజెస్ యాప్‌లో యాడ్స్‌ను ఎలా ఆపాలి
- ముందు గూగుల్ మెసేజెస్ యాప్‌ని ఓపెన్ చేయాలి.
- టాప్ రైట్ కార్నర్లో ఉన్న అకౌంట్ బబుల్‌పై క్లిక్ చేయాలి.
- మెసేజ్ సెట్టింగ్స్ (Message Settings)పై నొక్కాలి.
- చాట్ ఫీచర్స్ (Chat Features) లేదా చాట్ సెట్టింగ్స్ (Chat Settings)కి వెళ్లాలి.
- వైఫై లేదా మొబైల్ డేటా ద్వారా యాడ్స్ రాకుండా ఆపడానికి చాట్ ఫీచర్స్ (Chat Features) ఆప్షన్‌ను టర్న్ ఆఫ్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google messages, Tech news, Technology